అంతర్గత భద్రతకు సవాళ్లు విసురుతున్న మావొయిస్టులు

భారతదేశంలో నక్సల్బరీ ఉద్యమం ప్రారంభమై మే 23కి 50సంవత్సరాలు పూర్తి అవుతున్నాయి. ఈ సందర్భంగా నక్సల్బరీ ఉద్యమా నికి అనుకూలంగా, వ్యతిరేకంగా అనేక మంది తమ అభిప్రాయలు వ్యక్తం చేస్తున్నారు.ఈ 50 సంవత్సరాల కాల ఖండంలో ఆ ఉద్యమం అనేక ఓడిదుడుకులు చూసింది. తాము చేసిన తప్పులను పదే పదే చేస్తూ సామాన్య ప్రజల నుంచి కూడా దూరమయింది. 
ఈ 50సం||లలో దేశరాజకీయల్లో ప్రపంచ, ఆర్థిక వ్యవస్థలలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. చైనా, రష్యాలు తమ సిద్ధాంతలను వదులుకోని తమ దేశం కోసం అనేక మార్పులు చేసుకొన్నాయి. చైనా ఒక రకంగా పెట్టుబడిదారి వ్యవస్థలోకి వెళ్లి పోయింది. దేశంలో ప్రపంచంలో ఎన్నో మార్పులు వస్తున్నా ఈ దేశంలో ఎటువంటి మార్పుకు సిద్ధం లేని వారు కేవలం మావొయిస్టులు, నక్సల్‌ ఉద్యమం ఆంధ్రప్రదేశ్‌, బీహర్‌లలో 1980 నుంచి పీపుల్స్‌వార్‌ పార్టీగా గుర్తింపు పొంది ఉద్యమాలు నడిపించారు. 2000నాటికి అది 16 రాష్ట్రాలకు విస్తరించింది. 2000డిసెంబర్‌ 25న పార్టీ నాయకత్వం ప్రజావిముక్తి గెరిల్లా సైన్యం ఏర్పడింది. 2004 సెప్టెంబర్‌ 21న దేశంలో ప్రధానంగా పనిచేస్తున్న విప్లవ పార్టీలు రెండు కలిసి సిపిఐ (మావొయిస్టు) పార్టీగా ఆవిర్బావించింది. ఇప్పుడు జాతీయస్థాయిలో అది పని చేస్తుంది.
నక్సల్బరీ మూల సిద్ధాంతాలను కొద్దిగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. 1. దేశంలో ఇప్పుడున్న ప్రజాస్వామ్య వ్యవస్థపై వారికి విశ్వాసం లేదు. ఆ వ్యవస్థను కూల ద్రోసి రాజ్యాధికారం చేజిక్కించుకోవటం వారి లక్ష్యం. ''తుపాకి గొట్టం ద్వారానే రాజ్యధికారం సిద్ధిస్తుంది'' అనేది వారి నినాదం. 2. గ్రామస్థాయి నుంచి దేశానికి సంబంధించిన నాయకత్వాన్ని అంతమొందించడం ఆ స్థానంలో కొత్త నాయకత్వము నిర్మాణం చేయటం. దాని కోసం 1980-90సంవత్సరాలలో ఆంధ్రప్రదేేశ్‌ ముఖ్యంగా తెలంగాణలో వారి దాడులకు కేంద్రం గ్రామీణ క్షేత్రం. అక్కడ నాయకత్వ నిర్మూలన దానితో పాటు వివిధ సంస్థల నాయకులను కూడా వారు వదిలి పెట్టలేదు. ప్రభుత్వంతో పోరాటం చేయటం రాజకీయ నాయకులను కూడా అంతమొందించటం వారి పని. ప్రజ ఉద్యమాల నిర్మాణం చేయటానికి వివిధ రాజకీయ పార్టీ నాయత్వాలను బలవంతంగా ముందుకు నడిపించారు. ఇది సరికాదు అని తెలసుకుని దాని నుంచి బయటకు వచ్చారు. ఈ మధ్య కాలంలో అంటే రెండు దశాబ్దలుగా పత్రికలలో వారి కార్యకలపాల కంటే పోలీసులకు వారికి మధ్య జరిగిన కాల్పులు మాత్రమే పతాక శిర్షికలలో ఎక్కుతున్నాయి.
భారతదేశం, చైనా, రష్యా దేశాలలో సామాజిక సాంస్కృతిక ఆర్థిక పరిస్థితుల మధ్య చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. కాని మావొయిస్టులు చైనా, రష్యా పరిస్థితులకు అనుగుణంగా భారతదేశ పరిస్థితులను విశ్లేషించి అంచనా వేస్తుంటారు. వాళ్లు చెప్పే వర్గాలకు భారతదేశంలో ఉన్న కులాలకు వాటి ఆస్తిత్వనికి మధ్య ఉన్న సామాజిక కోణం అర్థం చేసుకోలేని వారు మావొయిస్టులు. భారత దేశంలో అనేక జాతులు ఉన్నాయి. అవి తమ ఆస్తిత్వం కోసం ఉద్యమిస్తే ఆ ఉద్యమాలను హైజాక్‌ చేసి నడిపస్తాము అంటారు. 50సం||ల కాలఖండంలో వారు చేసిన హింసాకాండకు 28వేల మంది బలి అయ్యారు. వందలకోట్ల రూపాయలు ప్రజల ఆస్తులు ధ్వంసమైనాయి. ఈ హింస కాండ వారిని చివరకు సురక్షిత స్థావరాల వైపు నడిపించింది. దండకారణ్యం కేంద్రంగా ఇప్పుడు పని చేస్తున్నారు. గిరిజనులను అడ్డం పెట్టుకుని ప్రజల కోసం యుద్ధం కాకుండా కేవలం తమ ఆస్తిత్వం కోసం పోలీసులతో యుద్ధం చేస్తున్నారు. దేశంలో అంతర్గత భద్రతకు సవాళ్లు విసురుతున్నారు. ఇది ఈ రోజున వారి పరిస్థితి.
మావొయిస్టుల మూల అలోచనలకు ఆధారం ఈ దేశంలో చొప్పించబడ్డ వలస వాద సిద్ధాంతమైన ఆర్య ద్రావిఢ సిద్ధాంతం, కమ్యునిస్టు ఆలోచన ఆధారంగా రచించిన చరిత్ర. అందుకే ఈ దేశాన్ని అర్థ భూస్వామ్య, అర్థ వలస దేశంగా చెబుతూ ఉంటారు. ఊహజనితమైన ఆర్య ద్రావిఢ సిద్ధాంతం కాల దోషం పట్టిన మార్క్స్‌ సిద్ధాంతాలను వల్లె వేస్తూ ఆత్మహత్య సదృశ్యంగా వ్యవహరిస్తున్న మావొయిస్టులు 50సం||ల తరువాత వెనక్కి తిరిగి చూసుకుంటే వారు ఎక్కడి నుంచి బయలుదేరారు? ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? ఎటు వెలుతున్నారు? అనేది గందరగోళం అంబెద్కర్‌ ఆలోచనలతో ఏకీభ వించరు. కాని ఈ రోజున దళితులను కలుపు కుని పోవాలనే ప్రయత్నాలు చేస్తున్నారు. నక్సల్బరి ఉద్యమానికి ప్రత్యమ్నాయం ఆలోచించడం అంటే సాయుధ పోరాటం నుంచి బయటకు రావాలి. కాని వారు దాని నుంచి రాలేరు. ఒక రకంగా చెప్పాలంటే దేశంలో అనేక పెనుమార్పులు చోటుచేసుకుంటున్నాయి. దేశంలో ఒక స్థిరత్వం కోసం ఆరాటం, పోరాటం సాగుతున్నది. దేశంలో అందరికి కూడు, గూడు, గుడ్డ ఉండాలని ఉపాధి అవకాశలు కావాలని విపరీత ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ దిశలో ఈ రోజున అందరం భాగస్వామ్యం కావాలి. ఆజ్ఞాత ఉద్యమలు వదిలేసి ప్రజల కోసం ప్రజలకు నాయకత్వం వహించి ప్రజాస్వామ్య పద్ధతులలో ఉద్యమాలు చేసేందుకు బయటకు రావాలి. లేకపోతే మావొయిస్టులు చరిత్ర కాల గర్భంలో కలిసి పోతారు. విద్వేషాలు నిర్మాణం చేయటం మానుకుని వాస్తవ సామాజికి పరిస్థితులను అర్థం చేసుకుని ముందుకు రావడమే వారి ముందున్న కర్తవ్యం. కాలదోషం పట్టిన వారి సిద్ధాంతలు ఆచరణ ఎంత తొందరగా వదిలించు కుంటే అది వారికి దేశానికి ఎంతో మంచిది.