తమిళనాడు పాఠశాలల్లో యోగా పాఠ్యంశం


తమిళనాడు రాష్ట్రంలో అన్ని పాఠశాలల్లో యోగ విద్య ఒక పాఠ్యాంశంగా ప్రవేశ పెట్టబడుతున్నది. 21జూన్‌ నాడు ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా తమిళనాడు విద్యశాఖ మంత్రి పెంగొరట్టియన్‌ ఈ విషయాన్ని ప్రకటించారు. ఈ ప్రకటనను ఆహ్వానిస్తూ కేంద్ర ఆయుష్‌ శాఖ మంత్రి శ్రీపద్‌యస్సో నాయక్‌ ''దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో కూడా యోగా పాఠశాలలో బోధించాలని'' అన్నారు. ఉత్తరప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి దినేష్‌ శర్మ ''యోగాలో తప్పు ఏముంది? కొంతమంది అనవసర విమర్శలు చేస్తున్నారు'' అని అన్నారు. యు.పి. ముఖ్యమంత్రి యోగ దినోత్సవాన్ని ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్ర పాఠశాలలో త్వరలోనే యోగా తప్పనిసరి చేస్తామని ప్రకటించారు.

ఆస్ట్రేలియాలో హిందువులు ముందడుగు
''ఇంట ఈగల మోత - బయట పల్లకి మోత'' అనేది సామెత. ప్రపంచం పలు దేశాలలో హిందువులు విద్యార్థులుగా, ఉద్యోగస్తులుగా, వ్యాపారులుగా ఇంకా వివిధ హోదాలలో ఉంటున్నారు. ఆస్ట్రేలియాలో కూడా హిందువుల సంఖ్య భాగానే ఉన్నది. ఆస్ట్రేలియా జనాభా లెక్కల ప్రకారం 2016 జూన్‌ మాసం నాటికి ఆ దేశపు మొత్తం జనాభాలో హిందువులు 1.9% ఉన్నారు. వీరి సంఖ్య 4,40,300 మంది. 1991 జనాభా లెక్కల ప్రకారం అక్కడ హిందువులు 0.3% మాత్రమే ఉండేవారు. క్యాథలిక్కులు 22.6% ఆంగ్లెయన్‌లు 13.3% కాగా ఏ మతానికీ చెందని వారు అత్యధికంగా 30.1% ఉండడం ఆశ్చర్యం. అమెరికాలోని నోయిడాకు చెందిన హిందూ నాయకుడు రజన్‌జెన్‌ మాట్లాడుతూ ఆస్ట్రేలియాలోని హిందువులను ఆభినందించారు. హిందువులు నిజాయితీగా ఉంటూ చాలా చక్కగా పని చేస్తారని అన్నారు.

అమెరికాలో 'గురు వందనం'
మన దేశంలో గురుపూజోత్సవం జరిపినట్లే అమెరికా దేశంలో కూడా ''గురువందనం'' ఉత్సవా లు నిర్వహించారు. ఆ దేశంలోని హిందూ స్వయం సేవక సంఘం ఆధ్వర్యంలో 1,250 మంది అమెరి కన్‌ ఉపాధ్యాయులను 'గురువందనం' కార్యక్రమం ద్వారా గౌరవించి సత్కరించడం జరిగింది. 2017 సంవత్సర మే-జూన్‌ మాసాలలో అమెరికాలోని 20 రాష్ట్రాల పరిధిలోని వివిధ పట్టణాలలో 65 గురువందనం ఉత్సవాలను హిందూ స్వయంసేవక్‌ సంఘ్‌ నిర్వహించింది. సత్కారం పొందిన వారిలో ఉపాధ్యాయులు, ప్రిన్సిపాల్‌, మరియు పాఠశాల సూపరింటెండెంట్‌లు ఉన్నారు. ఈ కార్యక్రమంలో అమెరికాలోని వివిధ ప్రదేశాల్లో జరిగాయి. విద్యార్థులు సంస్కృతి శ్లోకాలు శ్రావ్యంగా పఠనం చూచి అక్కడ ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు.

ఎయిడ్స్‌ విరుగుడు గోమాత
గోవు తినే పదార్థం గడ్డి మాత్రమేనని మన దేశంలో ఎంతో మంది వాదిస్తూ ఉండవచ్చు గాక! కానీ అమెరికా ఆలోచన ఇంకో విధంగా ఉంది. ''మానవాళిని గడగడలాడిస్తున్న (హెచ్‌ఐవి) రోగాన్ని అడ్డుకోడానికి గోవులు దోహదపడే అవకాశం ఉన్నదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ రుగ్మతని నిలువరించే శక్తివంతమైన యాంటీబాడీలను ఆవుల రోగ నిరోధక శక్తి వ్యవస్థ కేవలం వారాల వ్యవధిలో ఉత్పత్తి చేస్తున్నట్లు వారు గుర్తించారు.