హితవచనం

మానవుని కేంద్ర బిందువుగా తీసుకొనొ సమస్త సృష్టికి వ్యాఖ్యానం చెప్పుకోవడం మానవతావాదం క్రిందికి వస్తుంది. మానవుని కోసం సమస్త వ్యవస్థలు ఏర్పడ్డాయని చెప్పడం మానవతావాదమవు తుందా? అయితే మానవుడు ఎంత గొప్పవాడై నప్పటికీ, అతడు తన వ్యక్తిగత స్వార్థం కోసం సమస్త జడచేతనాలను, పశుపక్షి జంతు సంతానాన్ని సహజ వృక్ష సంపదను నిర్మూలించడం మానవతా వాదం కాదు. 
ఈ అనంత విశ్వ రచనలో మానవుడు ఒక భాగం. మానవునికి ప్రకృతికి పరము తత్త్వానికి మధ్య గల అవిభాజ్య మైన అనుబంధాన్ని మానవతావాదం వివరిస్తుంది. మానవుని కసాయి వాడు కాడు, కరుణామయుడైన యోగి. త్యాగము, ప్రేమ, దయ అతని జీవిత లక్షణా లు. అతనికి మహిష లక్షణాలు ఉన్నాయి. అతనిలో మహిషాసుర మర్దనీ ఉంది. శిశువు నుండి పశువు వైపునకు పశువు నుండి పరమేశ్వరుని వైపునకు సాగించే ప్రయాణాన్నే మనం ఏకాత్మతా మానవతా వాదం అని సంపూర్ణ విద్య అనీ పూర్ణ యోగమనీ పిలస్తున్నాము. ఇది సనాతనమైనది.
- దీన్‌దయల్‌ జీ ఉపాధ్యాయ