స్ఫూర్తి

తీవ్రమైన స్వాతంత్య్రం ఉద్యమ కాంక్ష కలిగిన సీతారామరాజుకు తన బ్రిటిష్‌ వ్యతిరేకతను తగ్గించడానికి చిన్నాన్న ద్వారా ప్రభుత్వం 50 ఎకరాల భూమి, ఇల్లు, ఆశ్రమం ఇవ్వడం ఏమాత్రం నచ్చలేదు. అవి తనకు అవసరం లేదని భవిష్యత్తులో ఆ భూమిపై గాని, ఇంటిపై గాని, తాను కాని కుటుంబ సభ్యులు కానీ హక్కులు కోరరని స్పష్టం చేశారు సీతారామరాజు. 
అలా అపారమైన ఆస్తిని తృణప్రాయంగా త్యజించి బ్రిటిష్‌ వారికి తిరిగి అప్పగించేశారు. తరువాత తాను సాగించే పోరాటంలో ఇబ్బంది కలగకుండా 1920లో తల్లి, చెల్లెలు, తమ్ముడిని స్వగ్రామానికి పంపారు. ఆ తరువాత మన్యంలో విప్లవ తిరుగుబాటును తీవ్రతరం చేసి తూర్పు గోదావరి, విశాఖ జిల్లాలో 8పోలీస్‌ స్టేషన్లపై దాడి చేశారు. అలాగే రామరాజును పట్టుకోడానికి ఏజెన్సీకి వచ్చే మిలటరీ గుడారాలపై ఆకస్మాత్తుగా దాడి జరిపి ముట్టపెట్టేవాడు. ఆ విధంగా బ్రిటిష్‌ అధికారులకు ముచ్చెమటలు పట్టించేవాడు.