ప్రముఖులు మాట

దేశభక్తి - పౌరాణిక పాత్రలు మరియు తత్సంబంధిత అంశాల ఆధారంగా సినిమాలు రావాలి అనే ఆలోచన సినీ ఇండస్ట్రీలో నిర్మాణం కావడం చాల మంచిది. ఇది సంతోషాన్ని కలిగించే వార్త. ఇటువంటి సినిమాలపై ప్రేక్షకుల ఆసక్తి పెరిగింది. అందువలననే చారిత్రక-దేశభక్తి పౌరాణిక చిత్రాలు వైపు దృష్టి సారించి అటువంటి చిత్రాలే నిర్మాణం కాబోతున్నాయి.
- తిగాంద్రిశు ధూలియా, సిని దర్శకులుపాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీఓకే) భారతదేశపు అవిభాజ్య అంగం. కావున మేము అక్కడి యువకుడు 'ఒసామా అలీ' గుండె సంబంధిత చికిత్స కోసం పాకిస్తానీ విదేశ వ్యవహారాల మంత్రి సర్‌తాజ్‌ అజీజ్‌ యొక్క పత్రం అవసరం లేకుండానే వీసా ఇస్తున్నాం.
- సుష్మ స్వరాజ్‌, విదేశాంగ మంత్రి


చిన్న వర్తకులకు 'జీఎస్టీ' వలన తీవ్ర ఇబ్బందులుండ బోతున్నాయన్నది ఒక తప్పుడు సమాచారం. వాస్తవమేమిటంటే రూ. 10లక్షల వరకు లావాదేవీలు జరిపే వారికి జీ ఎస్టీలో నమోదు (రిజిస్ట్రేషన్‌) చేసు కోవా ల్సిన అవసరం లేదు. అంటే రూ. 10లక్షల వరకు జరిపే వర్తకులకు ఎటు వంటి ఇబ్బంది ఉండదు.
- పీయుష్‌గోయల్‌, కేంద్ర మంత్రి