మెంతులు


మెంతిగింజలు, ఆకులు వాడని భారతీయ వంటకం ఉండదు. దీనికి 15 పైగా ప్రయోజనాలు ఉన్నాయి. మెంతులు వల్ల రక్తపోటు, అధిక కొవ్వు, అధిక బరువు, చక్కెర మొదలగు వ్యాధులతో పాటు అజీర్తి, గొంతు నొప్పి, చర్మ వ్యాధులు, కోలన్‌ కాన్సర్‌, హార్ట్‌ బర్న్‌ వంటివి తగ్గడానికి చాలా ఉపయోగపడుతుంది. అంతే కాకుండా పాలిచ్చు తల్లులకు పాలు అధికంగా ఉత్పత్తి జరుగుతుంది. 
రక్తపోటు కోసం ఎన్నో ఇంగ్లిషు మందులు తినే బదులు ఒక చంచా మెంతులు రాత్రి పూట నానపెట్టుకొని పొద్దున్న తింటే చాలా మంచిది.
అధిక చక్కెర వ్యాధి ఉన్నవారు మజ్జిగలో ఒక చంచా మెంతులు నానపెట్టి పరగడుపున తింటే చక్కెర వ్యాధికి చెక్కు పెట్టవచ్చు.
అధిక కొవ్వు ఉన్నవారు మెంతులు నానపెట్టిన నీళ్ళు తాగడం వలన కొవ్వు తగ్గుతుంది.
ఒక చెంచా నిమ్మరసం, పావు చెంచా సైంధవ లవణంలో ఒక చెంచా మెంతులు నానపెట్టాలి. అది తినడం వలన అజీర్తి, ఆమ్లపిత్త మొదలగు వ్యాధులు తగ్గును.
గొంతునొప్పి, వాపు ఉన్నవారు ఒక గ్లాసు నీళ్ళలో ఒక చెంచా మెంతులు కాచి వడపట్టిన నీళ్ళను పుక్కిట పడితే తగ్గుతుంది.
గర్బిణీ స్త్రీలు అయిదవ నెల దాటినప్పటినుంచి ప్రతిదినం 5 నుంచి 10 మెంతిగింజలు తినడం వలన సుఖ ప్రసవం అవుతుంది.
పాలిచ్చే తల్లులు ప్రతిదినం అరచెంచా మెంతులు గానీ, మెంతిపొడిని గానీ తినడం వలన పాలు వద్ధి చెందుతాయి.
మెంతిపిండిని పెరుగులో కలిపి తలమీద పెట్టుకోవడం వలన మాడుపోటు తగ్గుతుంది.
మెంతులతో కషాయం చేసి చల్లార్చిన నీళ్ళతో ముఖం కడుగుకుంటే మొటిమలు తగ్గుతాయి.
మెంతులు, బెల్లం కలిపి లడ్డు తయారు చేసుకొని తినడం వల్ల కొలోన్‌ కాన్సర్‌ తగ్గును.
పైన చెప్పిన ఎన్నో విధమైన ప్రయోజనాలు మన ఇంటి పెరడులో దొరికే మెంతులవల్ల లభించును.