లవ్‌ జీహదిపై సర్వోన్నత న్యాయస్థానం స్పందన

ప్రేమ పేరుతో హిందూ అమ్మాయిలను వలవేసి లోబరుచుకొని బెదిరించి ముస్లిం మతంలోనికి మార్చడమే లవ్‌ జీహదీ. 2016 డిసెంబర్‌లో కేరళలో 24సం||ల అఖిల అనే విద్యార్థినీని షఫీక జహన్‌ అనే ముస్లిం యవకుడు ప్రేమ పేరుతో వివాహం చేసుకోని బలవంతంగా ఆమెను ఇస్లాం స్వీకరించవలసిందేనని నిర్భంధించ డంతో తల్లిదండ్రులకు చెప్పకుండా ఇంటి నుండి బయటకు వచ్చి మతం మారింది.

 కానీ వాళ్లు పెట్టే ఆంక్షలు భరించలేక తన తల్లిదండ్రులను చేరి తన తండ్రితో ఆ బలవంతపు వివాహాన్ని రద్దు చేయవల సిందిగా కేరళ హైకోర్టును ఆశ్రయించింది. తన కోర్టు వివాహన్ని రద్దు చేయడంతో సుప్రీం కోర్టులో వ్యాజ్యం వేశాడు. కేంద్ర ప్రభుత్వం తరుపున నేషనల్‌ ఇన్విస్టిగేషన్‌ ఏజేన్సీ (ఎన్‌.వి.ఏ) వాదిస్తూ కేరళలో కేవలం ఇది ఒక్కటే 'లవ్‌ జీహది' మతాంతరీకరణ సంఘటన కాదని, దశాబ్దల కాలంగా కొన్ని వేల సంఘటనలు ఉద్దేశ పూర్వకంగా, ప్రణాలికగా, ఒక నెట్‌వర్కు ద్వారా ఇలాంటి ప్రేమ వివాహలు జరుగుతు న్నాయని దృష్టికి తెచ్చింది. అంతర్జాతీయ, భారత ఇస్లామిక్‌ ఉగ్రవాద సంస్థల హస్తం వున్న ట్లుగా ఎన్‌.ఐఏ తెలిపింది. సుప్రీం కోర్టు రిటైర్డు జడ్జీ పర్యవేక్షణలో విచారణ జరిపి కేరళలో 2006నుంచి ఇప్పటి వరకు జరిగిన లవ్‌ జీహది వివాహల వెనుక ఉన్న సంస్థలు, వ్యక్తులపై నివేదిక సమర్పించవలసిందిగా ఎన్‌.ఐ.ఎ.ను ఆదేశించింది. లవ్‌ జీహది వలన 2006-2012 సంవత్సరాల మధ్య కాలంలో 7.713 మంది యువతలు ఇస్లాంలోకి మతమార్పిడి జరిగిందని అసెంబ్లీలో కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించారు. కాబట్టి, హిందువులారా తస్మాత్‌ జాగ్రత్త.