రైతులను సన్మానించిన భారతీయ కిసాన్‌ సంఘ్‌

'భారతీయ వ్యవసాయ క్షేత్రమే ప్రపంచానికి విజ్ఞ్యానం అందించినది. ప్రజలలో, రైతులలో చైతన్యం లేనిదే ఏ ప్రభుత్వం కూడా సమర్ధవంతంగా పనిచేయలేదు. కనుక ప్రతి ఒక్కరి భాగస్వామ్యంతో రైతు సంక్షేమం గురుంచి, వారు ఆర్థిక ఆభివ ద్ధి సాధించటానికి తోడ్పాటు అందించాలని దానికి భారతీయ కిసాన్‌ సంఘ్‌ చేస్తున్న క షికి అందరు సహకరించాలి'' అని ఆర్‌ఎస్‌ఎస్‌ తెలంగాణా కార్యవాహ శ్రీ ఎక్కా చంద్రశేఖర్‌ ''బలరామ జయంతి రైతు దినోత్సవం'' సందర్బంగా ఆకాక్షించారు.
 బికేఎస్‌ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ పర్యాద అంజిరెడ్డి ఆధ్వర్యంలో 27-08-17 నాడు హైదరాబాద్‌లో నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉత్తమ రైతులుగా ఎంపిక అయినవారిని బికేఎస్‌ వారు సన్మానించారు. పాల ఉత్పత్తిలో శ్రీ కే. వెంకట్‌ రెడ్డి ధర్మరెడ్డి గుడెం, యదాద్రి జిల్లా, కూరగాయలు : శ్రీ దాసరి అంగం రెడ్డి, బాబాగూడా మేడ్చల్‌ జిల్లా; పూలు - శ్రీ కళ్ళెం మోహన్‌ రెడ్డి, శంషాబాద్‌, రంగారెడ్డి జిల్లా; పత్తి - శ్రీ పి రాంరెడ్డి , ఆదిలాబాద్‌ జిల్లా ; మిర్చి - శ్రీ పాతూరి రవీందర్‌, భూపాలపల్లి జిల్లా; వ్యవసాయ రంగానికి పాత్రికేయ వత్తిలో సేవలు అందిస్తున్న శ్రీ రాంబాబు (సాక్షి), శ్రీ సిద్దిరెడ్డి శ్రీనివాస్‌ రెడ్డి (జై కిసాన్‌), స్వచ్చంద సంస్థల తరుపున గ్రామ భారతి- సూదిని స్తంబాద్రి రెడ్డి, సుస్థిర వ్యవసాయకేంద్రం -శ్రీ జి. వి రామంజనేయులు. బికేఎస్‌ రాష్ట్ర కార్యదర్శి శ్రీధర్‌ రెడ్డి, మురళీధర్‌ రెడ్డి, మల్ల రెడ్డి, సురేందర్‌ రెడ్డి, పి. వెంకట్‌ రెడ్డి, తెలంగాణ జిల్లా/మండల/గ్రామ కమిటిల సభ్యులతో పాటు 300వరకు రైతులు పాల్గొన్నారు.