Lokahitham September Issue

అందరిని కలుపుకొని పోయే శక్తే సంఘం


ప్రపంచంలో ఏ దేశంలోనైన ఆ దేశంలోని సామాన్య వ్యక్తులు దేశం కోసం వ్యక్తం చేసే సంసిద్ధత ఆ దేశం యొక్క శక్తి. సామాన్య వ్యక్తులలోని వ్యక్తిత్వ వికాసం దేశ భక్తిని నిర్మాణం చేయాలి. అట్లా శిక్షణ పొందిన వ్యక్తుల భాగస్వామ్యం ఆ దేశ వికాసంలో ఎంతో ప్రాధాన్యత సంతరించుకొంటుంది.

అమరవాణి

శ్లో|| ప్రభూతం కార్యమల్పం వా
యన్నర: కర్తువిచ్ఛతి
సర్వారంభేణ తత్కార్యం
సింహా దేకం ప్రచక్షతే
ఒక వ్యక్తి ఎటువంటి కార్యం స్వీకరించిననూ అది పెద్దది కాని చిన్నది కాని, ఆ కార్యము పూర్తి అగునంతవరకు మధ్యలో దానిని వదలి వేయరాదు. సింహము ... దగ్గరకు పోయి ఆ జంతువును మొత్తం భోంచేసి ఆస్తిపంజరమును మాత్రము మిగిల్చును. మానవుడు కూడా సింహము వలేనే పని పూర్తి అగునంతవరకు మిశ్రమించరాదు.

ప్రముఖులు మాట


కేవలం విదేశీయ దాడుల వలననే దేశం గాయ పడదు. ఇంటిలోపలి శత్రువులు - అలసత్వం, నిరరసనగాను, విస్తేజంగాను, నిరుపయోగంగాను, పనిదొంగల ప్రగల్పాలవల్లను, విదేశీయ- వికృత- విలాస, మానసిక-బానిస ప్రవృత్తి వల్ల కూడా దేశం గాయలపాలవును. 'దేశభక్తి' అంటే ఉపన్యా సాలివ్వడం, పాటలు పాడటం, ఆటలు ఆడటం, నినాదాలివ్వడం మాత్రమే కాదు. 

హితవచనం

మానవుని కేంద్ర బిందువుగా తీసుకొనొ సమస్త సృష్టికి వ్యాఖ్యానం చెప్పుకోవడం మానవతావాదం క్రిందికి వస్తుంది. మానవుని కోసం సమస్త వ్యవస్థలు ఏర్పడ్డాయని చెప్పడం మానవతావాదమవు తుందా? అయితే మానవుడు ఎంత గొప్పవాడై నప్పటికీ, అతడు తన వ్యక్తిగత స్వార్థం కోసం సమస్త జడచేతనాలను, పశుపక్షి జంతు సంతానాన్ని సహజ వృక్ష సంపదను నిర్మూలించడం మానవతా వాదం కాదు. 

డా. సర్వేపల్లి రాధాకృష్ణన్‌ జయంతి

డా. సర్వేపల్లి రాధాకృష్ణన్‌ 1888 సం||లో తమిళ నాడులోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన తిరుత్తణిలో మధ్య తరగతి హిందూ కుటుంబం లో జన్మించాడు. వారు భారతీయ తత్వశాస్త్రంపై భారతీయ ఆలోచనా విధానానికి నిలువెత్తు దర్పణం. ఆధునిక ధోర ణులతో 150కి పైగా పుస్తకాలు ప్రచురించారు. 1949లో నెహ్రూ కోరిక మేరకు రష్యాకు భారత రాయభారిగా వెళ్లారు.

విజయదశమి


విజయదవమి శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులు దేవీ నవారాత్రులు, పదవ రోజు విజయదశమి కలపి దసరా అంటారు. శరదృతువు ప్రారంభంలో వచ్చే పండుగ కనుక శరన్నవరాత్రి అంటారు.

కోర్టు తీర్పుల విశేషాలు


ఈ మధ్యకాలంలో కోర్టుల తీర్పు; కోర్టుల వ్యాఖ్యలు దేశ హితాన్ని రాజ్యంగ సంరక్షణకు బలం చేకూర్చే విధంగా ఉన్నాయి. త్రిఫుల్‌ తలాఖ్‌పై సుప్రీంకోర్టు తీర్పు వ్యాఖ్యానాన్ని గమనించాలి. విడాకులు చట్ట బద్ధంగా తీసుకోవాలి. తలాఖ్‌ తలాఖ్‌ తలాఖ్‌ అనడం చట్ట బద్దం కాదు. వాళ్ల మత గ్రంథాలలో కూడా అట్లా లేదని వ్యాఖ్యనించింది. దీంతో దేశమంత ఆసక్తికరమైన చర్చ జరిగింది. ముస్లిం మహిళలు ఈ తీర్పును స్వాగతించారు. 

ఉపేక్షితులు, పేదల సంరక్షణే -దీన్‌ దయాళ్‌ జీ తత్వానికి మూలం


70 ఏళ్లుగా దీన్‌దయాళ్‌జీ ఆలోచనలు, తత్వాన్ని ఈ దేశం పట్టించుకోలేదు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఒక సిద్ధాంతం నుండి మరొక సిద్ధాంతా నికి ఊగిసలాడుతూనే ఉన్నాం, కానీ మన నాగరి కత విలువల ఆధారంగా ఆలోచించలేక పోయాం. మన ధార్మిక సంప్రదాయపు విలువలపై ఆధార పడిన ఏకాత్మ మానవ దర్శనాన్ని ఇప్పటికైనా పరిశీలించాలి'' అని ప్రసారభారతి చైైర్మన్‌ శ్రీ.ఎ. సూర్యప్రకాష్‌ అన్నారు. 'సమాచారభారతి', 'చేతన' హైదరాబాద్‌లో (26.8.2017) ఏర్పాటు చేసిన ''ఏకాత్మ మానవతవాదం - ప్రపంచానికి దిశా నిర్దేశం'' అనే సెమినార్‌లో ఆయన మాట్లాడారు. 

శక్తి పూజ

వినయమే వారి బాణం
విజయశీలురకే గౌరవం
శక్తివంతులు ఎవరో
వారి సహనం, దయ,
క్షమే రాణిస్తాయి''
- దినకర్‌ (కురుక్షేత్రం)
జాతీయ కవి రామ్‌ ధారి సింగ్‌ 1946 లో తాను రాసిన కురుక్షేత్రం అనే కావ్యంలో శక్తి గురించి వివరించారు. ఈ కావ్యం వెనుక చాలా కాలం భారత దేశం అనుభవించిన వేదన ఉంది. శక్తిని నిర్లక్ష్యం చేయడం వలన కలిగే పరాభావాలను సైతం సూచిస్తుంది. కొన్ని వందల సంవత్సరాల చరిత్ర తో పాటు మౌలికమైన విలువలను, శక్తిని ఈ దేశం మర్చిపోవడాన్ని గుర్తు చేస్తుంది. ఎపుడైతే వ్యక్తి, సమాజంలో అజ్ఞానం, అహంకారం, నిర్లక్ష్యం లాంటివి విషంలా వ్యాపిస్తాయో, శక్తి ఉపాసన చేయడం, అవసరానికి తగ్గట్టు దానిని వినియోగిం చడం జరగదో అప్పుడు పరాభవం నిశ్చయం అని ఇందులో మూల భావం. 

మన ఊరు


బైరాన్‌పల్లి
ప్రతి గ్రామానికి చరిత్ర ఉంటుంది. ఆధ్యాత్మిక, పురాతన లేదా ప్రకతి సంబంధమైన అంశాలతో ముడిపడి ఉంటుంది. కాని బైరానపల్లి పేరు చెపితే మాత్రం నిరంకుశ నిజాం రాజు సైన్యం, ముస్లిం మతోన్మాద రజాకర్ల దుర్మార్గాలు, దురాగతాలు, వాటిని ఎదురించి నిలిచిన వీరత్వం గుర్తుకు వస్తాయి. రజాకారుల ఆగడాలు, దుశ్చర్యలకు పల్లె ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని కాలం వెళ్ళదీస్తున్న సమయంలో ఊరంతా ఒక్క తాటిపై నిలబడి ప్రత్యక్షంగా తిరుగుబాటు ప్రకటించి యుద్ధం చేసిన గ్రామం అది.

ఇంకెన్నాళ్లకు అధికారిక ఉత్సవం?


సరిగ్గా 69యేళ్లక్రితం...స్వతంత్య్ర భారతావనిలో హైదరాబాద్‌ సంస్థానం విలీనమైన రోజు. రజాకార్ల అరాచకాలు, నిజాం నవాబు చెర నుంచి విముక్తైన రోజు. 1947 ఆగస్టు 15వ తేదీన భారతావనికి స్వాతంత్య్రమని ప్రపంచానికి తెలుసు. కానీ..హైదరాబాద్‌ సంస్థానం విలీనం తర్వాతే 1948 సెప్టెంబర్‌ 17వ తేదీన దేశానికి పూర్తి విముక్తి లభించింది. 

అంగర త్రివిక్రమ్‌ జీ కి పూజ్య సర్‌సంఘచాలక్‌ డా. మోహన్‌ భగవత్‌ గారి శ్రద్ధాంజలి

రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ జ్యేష్ట ప్రచారక్‌ శ్రీ. అంగర త్రివిక్రమ రావు జీ (76సం||) ఆగస్టు 20నాడు హైదరాబాద్‌లో స్వర్గస్తులయ్యారు. ప్రాంత సంపర్క ప్రముఖ్‌గా చాలాకాలం బాధ్యతలు నిర్వర్తించిన త్రివిక్రమ్‌ జీ, కొంతకాలం విశ్వ హిందూ పరిషత్‌ కార్యదర్శిగా కూడా బాధ్యత నిర్వహించారు. కేశవనిలయం, భాగ్యనగర్‌లో జరిగిన శ్రద్దాంజలిలో పూజ్య సర్‌సంఘచాలక్‌ డా. మోహన్‌ జీ భాగవత్‌ మాట్లాడారు.

ఆత్మవిలోపి వ్యక్తిత్వం

రాష్ట్ర సేవికా సమితి త తీయ ప్రముఖ్‌ సంచాలిక వందనీయ ఉషాతాయీజీ (91)నాగపూర్‌లో ఆగస్టు18 నాడు అంతిమ శ్వాస విడిచారు. కర్నాటకలో ఉన్న ఆర్‌ఎస్‌ఎస్‌ పూజ్య సర్‌ సంఘ చాలక్‌ డా. మోహన్‌ జి భాగవత్‌ వందనీయ తాయీజీ శ్రద్ధాంజలి సభలో మాట్లాడుతూ తాయీ జీ స్వర్గస్తులు కావడంపై దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. ఇటీవల ఆమెతో కలిసి రక్షాబంధన్‌ జరుపుకోవడాన్ని గుర్తు చేసుకున్నారు.

భారతీయుల మాదిరి జీవిస్తే అర్ధ భూ మండలం చాలు!

సహజ వనరుల వినియోగం తీరుపై ఒక అంతర్జాతీయ పరిశోధన సంస్థ పలు ఆసక్తికర, ఆందోళనకర అంశాలను వెల్ల డించింది. ప్రపంచ వ్యాప్తంగా మనిషి అవసరాలు, కోరికలను తీర్చాలంటే నేడు 1.7భూ గ్రహాలు కావాలని 'గ్లోబల్‌ ఫుట్‌ ప్రింట్‌ నెట్‌వర్క్‌' అనే ఈ సంస్థ అంచనా వేసింది. వనరుల వినియోగం భవిష్యత్తులోనూ ఇంతే తీవ్రంగా ఉంటే 2030 నాటికి రెండు భూ మండలాలు కావాలని తెలిపింది. అందరూ భార తీయుల మాదిరి వనరులను వినియోగిస్తూ జీవిస్తే భూమి అర్ధభాగం కన్నా కొంత ఎక్కువగా (60 శాతం) ఉంటే సరిపోతుందని తెలిపింది. అమెరికన్‌ జీవన శైలిలా జీవించాలంటే మాత్రం ఐదు భూ గ్రహాలు కావాలని అంచనా వేసింది. కారణం, వారు వనరులను విపరీతంగా వినియోగించటమే. 

పిడికిలి బిగిసింది.. తలాఖ్‌ కథ ముగిసింది..

ఐదుగురు మహిళలు ఛాందసవాదానికి ఎదురొడ్డి నిలిచారు. ముస్లిం మహిళలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య పైన తమ గళాన్ని విప్పారు. తలాఖ్‌ను రద్దు చేయాలంటూ పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిం చారు. కోర్టులో రుజువులతో సహా వాదించేలా చేశారు. చివరకు మానవత్వానికి మచ్చ తెచ్చే తలాఖ్‌ విధానాన్ని రద్దు చేసేలా కోర్టు తీర్పును సాధించారు. 

రైతులను సన్మానించిన భారతీయ కిసాన్‌ సంఘ్‌

'భారతీయ వ్యవసాయ క్షేత్రమే ప్రపంచానికి విజ్ఞ్యానం అందించినది. ప్రజలలో, రైతులలో చైతన్యం లేనిదే ఏ ప్రభుత్వం కూడా సమర్ధవంతంగా పనిచేయలేదు. కనుక ప్రతి ఒక్కరి భాగస్వామ్యంతో రైతు సంక్షేమం గురుంచి, వారు ఆర్థిక ఆభివ ద్ధి సాధించటానికి తోడ్పాటు అందించాలని దానికి భారతీయ కిసాన్‌ సంఘ్‌ చేస్తున్న క షికి అందరు సహకరించాలి'' అని ఆర్‌ఎస్‌ఎస్‌ తెలంగాణా కార్యవాహ శ్రీ ఎక్కా చంద్రశేఖర్‌ ''బలరామ జయంతి రైతు దినోత్సవం'' సందర్బంగా ఆకాక్షించారు.

లవ్‌ జీహదిపై సర్వోన్నత న్యాయస్థానం స్పందన

ప్రేమ పేరుతో హిందూ అమ్మాయిలను వలవేసి లోబరుచుకొని బెదిరించి ముస్లిం మతంలోనికి మార్చడమే లవ్‌ జీహదీ. 2016 డిసెంబర్‌లో కేరళలో 24సం||ల అఖిల అనే విద్యార్థినీని షఫీక జహన్‌ అనే ముస్లిం యవకుడు ప్రేమ పేరుతో వివాహం చేసుకోని బలవంతంగా ఆమెను ఇస్లాం స్వీకరించవలసిందేనని నిర్భంధించ డంతో తల్లిదండ్రులకు చెప్పకుండా ఇంటి నుండి బయటకు వచ్చి మతం మారింది.

అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి అభ్యంతరం లేదు - షియా వక్ఫ్‌ బోర్డు

వివాదాస్పద ప్రాంతంలో రామమందిరం నిర్మాణా నికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని బోర్డు ఛైర్మన్‌ వసీం రజ్వీ సోమవారం లఖ్‌నవూలో వెల్ల డించారు. దీనికి ప్రతిగా వివాదాస్పద ప్రాంతానికి దూరంగా, ముస్లింలు అత్యధికంగా ఉండే ప్రాంతంలో 'మజీద్‌ ఎ అమన్‌' పేరుతో మసీదును నిర్మించాలని కోరారు.