శ్రీకృష్ణ జన్మాష్టమి (ఆగస్టు 14)

శ్రీకృష్ణుడు దేవకీ, వసుదేవులకు దేవకి ఎనిమిదవ గర్భంగా శ్రావణమాసం కృష్ణపక్షం, అష్టమి తిథి రోజు రోహిణి నక్షత్రంలో జన్మించాడు. శ్రీ మహవిష్ణువు బ్రహ్మండాన్ని ఉద్దరించటానికి ఇతిహసంలో ఎనిమిదవ అవతారం శ్రీకృష్ణుడు. శ్రీ కృష్ణుడి జన్మదినాన్ని శ్రీ కృష్ణ జన్మాష్టమి లేదా గోకులాష్టమి అని పిలుస్తారు. 
చేత వెన్నముద్ధ చెంగల్వపూదండ
బంగారు మొలతాడు పట్టుదట్టి సందె తావీదులు సరిమువ్వ గజ్జెటి
చిన్నికృష్ణా నిన్ను చేరి కొలతు.
కృష్ణాష్టమినాడు ప్రజలు పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం కృష్ణుడిని పూజిస్తారు. శ్రావణ మాసంలో లభించే పళ్ళ, అటుకులు, బెల్లం కలిసిన వెన్న, పెరుగు, మీగడ నైవేద్యం పెడతారు. పురవీధుల్లో ఎత్తుగా ఉట్లు కట్టి పోటిపడి వాటిని కొడతారు. అందుకే ఈ పండుగను ఉట్ల పండు, ఉట్ల తిరునాళ్ళు అని కూడా పిలుస్తారు.
భక్తి శ్రద్ధలతో శ్రీకృష్ణు జయంతిన ఆచరిస్తే కురుక్షేత్రంలో సువర్ణదానం చేసిన ఫలితం దక్కుతుందని బ్రహ్మండ పురాణం తెలియజేస్తోంది. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ అన్న గీతోపదేశంతో మానవాళికి శ్రీకృష్ణుడు దిశానిర్దేశం చేశారు. మహభారత యుద్ధాన్ని ముందుండి నడిపించిన మార్గదర్శి ఆయన. మహభగవతం, మహాభారతం కథలను విన్నా దృశ్యాలను తిలకించినా జీవితానికి సరిపడా విలువలెన్నో బోధపడుతాయి. ద్వాపర యుగంలో జన్మించిన శ్రీకృష్ణుడు నేటి కలియుగానికి ఆదర్శంగా నిలుస్తున్నారు.
అందుకే ఆయనకు అందరూ వివిధ రూపాలలో, సంప్రదాయలతో, ప్రపత్తులతో కొలుస్తున్నారు.