హిందూ పేషంట్లకు వైద్యం ఆపేస్తా - ముస్లిం మహిళా డాక్టర్‌ హెచ్చరిక

ముంబాయికి చెందిన ముస్లిం మహిళా డాక్టర్‌ ట్విట్టర్‌ వాగ్వాదంలో నోరుజారి ఇబ్బందుల్లో ఇరుక్కున్నారు. ''కీర్తన్‌.. ఇంకోసారి నువ్వు ఇస్లాం గురించి మాట్లాడావంటే మా డయాలసిస్‌ వార్డులో రక్త శుద్ధి చేయించుకుంటున్న హిందూ రోగులందర్నీ వెళ్లగొట్టేస్తా. చచ్చి ఊరుకుంటారు'' అని వైద్యురాలైన అనీఖా గనీ వ్యాఖ్యానించారు. ముస్లింల మీద ఫేస్‌బుక్‌ వేదికగా దాడికి దిగే పిరికి వాళ్లంతా నేరుగా పాకిస్థాన్‌కు వెళ్లి యుద్ధం చేయాలని సలహా ఇచ్చారు. అనీఖా గనీ వ్యాఖ్యలు దుమారం సష్టించాయి. 
ఆమెపై భారతీయ వైద్యుల సంఘానికి పలు ఫిర్యాదులు వచ్చాయి. ఆమె ఐఎంఏ సభ్యురాలు గానీ, మహారాష్ట్ర వైద్య మండలి సభ్యురా లు గానీ కాదు. దాంతో ముందు ఆమె డిగ్రీ అసలుదో నకిలీదో తేల్చాలని ఐఎంఏ, ఎంసీఐని కోరింది. మత ప్రాతిపదికన వైద్యం నిరాకరించడం మెడికల్‌ కౌన్సిల్‌ నిబంధనల ప్రకారం నేరమని, డాక్టర్‌ గజనీపై చర్యలు తప్పవని చెబుతున్నారు.

గోవును వధిస్తే నాన్‌బెయిల్‌బుల్‌ కేసు
గోవులు, పశుగణాలను వధించినా, గాయపరిచినా నాన్‌బెయిలబుల్‌ సెక్షన్ల కింద నిందితులపై కేసులు నమోదు చేసే విధంగా ఐపిసి సెక్షన్‌ 429కు సవరణలు చేయాలని హైకోర్టు ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలను ఆదేశించింది. ఐపిసి సెక్షన్‌కు సవరణలు చేసే విధంగా ఒక నెల రోజులు గడువు ఇచ్చింది. జూలై 7వ తేదీలోగా రెండు రాష్ట్రాలు తమ ఆదేశాలను పాటించాలని కోరింది.ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బి శివశంకరరావు ఆదేశాలు జారీ చేశారు. హైకోర్టు 2014 సెప్టెంబర్‌లోనే గోవధ, పశువులను వధించిన కేసులో నిందితులపై నాన్‌బెయిలబుల్‌ కింద కేసులు నమోదు చేయాలని, ఐపిసి 429కు సవరణ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. గోవధకు సంబంధించి దాఖలైన క్రిమినల్‌ రివిజన్‌ పిటిషన్‌ను హైకోర్టు డిస్మిస్‌ చేసింది. ఈ కేసులో ఆరోగ్యకరమైన ఆవు అనారోగ్యకరంగా ఉందని తప్పుడు ధ వీకరణ పత్రం ఇచ్చిన వెటర్నరీ వైద్యులపైన కూడా క్రిమినల్‌ కేసులు, నాన్‌బెయిలబుల్‌ కేసులు నమోదు చేసే విధంగా ఏపి గోవధ నిషేధం చట్టం 1977 సెక్షన్‌ 10నిబంధను చేర్చాలని కోర్టు ఇచ్చిన ఆదేశాల అమలులో ఎటువంటి పురోగతి కనపడడంలేదని హైకోర్టు పేర్కొంది. వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలను ఉదహరిస్తూ, గోవులు తల్లితో సమానం, తల్లి పాలు అనేక కారణాల వల్ల బిడ్డకు లభించని పరిస్ధితుల్లో గోపాలను పసిపిల్లలకు ఇస్తారు. ఈ పాలు శిశువులకు బలమైన పౌష్టికాహారం. గోవు పాలను తాగనంత మాత్రాన, కేవలం భుజించడం కోసమని పవిత్రమైన తల్లితో సమానమైన గోమాతను చంపడాన్ని ఎలా సమర్ధిస్తామని హైకోర్టు పేర్కొంది. వేదాలు కూడా ఎటువంటి పరిస్ధితుల్లో గోవులను వధించడం, భుజించడాన్ని అనుమతించలేదని హైకోర్టు పేర్కొంది.
క్రైస్తవులు పవిత్రంగా భావించే బైబిల్‌ కూడా గోవధను అనుమతించలేదన్నారు. ఈ కేసుపై హైకోర్టు ఆదేశాలను మార్చి 1వ తేదీ జారీ చేసి జూన్‌ 5వ తేదీ వరకు గడువు ఇచ్చింది. ఈ ఆదేశాలను రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు అందించాలని కోర్టు పేర్కొంది. కాగా మరింత గడువు కావాలని పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లు శుక్రవారం కోరగా, జూలై 7వ తేదీ వరకు హైకోర్టు ఇచ్చింది.

అవసరమైతే మానవహక్కుల చట్టాలను తొలగిస్తాం : బ్రిటన్‌ ప్రధాని
దేశ అంతర్గత భద్రత విషయంలో కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలానుకుంటున్న బ్రిటిష్‌ ప్రధాని థెరసా మే అందుకు అవసరమైతే మానవ హక్కుల చట్టాలను సైతం సవరించడం గాని అడ్డుగా ఉన్న అంశాలని తొలగిస్తామని స్పష్టం చేశారు. విదేశీ అనుమానితులను త్వరగా దేశం నుండి బహిష్క రించడానికి, తీవ్రవాద కార్యకలాపాలను నిరోధించ డానికి ఇలాంటి చర్యలు అవసరమని మే అన్నారు. లండన్‌ బ్రిడ్జ్‌, మాంచస్టర్‌, వెస్ట్‌ మినిస్టర్‌ మొదలైన ప్రదేశాలలో జరిగిన తీవ్రవాద దాడుల తరువాత థెరసా మే ప్రభుత్వం పై ఒత్తిడి పెరిగింది. ఇంటలి జెన్స్‌ వైఫల్యం, ప్రభుత్వ మెతక వైఖరి కారణంగానే ఇలాంటి దాడులు జరుగుతున్నాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అవసరమైన వెంటనే కరూా్య విధించడం, అనుమానితుల కదలికలపై ఆంక్షలు విధించడం మొదలైన చర్యలు చేపట్టడానికి వీలుగా తీవ్రవాద నిరోధక, విచారణ విధానాన్ని పటిష్ట వంతం చేయాలని బ్రిటిష్‌ ప్రభుత్వం భావిస్తోంది. అలాగే నిందితులను ఎలాంటి విచారణ లేకుండా జైలులో ఉంచగలిగే కాల పరిమితిని కూడా 14 రోజులనుండి 28రోజులకు పెంచాలని యోచి స్తోంది. ఈ చర్యలన్నీ చేపట్టడానికి అవసరమైతే మానవహక్కుల చట్టాలను సవరించడానికి ప్రభుత్వం సిద్దంగాఉంది. ఇప్పటివరకు యూరోపియన్‌ మానవహక్కుల సంస్థలో బ్రిటన్‌ ది కూడా కీలక పాత్ర. అయితే భద్రతా దళాలపై వస్తున్న మానవహక్కుల ఉల్లంఘన ఆరోపణలను కూడా తగ్గించడానికి మే ప్రభుత్వం చట్టాలకు సవరణలు చేయాలని చూస్తోంది.