విజయదశమి


విజయదవమి శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులు దేవీ నవారాత్రులు, పదవ రోజు విజయదశమి కలపి దసరా అంటారు. శరదృతువు ప్రారంభంలో వచ్చే పండుగ కనుక శరన్నవరాత్రి అంటారు.
 నవరాత్రులలో మొదటి మూడు రోజులు పార్వతి దేవీకి, తరువాత మూడు రోజులు లక్ష్మిదేవికి, చివరి మూడు రోజులు సరస్వతి దేవికి పూజలు నిర్వహిస్తారు. దసరా పండుగ విజయదశమి నాడు జరుపుకోవటం జరుగుతుంది. తెలుగు వారు దసరాని పది రోజులు జరుపుకుంటారు. తెలంగాణ ప్రాంతంలో ఈ తొమ్మిది రోజులు అమావాస్య నుంచి నవమి వరకు బతుకమ్మ ఆడుతారు. విజయదశమి నాడు చరిత్ర ప్రకారం రాముడు రావుణుడుపై విజయం సాధించిన సందర్భమే కాకుండా, పాండవులు వనవాసం ఆజ్ఞాత వాసం పూర్తి అయ్యాక జమ్మి చెట్టుపై నుండి తమ ఆయుధాలను తిరిగి తీసిన రోజు. ఈ సందర్భంగా విజయదశమి నాడు ''రావణదహణము'' జమ్మి చెట్టు పూజ నిర్వహించంటం అనవాయితీ. జగన్మాత అయిన దుర్గ మహిషాసూరడనే రక్షసునితో తొమ్మిది రాత్రులు యుద్ధం చేసి అతనిని వధించి జయం పొందిన సందర్భంగా పదవ రోజు ప్రజలంతా సంతోషంగా జరుపుకునే పండుగ విజయదశమి. దేవి పూజ ప్రాధాన్యత ఈశాన్య భారతదేశంలో విశేషంగా ఉంటుంది. హిందూ రాష్ట్ర నవోదయానికి నాందీ వాచకులు డాక్టర్‌ కేశవరావు భలిరాం హెడ్గేవార్‌ ''రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌''ని విజయదశమి పర్వదినము నాడే ప్రారంభించారు.