ప్రముఖులు మాట

1947 తరువాత ఎన్ని యుద్దాలు జరిగాయో వాటిలో అత్యధికంగా సైనికులు వీరమరణం పొందింది కేవలం 'కశ్మీర్‌'లోనే అనేది నిష్టుర సత్యం. వివిధ రంగాల విలేకరులు దీనిపై విశేషంగా స్పందించాలి. లోతుగా ఆలోచించాలి. కశ్మీర్‌ వాస్తవిక స్థితిగతులను గమనించి నేటి పరిస్థితులను సామాజిక హిత భావనతో ప్రజలకు విశదీకరించాలి. 
- శ్రీమతి సుమిత్ర మహాజన్‌, లోక్‌సభ స్పీకర్‌ 

 ఆత్మ విస్మతిని రూపుమాపి నిద్రావస్థలో వున్న జాతీయ ఆత్మను జాగృతమొనర్చవలసిన అవసరమున్నది. మనం పాశ్చాత్య విదేశీయ దృష్టితోనే మన దేశాన్ని, సమాజాన్ని చూస్తున్నాం. ఇది మన దౌర్బగ్యం. దేశ హితం కోరి విదేశీ-విలాస-వికృత విధానలకు స్వస్తి పలికి స్వదేశీ,స్వాభిమాన, స్వావలంబన దిశవైపు ఆలోచిద్దాం. 
- అరుణ్‌కుమార్‌, రా.స్వ.సే.సంఘ, అఖిల భారత సహ సంస్కర ప్రముఖ్‌ 

 
భారతదేశంలో మైనార్టీల పేర ముస్లింలకు ఎన్ని సౌకర్యాలు, హక్కులు, రుణాలు అందుతున్నా యో అన్ని ముస్లిం దేశాలలో కూడా లేవు. ఇంత స్వేచ్చ,Û అధికారాలు అందుకుంటూనే దేశ వ్యతిరేకభావ నలతో మనుగడ సాగించే వారు ఉన్నారు. ఏదైనా ఆపద కలిగితే ఫలానా నెంబర్‌కు ఫోన్‌ చేయాలని హెల్ప్‌లైన్‌ విడుదల చేయడం కేంద్ర మైనార్టీ కమిషన్‌కు తగదు. ఇక మైనార్టీ కమిషన్‌ ముస్లింలకు సౌకర్యాలతో దేశ హితం పాఠాలు నేర్పాలి. 
- డా|| సురేంద్రజైన్‌, సంయుక్త ప్రధాన కార్యదర్శి, విశ్వహిందూ పరిషత్‌