ప్రజా చైతన్యమే దేశానికి శ్రీరామరక్ష

భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి ఈ ఆగస్టు 15కి 70సంవత్సరాలు పూర్తిఅవుతాయి. ఈ 70 సంవత్సరాల కాల ఖండంలో దేశం సమస్యల సుడి గుండంలో ప్రయాణం చేస్తూనే ప్రజాస్వామ్య స్థిరత్వం వైపు వేగంగా అడుగులు వేసింది. ఈ దేశ ప్రజల తమ స్వేచ్చ స్వాతంత్య్రాలను కాపాడుకోవడానికి ఎంతో మూల్యం చెల్లించారు. అనేక మార్పులు- చేర్పులకు లోనవుతూనే దేశం పరాంపరాగత మౌలిక విషయాలను కాపాడుకునే దిశగా ప్రయాణం చేస్తూనే ఉన్నది. దాని కోసం ఎంతో సంఘర్షణ నడుస్తున్నది. మొత్తం మీద భారతదేశం భారతదేశంగా నిలబడడానికి పరంపరాగత సాంస్కృతిక విషయాలే ఆధారంగా అనేక విషయాలు ఈ దేశ ప్రజలకు గ్రహింపుకు రావటం ఎంతో విశేషం.
భారతదేశం స్వాతంత్య్రం కోల్పోవడానికి దారి తీసిన కారణాలు ఏమిటి? స్వాతంత్య్ర సాధనలో మనం ఏమి కోల్పోయాం అనే విషయాలను సమీక్షించుకుని అటువంటి పరిస్థితులు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవటంపైనే మన స్వాతంత్య్ర పరిరక్షణ అంశం ఆధారపడి ఉన్నది. ఈ జాగ్రత్తలు ఈ దేశ ప్రజలు తీసుకుంటున్నారా?అనేది మౌలికమైన ప్రశ్న. ఈ దేశం గడించిన వెయ్యి సంవత్సరాల కాలఖండంలో ఇస్లామిక్‌ సామ్రాజ్యవాదంపై ఎంతో సంఘర్షణ చేసింది. ఇంకా చేస్తూనే ఉన్నది. వెయ్యి సంవత్సరాల పూర్వం పరిస్థితుల గురించి ఆలోచిస్తే ఆ రోజుల్లో దేశంలో శక్తివంతమైన రాజ్యలు లేని కారణంగా మనం ఎంతో మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. ఆ సమయంలో పాలన మాత్రమే ఇస్లాం సామ్రాజ్యవాదంలోకి వెళ్లలేదు. ఈ దేశపు సామాజిక, సాంస్కృతిక విషయాలపై ఓ పెద్ద దెబ్బ తాకింది. దీని నుంచి మనం ఇంకా పూర్తిగా బయట పడలేకపోయాం. ఆ ఘర్షణ ఇంకా కొనసాగుతూనే ఉన్నది. ఈ దేశంలో ఇస్లామిక్‌ సామ్రాజ్యవాదం బలహీనం అవుతున్నవేళ పాశ్చాత్య ప్రాబల్యం క్రమంగా పెరుగుతూ మరో రెండువందల సంవత్సరాలపాటు దేశం మరోరకమైన బానిసత్వం అనుభవించింది. 1857 సంవత్సరంలో ఈస్ట్‌ ఇండియా సైన్యంపై జరిగిన పోరాటంలో దేశంలో హిందువులు, ముస్లింలు కలిసి పోరాటం చేశారు. అదో అరుదైన సంఘటన. 1857 సంవత్సర పోరాటానికి దారి తీసిన కారణాలలో రాజ్యపాలన ఎంతో ప్రాధాన్యత కలిగిన అంశం. ఈ దేశం క్రైస్తవమార్పిడి పాశ్చత్య సాంస్కృతిక అక్రమణపై 90సంవత్సరాల పోరాటం చేయవలసి వచ్చినా, మతం మార్పిడిపై నైతికంగా విజయం సాధించాం. బ్రిటిష్‌రాణి స్వయంగా ఈ దేశానికి వచ్చి మీ మతపరమైన విషయాలలో మేమం జోక్యం చేసుకోమని ప్రకటించింది. ఆ సమయంలో క్రైస్తవ మత మార్పిడులకు తాత్కాలికంగా అడ్డుకట్ట పడింది. ఆ తదుపరి కాలంలో అదే స్ఫూర్తితో స్వతంత్య్రం సంపాదించుకోనుటలో వైఫల్యం చెంది దేశాన్ని ముక్కలు చేసుకున్నాము. దేశ విభజనకు దారి తీసిన పరిస్థితుల ఏమిటి? ఆ పరిస్థితులను చక్కదిద్దుకొనటానికి ఈ దేశం ఏమి చేసింది అనే విషయాన్ని ఈ సమయంలో సమీక్షించుకొనటం ఎంతో సముచితం. దానికి ఎంతో ప్రాధాన్యత కూడా ఉన్నది.

ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం తరువాత దేశంలో చోటుచేసుకున్న పరిస్థితులు జాగ్రత్తగా గమనించాలి. ఆ క్రమంలో రెండు అంశాలను మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. 1. 1857తరువాత ఈ దేశాన్ని బ్రిటిష్‌ పార్లమెంట్‌ వ్యవస్థ నేరుగా పరిపాలించడం ప్రారంభమైంది. ఆ క్రమంలో ఈ దేశంలో ప్రజాస్వామ్య బద్ధమైన ఎన్నికల ప్రక్రియ కూడా క్రమంగా చోటుచేసుకోవటం ప్రారంభమైంది. దాని కోసం రాజకీయ పార్టీలు కూడా ప్రారంభమైనాయి. స్వాతంత్య్ర పోరాటానికి గాంధీజీ నాయకత్వం వహించిన తరువాత కాంగ్రెస్‌ కూడా ఎన్నికల ప్రక్రియలో పాలుపంచుకొనటం ప్రారంభమైనది. అదే క్రమంలో రష్యాలో కమ్యునిస్టు విప్లవం ఈ దేశ నాయకులను ఎంతో ప్రభావితం చేసింది. దీంతో ఈ దేశంలో కమ్యునిస్టు సిద్ధాంతం ప్రవేశించింది.

దేశం స్వాతంత్య్రం సంపాదించుకొన్న వేళ ఇస్లామిక్‌ సామ్రాజ్యవాదం ఈ దేశాన్ని ముక్కలు చేస్తు ఒక కొత్త దేశం సృష్టించుకొంది. జర్మనీ, కొరియాలాంటి దేశాలు రాజకీయ సిద్ధాంతాల కారణంగా విడిపోయి నాయి. అందులో మత ప్రమేయం లేదు. కాబట్టి ఈ దేశాలు ఒక్కొక్కటిగా కలిసిపోతున్నాయి. 1990సంవత్సరంలో జర్మనీ కలిసి పోయింది. బెర్లిన్‌ గోడ పగిలిపోయింది. భారతదేశ విభజన కూడా సమసిపోవాలని దేశం అఖండ భారత్‌ కావాలని కోరుకునే వాళ్ళు ఉన్నారు. ఆ దారిలో మనకు ఎదురవుతున్న సవాళ్ళు ఏమిటి? వాటిని అధిగమించటం ఎట్లా? అనే విషయం ఆలోచిం చాలి. ప్రపంచంలో మిగతా దేశాల విభజనకు భారతదేశ విభజనకు మౌలికమైన అంతరం ఉంటుంది. వెయ్యి సంవత్సరాలపైగా ఈ దేశాన్ని ఇస్లామీకరణ చేయలని చేసిన ప్రయత్నాలలో భాగంగా దేశ విభజనకు జరిగింది. ఒకపక్క మత మార్పిడులతోపాటు భౌగోళికంగా ఆక్రమణలు కొనసాగుతూనే ఉన్నాయి. వాటి కారణంగా ఘర్షణ లు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా బెంగల్‌లో చోటు చేసుకున్న పరిణామాలు గమనించవచ్చు. స్వాతంత్య్ర భారతదేశంలో, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఈ రోజున కూడా ఇస్లామిక్‌ సామ్రాజ్యవాదం మనకు ఎన్నో సవాళ్ళు విసురుతున్నది. దానితో పాటు ఈ దేశంలో కమ్యునిస్టు సిద్ధాంతం రాజ్యాధికారం కోసం చేసే పోరాటాన్ని వేగవంతం చేసేందుకు 50 సంవత్సరాల పూర్వం ప్రారంభమైన నక్సల్‌బరి ఉద్యమం నడుస్తూనే ఉన్నది. మవొయిస్టు ఉద్యమంగా రూపుదిద్దుకొన్న తీవ్రవాద ఉద్యమం ఈ రోజున అనేక రాష్ట్రలలో వ్యాపించింది. మన దేశానికి ఎన్నో సవాళ్ళు విసురుతున్నది. ఈ దేశం ఒక మేధావి వర్గం దానికి పూర్తిగా సమర్థిస్తూ పోరాటం చేస్తు న్నది. దేశ విభజన సమసిపోవటానికి ఎన్నో సవాళ్ళు ఉన్నాయి. దీని కోసం మనం ఏమి చేస్తున్నాం అనేది ఒక మౌలికమైన ప్రశ్న. సామాజి కంగా కూడా మనం ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటు న్నాం. ఆ క్రమంలో మనవాళ్లు, మేధావులే దేశానికి సంబంధించిన అనేక విషయాలపై అపోహలు, విద్వే షం నిర్మాణం చేయటానికి ప్రయత్నం చేస్తు న్నారు. వాళ్ళు కొంత మేరకు విజయం సాధించారని చెప్ప వచ్చు. ఖురాన్‌, బైబుల్‌, దాస్‌కాపిటల్‌ నుంచి మంచి విషయాలు తీసుకొనటంలో లేని అభ్యంతరం మనువు విషయంలో ఎందుకు? ఈ రోజున మన సమాజంలో సామాజిక సమస్యలకు మను వాదమే మూల కారణం అని పదేపదే చెప్పి విద్వే షం కలిగించి అసలు మనువు ఏం చెప్పాడో కూ డా తెలుసుకోవటం ఒక మహాపాపంగా చిత్రీక రించారు. దీనిని మనం అర్థం చేసుకోవలసి ఉన్నది. దేశంలో స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి సామాజిక ప్రజాస్వామ్యం కోసం విశేష ప్రయత్నం జరుగుతున్నది. వందల సంవత్సరాలుగా నిర్లక్ష్యానికి గురైన ప్రజలను మిగతా సమాజంతో పాటు ఎదిగింప చేసేందుకు అటు ప్రభుత్వపరంగా ఇటు సమాజంతో అనేక సంస్థలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. చిల్లర గొడవలు తప్పించి సమాజం సామాజికంగా అందరం కలిసిపోవటానికి చేస్తున్న ప్రయత్నాలు సఫలమవుతున్నాయి. ఈ రోజున దేశం ఎదుర్కొంటున్న ఆ పెద్ద సమస్య రాజకీయ విభేదాలు సృష్టించడం, రాజకీయ లబ్ధికోసం ఎదుటివారిని దూషించడం, వారిపై విద్వేషం నిర్మాణం చేయటం . వాటి నుంచి బయట పడితే దేశంలో సామాజిక ఐక్యతకు అడ్డంకి తొలిగి పోతుంది.