ప్రజా చైతన్యమే దేశానికి శ్రీరామరక్ష

భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి ఈ ఆగస్టు 15కి 70సంవత్సరాలు పూర్తిఅవుతాయి. ఈ 70 సంవత్సరాల కాల ఖండంలో దేశం సమస్యల సుడి గుండంలో ప్రయాణం చేస్తూనే ప్రజాస్వామ్య స్థిరత్వం వైపు వేగంగా అడుగులు వేసింది. ఈ దేశ ప్రజల తమ స్వేచ్చ స్వాతంత్య్రాలను కాపాడుకోవడానికి ఎంతో మూల్యం చెల్లించారు. అనేక మార్పులు- చేర్పులకు లోనవుతూనే దేశం పరాంపరాగత మౌలిక విషయాలను కాపాడుకునే దిశగా ప్రయాణం చేస్తూనే ఉన్నది. దాని కోసం ఎంతో సంఘర్షణ నడుస్తున్నది. మొత్తం మీద భారతదేశం భారతదేశంగా నిలబడడానికి పరంపరాగత సాంస్కృతిక విషయాలే ఆధారంగా అనేక విషయాలు ఈ దేశ ప్రజలకు గ్రహింపుకు రావటం ఎంతో విశేషం.

సమాచార భారతి యాప్‌ విడుదల

గురుపౌర్ణమి సందర్భంగా సమాచార భారతి యాప్‌ విడుదల చేసింది. ఇందులోని 8విభాగాల ద్వార సమా చార భారతి వివరాలు తెలుసుకోవచ్చు. దీని ద్వారా విశ్వసంవాద కేంద్రం కార్యక్రమాలు, జాతీయ భావం, సేవ దృక్ఫథం కలిగిన వార్త లు తెలుసు కోవచ్చును. తెలుగు, ఇంగ్లిష్‌, హిందీ లో చదవవచ్చును. లోకహితం జాగరణ పత్రికను కూడా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చును. దీనితో పాటు ఎవరైన సమాచార భారతితో కలిసి పనిచేయడానికి తమ వంతు సహకారం అందించడానికి కూడా ఈ యాప్‌ అవకాశం కల్పిస్తోంది.

తమిళనాడు పాఠశాలల్లో యోగా పాఠ్యంశం


తమిళనాడు రాష్ట్రంలో అన్ని పాఠశాలల్లో యోగ విద్య ఒక పాఠ్యాంశంగా ప్రవేశ పెట్టబడుతున్నది. 21జూన్‌ నాడు ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా తమిళనాడు విద్యశాఖ మంత్రి పెంగొరట్టియన్‌ ఈ విషయాన్ని ప్రకటించారు. ఈ ప్రకటనను ఆహ్వానిస్తూ కేంద్ర ఆయుష్‌ శాఖ మంత్రి శ్రీపద్‌యస్సో నాయక్‌ ''దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో కూడా యోగా పాఠశాలలో బోధించాలని'' అన్నారు. ఉత్తరప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి దినేష్‌ శర్మ ''యోగాలో తప్పు ఏముంది? కొంతమంది అనవసర విమర్శలు చేస్తున్నారు'' అని అన్నారు. యు.పి. ముఖ్యమంత్రి యోగ దినోత్సవాన్ని ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్ర పాఠశాలలో త్వరలోనే యోగా తప్పనిసరి చేస్తామని ప్రకటించారు.

ఆస్ట్రేలియాలో హిందువులు ముందడుగు
''ఇంట ఈగల మోత - బయట పల్లకి మోత'' అనేది సామెత. ప్రపంచం పలు దేశాలలో హిందువులు విద్యార్థులుగా, ఉద్యోగస్తులుగా, వ్యాపారులుగా ఇంకా వివిధ హోదాలలో ఉంటున్నారు. ఆస్ట్రేలియాలో కూడా హిందువుల సంఖ్య భాగానే ఉన్నది. ఆస్ట్రేలియా జనాభా లెక్కల ప్రకారం 2016 జూన్‌ మాసం నాటికి ఆ దేశపు మొత్తం జనాభాలో హిందువులు 1.9% ఉన్నారు. వీరి సంఖ్య 4,40,300 మంది. 1991 జనాభా లెక్కల ప్రకారం అక్కడ హిందువులు 0.3% మాత్రమే ఉండేవారు. క్యాథలిక్కులు 22.6% ఆంగ్లెయన్‌లు 13.3% కాగా ఏ మతానికీ చెందని వారు అత్యధికంగా 30.1% ఉండడం ఆశ్చర్యం. అమెరికాలోని నోయిడాకు చెందిన హిందూ నాయకుడు రజన్‌జెన్‌ మాట్లాడుతూ ఆస్ట్రేలియాలోని హిందువులను ఆభినందించారు. హిందువులు నిజాయితీగా ఉంటూ చాలా చక్కగా పని చేస్తారని అన్నారు.

అమెరికాలో 'గురు వందనం'
మన దేశంలో గురుపూజోత్సవం జరిపినట్లే అమెరికా దేశంలో కూడా ''గురువందనం'' ఉత్సవా లు నిర్వహించారు. ఆ దేశంలోని హిందూ స్వయం సేవక సంఘం ఆధ్వర్యంలో 1,250 మంది అమెరి కన్‌ ఉపాధ్యాయులను 'గురువందనం' కార్యక్రమం ద్వారా గౌరవించి సత్కరించడం జరిగింది. 2017 సంవత్సర మే-జూన్‌ మాసాలలో అమెరికాలోని 20 రాష్ట్రాల పరిధిలోని వివిధ పట్టణాలలో 65 గురువందనం ఉత్సవాలను హిందూ స్వయంసేవక్‌ సంఘ్‌ నిర్వహించింది. సత్కారం పొందిన వారిలో ఉపాధ్యాయులు, ప్రిన్సిపాల్‌, మరియు పాఠశాల సూపరింటెండెంట్‌లు ఉన్నారు. ఈ కార్యక్రమంలో అమెరికాలోని వివిధ ప్రదేశాల్లో జరిగాయి. విద్యార్థులు సంస్కృతి శ్లోకాలు శ్రావ్యంగా పఠనం చూచి అక్కడ ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు.

ఎయిడ్స్‌ విరుగుడు గోమాత
గోవు తినే పదార్థం గడ్డి మాత్రమేనని మన దేశంలో ఎంతో మంది వాదిస్తూ ఉండవచ్చు గాక! కానీ అమెరికా ఆలోచన ఇంకో విధంగా ఉంది. ''మానవాళిని గడగడలాడిస్తున్న (హెచ్‌ఐవి) రోగాన్ని అడ్డుకోడానికి గోవులు దోహదపడే అవకాశం ఉన్నదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ రుగ్మతని నిలువరించే శక్తివంతమైన యాంటీబాడీలను ఆవుల రోగ నిరోధక శక్తి వ్యవస్థ కేవలం వారాల వ్యవధిలో ఉత్పత్తి చేస్తున్నట్లు వారు గుర్తించారు.

నిమ్మకాయ (నిమ్మ ఆకు)

ఇది ప్రతి ఇంటిముందు, లేక తోటలో ఉండే మొక్క. దీనికి పరిచయం అక?రలేదు. అలా అని పట్టించుకోకపోయినా మన ఆరోగ్యానికి ఎంతో నష్టం. నిమ్మ ఆకుల రసం, లేక నిమ్మ ఆకులు వేసి తోడు పెట్టిన మజ్జిగ చాలా చలవ చేస్తుంది.

వీరనారీమణులకు వందనం!!

మనదేశం రత్నగర్భ. ప్రపంచానికి జ్ఞానభిక్షనుపెట్టింది. కానీ మన సమైక్యతను దెబ్బతీసేలా పాశ్చాత్యులు మనదేశాన్ని దోచుకున్నారు. వారు మనకు మేకులై, పాలకులై మనలను బానిసలుగా చేసి అనేక కష్టనష్టాలపాలు చేశారు. ఆ క్రమంలో మనదేశాన్ని మనమే ఏలుకోవాలి అనే భావన భారతీయులందరికీ కలిగింది. ఆసమయంలోనే అనేక మంది నాయకుల నేత త్వంలో భారత స్వాతంత్య్రానికై అనేక పోరాటాలు జరిగాయి. ఆ క్రమంలో పురుషులతో పాటు మహిళలూ ధైర్య స్థైర్యాలతో పోరాటం జరిపారు. ఆ పోరాటంలో వీరవనితలైన కొందరు మాతమూర్తుల గురించి చెప్పుకుందాం! 

మన ఊరు కడిపికొండ

వరంగల్‌జిల్లా హన్మకొండ మండలంలో కడిపికొండ గ్రామానికి పురాతనమైన చరిత్ర ఉంది. కాకతీయ రాజుల సుపరిపాలనతోపాటు మొగలాయి రాజుల దుశ్చర్యలు, దుర్మార్గాలను కూడా చూసింది ఆ గ్రామం.
ఇప్పటి కడిపికొండను ఒకప్పుడు కడపటికొండగా పిలిచేవారు. 

ఈ 'గోవ్యధ' ఈనాటిది కాదు

గోసంరక్షణ అంటే చాలా ప్రమాదకరమైన, అవాంఛనీయ విషయమనే రీతిలో దేశంలో ప్రచారం సాగుతోంది. ఎప్పుడూ ఏ సమస్య గురించీ మాట్లాడనివారు కూడా గోసంరక్షులవల్లనే దేశంలో హింస, అరాచకత్వం ప్రబలిపోతున్నాయని గగ్గోలు పెట్టేస్తున్నారు. గోరక్షకుల నుండి 'అమాయకులను' (కేంద్ర)ప్రభుత్వం కాపాడలేక పోతోందంటూ విమర్శిస్తున్నారు. అసలు గోవులను రక్షించాల్సిన అవసరం లేనేలేదని, ప్రజల ఆహారపు అలవాట్లలో జోక్యం చేసుకునే అధికారం ప్రభుత్వానికి ఎక్కడదని మరికొందరు నిలదీస్తున్నారు. అయితే ఇలాంటి 'గోవధ' ధోరణి ఈనాటిది కాదు. దీనికి చాలా చరిత్రే ఉంది.

చైనా ఎత్తులు చిత్తు చేద్దాం

ప్రస్తుతం ఒక దేశాన్ని మరో దేశం భౌగోళికంగా, సైనికంగా ఆక్రమించుకునే అవకాశాలు చాలా తక్కువ. ఎందుకంటే అన్ని దేశాలూ సైనికంగా బలపడుతున్నాయి. దీనితో 'దురాక్రమణ' ఆగలేదుకానీ, దాని స్వరూపం మారింది. ఆర్థిక దాడి, చొరబాట్ల ద్వారా ఇతర దేశాల్ని బలహీనపరచి, స్వాధీనం చేసుకోవాలనే వ్యూహం అనుసరిస్తున్నాయి అనేక దేశాలు. వాటిలో ముఖ్యమైనది చైనా. చైనా వ్యూహాన్ని వమ్ముచేసి మన దేశ ఆర్థిక, భౌగోళిక సార్వభౌమత్వాన్ని కాపాడుకోవలసిన సమయం ఆసన్నమైంది. 

మహా నాయకుడు శ్రీకృష్ణుడు

ద్వాపర, కలి యుగాల సంధికాలంలో పుట్టి అప్పుడున్న నాగరక ప్రపంచాన్నంటినీ ప్రభావితం చేసిన వాసుదేవ శ్రీకృష్ణుడు ఎంతటి పరిపూర్ణ వ్యక్తిత్వం, సామర్థ్యం కలవాడంటే ఆయన్ని భగవంతుడి పూర్ణ అవతారంగా పరిగణిస్తాము. అంటే ఆయనలో ఉన్న అనేక వ్యక్తిత్వ లక్షణాలు సాధారణ మానవుల మాట అటుంచి గొప్ప గొప్ప వాళ్లలో కూడా ఒక్క వ్యక్తిలో కనపడవు అని అర్థం. ఆయన వ్యక్తిత్వం, సామర్థ్యం సాధారణ అవగాహనకు అందకపోవడంవల్ల ఆయనను తగినంతగా అర్థం చేసుకోవడం సాధ్యం కాదు. అందువల్లనే ఆయన చేసిన మహా కార్యాలన్నీ మానవాతీతంగా కనిపిస్తాయి. అంతేకాదు ఆయన మీద అనేక అపోహలు, విమర్శలు కూడా ప్రచారంలో ఉన్నాయి. 

ముస్లింల గుంపు మనస్తత్వమే దాడులకు కారణమవుతున్నది

ఈ మధ్య వామపక్ష మేధావులు ఉదారవాద మేధావులు గోసంరక్షణ అంటే ఇస్లాంకి, దళితులకు వ్యతిరేకం అనే ఆలోచనను వ్యాప్తి చేయటానికి కాదు దానిని స్థిరపరచటానికి తర్కవిత్కరాలు చేస్తున్నారు. మోదీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ముస్లింలపైన, దళితులపైన దాడులు పెరిగాయని దేశవ్యాప్త ఆందోళన చేసిన విషయం అందరికీ తెలుసు. ఆ మేధావులు జూలై మాసంలో బెంగాలు ప్రాంతంలోని బసిర్‌హత్‌ పట్టణంలో హిందువులపై జరిగిన దాడులను మాట మాత్రం ప్రస్థావించడం లేదు.

ప్రముఖులు మాట

దేశభక్తి - పౌరాణిక పాత్రలు మరియు తత్సంబంధిత అంశాల ఆధారంగా సినిమాలు రావాలి అనే ఆలోచన సినీ ఇండస్ట్రీలో నిర్మాణం కావడం చాల మంచిది. ఇది సంతోషాన్ని కలిగించే వార్త. ఇటువంటి సినిమాలపై ప్రేక్షకుల ఆసక్తి పెరిగింది. అందువలననే చారిత్రక-దేశభక్తి పౌరాణిక చిత్రాలు వైపు దృష్టి సారించి అటువంటి చిత్రాలే నిర్మాణం కాబోతున్నాయి.
- తిగాంద్రిశు ధూలియా, సిని దర్శకులు

అమరవాణి

శ్లో|| ఉత్సాహం సాహసం ధైర్యం
బద్ధి: శక్తి: పరాక్రమ:
పడితేయత్ర తిష్ఠంతి
తత్ర దేవో: తిష్ఠతి
నీతి శాస్త్రం :
ఉత్సాహం, సాహసం, ధైర్యం బుద్ధి శక్తి పరాక్రమము అను ఈ ఆరు లక్షణములు ఎవ్వని యందు ఉండునో అట్టి వారి యందు దైవముకలడు అనగా విజయము సిద్ధించును.

హితవచనం

మన దేశం, జాతి ఒక చెట్టులాంటివి. స్వరాజ్యం ఆ చెట్టు కాండం అయితే స్వదేశీ, (విదేశీ వస్తు) బహిష్కరణ ఆ చెట్టు కొమ్మలు. స్వరాజ్యం నా జన్మహక్కు. నేను దానిని సాధించి తీరుతాను. దుర్మార్గానికి పాల్పడిన వాడికంటే ఆ దుర్మార్గాన్ని మౌనంగా సహించేవాడే ఎక్కువ అధర్మపరుడు. భగవంతుడు సోమరి అయినవాడికి ఎప్పుడూ సహాయం చేయడు. కర్మ చేసేవారి కోసమే భగవంతుడు అవతారం ఎత్తుతాడు. కాబట్టి కర్మను అంతా అభ్యాసం చేయాలి. మన దేశంలో సమస్య వనరులు, శక్తిసామర్ధ్యాలు లేకపోవడం కాదు. లేనిది చిత్తశుద్ధి.
- లోకమాన్య బాలగంగాధర తిలక్‌

స్ఫూర్తి

1890 కాలంలో దేశ ప్రజలకు, ముఖ్యంగా విద్యావంతులకు ఆంగ్ల ప్రభుత్వ మత్తు బాగా తలకెక్కింది. ఇంగ్లీషువారు రైళ్ళు వేశారు, స్కూళ్ళు పెట్టారు, ఆసుపత్రులు కట్టారు. మాకు దొరలపాలనే బాగుంది. స్వరాజ్యం కోసం లాఠీదెబ్బలు తిని జైళ్ళకు పోవడం అనవసరమనే వాదం ప్రబలంగా ఉండేది. అందుకే 'స్వరాజ్యం నా జన్మహక్కు' అన్న లోకమాన్య తిలక్‌కు ఎక్కడకు వెళ్ళినా 'అసలు స్వరాజ్యం ఎందుకు?' అనే ప్రశ్న ఎదురయ్యేది.

శ్రీకృష్ణ జన్మాష్టమి (ఆగస్టు 14)

శ్రీకృష్ణుడు దేవకీ, వసుదేవులకు దేవకి ఎనిమిదవ గర్భంగా శ్రావణమాసం కృష్ణపక్షం, అష్టమి తిథి రోజు రోహిణి నక్షత్రంలో జన్మించాడు. శ్రీ మహవిష్ణువు బ్రహ్మండాన్ని ఉద్దరించటానికి ఇతిహసంలో ఎనిమిదవ అవతారం శ్రీకృష్ణుడు. శ్రీ కృష్ణుడి జన్మదినాన్ని శ్రీ కృష్ణ జన్మాష్టమి లేదా గోకులాష్టమి అని పిలుస్తారు.