కార్తకర్తకు కొలబద్ద

కార్యకర్త విలువను కొలవ డానికి మనం ఉపయోగించే కొలబద్ద ఏమైన ఉందంటే అది అతని విశ్వసనీయతే. ఒక వ్యక్తియొక్క సామర్థ్యం, నైపుణ్యం, కార్యతత్పరత గొప్పవే కావచ్చు. కాని అతనితో సంఘకార్యం పట్ల ధృఢనిశ్చయంపై ఆధారపడిన నిస్వార్థమైన నిబద్ధత లేక పోయినట్లైతే అతడిని కార్యకర్త అని మనం అనలేం. ఒక వైపున సామర్థ్యం, కార్యకుశలత, తత్పరత, మరొక వైపున విశ్వసనీయత, సైద్దాంతిక నిబద్ధత - వీటి మధ్య ఎన్నుకోవలసి వస్తే మనం విశ్వసనీయత, ప్రతిబద్ధత ఉన్న వ్యక్తినే ఎన్నుకుంటాం. అతనికి సామర్థ్యం, నైపుణ్యం తక్కువగా ఉన్నా సరే, సమర్పితభావంలేని కార్యశీలుని కన్నా తక్కువ కార్యశీలత కలిగినప్పటికీ ఆత్మ సమర్పణ భావం ఉన్న వ్యక్తియే మన కార్యదృష్టిలో వాంఛనీయుడు.