ఆత్మవిలోపి వ్యక్తిత్వం

రాష్ట్ర సేవికా సమితి త తీయ ప్రముఖ్‌ సంచాలిక వందనీయ ఉషాతాయీజీ (91)నాగపూర్‌లో ఆగస్టు18 నాడు అంతిమ శ్వాస విడిచారు. కర్నాటకలో ఉన్న ఆర్‌ఎస్‌ఎస్‌ పూజ్య సర్‌ సంఘ చాలక్‌ డా. మోహన్‌ జి భాగవత్‌ వందనీయ తాయీజీ శ్రద్ధాంజలి సభలో మాట్లాడుతూ తాయీ జీ స్వర్గస్తులు కావడంపై దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. ఇటీవల ఆమెతో కలిసి రక్షాబంధన్‌ జరుపుకోవడాన్ని గుర్తు చేసుకున్నారు.
 ఆమె జీవితం కేవలం సమితి కార్యకర్తలకే కాక అందరికీ ఎంతో స్పూర్తిదాయ కమన్నారు. తాయీజీ భర్త సంఘ ఘోష్‌ టోలి (జట్టు)లో, తాయీజీ సమితిలో ఉండేవారు. సంఘ్‌లోనూ, మరొకరు సమితి కార్యంలోను ఎప్పుడు నిమగ్న మై ఉండడం వల్ల వాళ్ళిద్దరూ కలిసి ఉన్న సమయం చాలా తక్కువ. ఘోష్‌ టోలి బైఠక్‌ జరిగినప్పుడు మాత్రమే వారిద్దరిని ఒకచోట చూసే అవకాశం కలిగేదని మోహన్‌ జీ అన్నారు.
ఉషా తాయీజీ ఆదర్శ గహిణి. ఎవరితోనైనా అతి త్వరగా స్నేహం చేసుకోగలిగిన తాయీజీ 10-15 నిముషాలలోనే వారితో సన్నిహితురాలు అయ్యే వారు. మదుభాషి తాయీజీ తన నిష్ట, వ్యవహారశైలి ద్వారా సంఘ, సమితి కార్య కర్తలను ఎంతో ప్రభా వితం చేసేవారు. గీత్‌లు పాడటమంటే తాయీజీకి ఎంతో ఇష్టమని, అందుకనే ప్రముఖ్‌ సంచాలిక బాధ్యత తీసుకున్న తరువాత గీత్‌ ప్రస్తుతి కార్యక్రమం తరుచూ నిర్వహించాలని సేవికలను ప్రోత్సహించే వారు. అలా 70శాఖల్లో ఈ కార్యక్రమం జరిగేది. ఏ పని చేపట్టిన దానిని చక్కగా పూర్తిచేయాలని ఆమె కార్యకర్తలకు నిర్ధేశిస్తూ,ఎప్పుడు చిరు మంద హాసంతో కార్యకర్తలలో ఎంతో స్ఫూర్తిని నింపేవారు. ఆమెది ఆత్మవిలోపి వ్యక్తిత్వం అని మోహన్‌ జీ కొనియా డరు. ఉషాతాయీజీ అనుసరించిన విలువలను పాటించడం ద్వారా ఆమె లేని లోటును పూరించే ప్రయత్నం చేయడం సంఘ, సమితి కార్యకర్తలుగా మన కర్తవ్యమని మోహన్‌ జీ గుర్తు చేశారు. వంద నీయ తాయిజీ స్మత్యర్ధం మాత మందిర్‌ ఆవరణలో మోహన్‌ జీ ఒక మొక్కను నాటారు. సెప్టెంబర్‌ 3నాడు దక్షిణ మధ్య క్షేత్ర కార్యవాహక మాననీయ|| సావిత్రక్కతో పాటు వందిమందికి పైగా సమితి కార్యకర్తలు హైదరాబాద్‌లో శ్రద్ధంజలి ఘటించారు.