హితవచనం

మన దేశం, జాతి ఒక చెట్టులాంటివి. స్వరాజ్యం ఆ చెట్టు కాండం అయితే స్వదేశీ, (విదేశీ వస్తు) బహిష్కరణ ఆ చెట్టు కొమ్మలు. స్వరాజ్యం నా జన్మహక్కు. నేను దానిని సాధించి తీరుతాను. దుర్మార్గానికి పాల్పడిన వాడికంటే ఆ దుర్మార్గాన్ని మౌనంగా సహించేవాడే ఎక్కువ అధర్మపరుడు. భగవంతుడు సోమరి అయినవాడికి ఎప్పుడూ సహాయం చేయడు. కర్మ చేసేవారి కోసమే భగవంతుడు అవతారం ఎత్తుతాడు. కాబట్టి కర్మను అంతా అభ్యాసం చేయాలి. మన దేశంలో సమస్య వనరులు, శక్తిసామర్ధ్యాలు లేకపోవడం కాదు. లేనిది చిత్తశుద్ధి.
- లోకమాన్య బాలగంగాధర తిలక్‌