ఆవాలు

ఇది చాల అద్భుతమైన ఔషధం. ఆవ గురించి చెప్పుకుంటూపోతే చాలా పెద్ద గ్రంథమే వ్రాయవచ్చు. కానీ దాని క్లుప్తంగా ఆకులు, గింజలు యొక్క ఔషధ గుణాలు తెలుసుకుందాం. మన పెరట్లో చాలా విరివిగా పోషక సంరక్షణం లేకుండా పెరిగే ఔషధ మొక్క ఇది. ఆకులు ముద్దగా నూరి దెబ్బ తగిలిన చోట కట్టుగట్టిన నొప్పులు, వాపులు తగ్గును. ఆవాల నూనెను చిన్న పిల్లల(నెలల పిల్లల) మూర్ధస్థానంలో (అంటే మాడు మీద - ఎక్కడైతే ప్రేమతో తలపైన ముద్దు పెట్టు కుంటామో అక్కడ) ప్రతీ రోజు వ్రాయడం వల్ల మాడు గట్టిపడుతుంది. ఆవాల ఆకులు, గింజలలో విటమిన్‌-ఏ, విటమిన్‌-ఈ చాలా విరివిగ ఉంటుంది. అం
పైన చెప్పిన విధంగా ఆవాలగురించి ఎంతో వ్రాయవచ్చు. 

దువలన తినడం ద్వారా గానీ, జుట్టుకు వ్రాసుకున్నాగానీ, జుట్టు ఎక్కువగా పెరుగుతుంది. ఒక చేప, ఒక చంచా ఆవాలు - అనగా ఒక చేప తినడం ద్వారా వచ్చే ఒమేగా3 కేవలం ఒక చంచా ఆవాల ద్వారా అంతే మోతాదులో లభిస్తాయి. అనేక రకాల చర్మ వ్యాధులకి ఉపశమనం ఆవాల నూనె కలిగిస్తుంది. అన్నిటికన్నా అతిముఖ్యమైన ప్రయోజనం జీర్ణక్రియ. జఠరాగ్నికి ఆవాలు చాల సహకరిస్తాయి. అతి చిన్న పిల్లలకి, పసిపాపలకి దగ్గు, జలుబు, జ్వరం ఉందని డాక్టర్ల వద్దకు పరుగెడతాము. కానీ మన ఇంటిలోనున్న ఆవ నూనె గుర్తు రాదు.అరచేతులు, అరకాళ్ళు, చాతి మీద మర్దన చేయడం వలన చిటికలో తగ్గుతుంది.