కోర్టు తీర్పుల విశేషాలు


ఈ మధ్యకాలంలో కోర్టుల తీర్పు; కోర్టుల వ్యాఖ్యలు దేశ హితాన్ని రాజ్యంగ సంరక్షణకు బలం చేకూర్చే విధంగా ఉన్నాయి. త్రిఫుల్‌ తలాఖ్‌పై సుప్రీంకోర్టు తీర్పు వ్యాఖ్యానాన్ని గమనించాలి. విడాకులు చట్ట బద్ధంగా తీసుకోవాలి. తలాఖ్‌ తలాఖ్‌ తలాఖ్‌ అనడం చట్ట బద్దం కాదు. వాళ్ల మత గ్రంథాలలో కూడా అట్లా లేదని వ్యాఖ్యనించింది. దీంతో దేశమంత ఆసక్తికరమైన చర్చ జరిగింది. ముస్లిం మహిళలు ఈ తీర్పును స్వాగతించారు. 
షాబానో కేసు నుండి దేశంలో ఈ విషయంపై చర్చ అప్పుడప్పుడు జరుగుతూనే ఉంది. దానికి ఒక నిర్ణయం సుప్రీంకోర్టు వెలువరించడం ఆపై కేంద్రప్రభుత్వం చట్టం చేయాలని చేప్పటం విశేషం. ఈ తీర్పును కాపాడేందుకు ప్రభుత్వ యంత్రాంగం కృతనిశ్చయంతో ఉండాలి. అప్పుడే ఆ తీర్పు ఫలితాలనిస్తుంది. అట్లాగే నిన్నటికినిన్న హర్యానాలోని పంచకుల బాబా గుర్మిత్‌ సింగ్‌పై ఉన్న కేసులలో సి.బి.ఐ కోర్టు ఇచ్చిన తీర్పు దేశంలో న్యాయం కాపాడడానికి జరిగిన ప్రయాసగా కనబడుతుంది. ఇటువంటి విషయాలలో సకాలంలో తీర్పులు వచ్చి శిక్షణ కఠినంగా అమలు జరుగుతున్నపుడు భయం కలగాల్సిన వాళ్ళలో భయం, విశ్వాసం కలగాల్సిన వాళ్లలో విశ్వాసం కలగుతుంది. అదే లేకపోతే తప్పు చేసేవాళ్లకు ధైర్యం తెగింపునిస్తుంది. శివాజీకి జీవితంలో చిన్న వయస్సులో తీర్పు చెప్పవలసి వచ్చింది. ఒక భర్త లేని మహిళను ఒక గ్రామధికారి చేరిచాడు. శివాజి దానికి ఆ గ్రామాధికారి ఒక కాలు ఒక చెయ్యి నరికి వేయ్యమని తీర్పును ఇచ్చాడు. మరొకరు ఇటువంటి దానికి పాల్పడేటందుకు బయపడుతారు. కోర్టు తీర్పులు, వాటి అమలు అప్పుడప్పుడు ప్రశ్నలు రేకేత్తిస్తూ ఉంటాయి. కోర్టు తీర్పుకు ముందు బాబాను అదుపులోకి తీసుకున్నప్పుడు ఆయన భక్తులు చేసిన విధ్వంసం కూడా హర్యానా కోర్టు తీవ్రంగా వ్యాఖ్యనించింది. కర్తవ్యాన్ని ఆదేశించింది. ప్రధాని దేశమంతటికి ప్రధాని కేవలం బీజీపీకే ప్రధాని కాదని అతి తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఈ వ్యాఖ్య రాజకీయ ప్రత్యర్థులకు ఒక అవకాశం ఇచ్చింది. అవకాశం తీసుకుని వ్యాఖ్యనించే వాళ్లకు దేశంలో గతంలో అనేకసార్లు జరిగిన విధ్వంసాలు గుర్తుకు రాలేదు. ఇందిరా గాంధీ హత్య అనంతరం సిక్కులపై జరిగిన దాడులు కాని అనేక సందర్భాలలో రాజకీయ నాయకులు చేపట్టే ఉద్యమలు విధ్వంసానికి దారి తీసిన సంఘటనలు కోకోల్లలు. కోర్టు వ్యాఖ్య ఒక రాజకీయ వ్యాఖ్య అని అందరికి అర్థం అయింది. అట్లాగే ఆధార్‌ కార్డు అంశంపై సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు ఆధార్‌ కార్డు వినియోగం విషయమే అయిన అవి వ్యక్తి స్వేచ్ఛకు సంబంధించిన అంశం. అందుకు రాజ్యంగంలో ఆర్టికల్‌ 21పై చర్చ జరిగింది. వ్యక్తి స్వేచ్ఛకు సామాజిక ప్రయోజనానికి మధ్య ఘర్షణ తలెత్తినప్పుడు వ్యక్తి స్వేచ్ఛ ప్రమాదంలో పడే అవకాశం ఉంది. సమాజానికి ప్రాధాన్యం పెరిగి వ్యక్తి స్వేచ్ఛ అప్రధానమైనప్పుడు రాజ్యంగం అనుసరించవలిసిన విధానాలు చర్చకు రావడం విశేషం. హిందూ సమాజం వ్యక్తి స్వేచ్ఛకు స్వాతంత్య్రానికి సామాజిక సంబంధాలకు పెద్ద పీట వేసింది. ఈ మూడింటి మధ్య సమతుల్యత పాటించబడుతున్నప్పుడు ఏ సమస్య రాదు. అందుకే అన్ని విషయాలు కులంకూషంగా ఆలోచించాలి.
అట్లాగే ఈ నెలలో మరో విశేషం డోక్లాం క్లైమాక్స్‌ సుఖాంతం కావడం ఈ సందర్భంగా అజిత్‌ డోవల్‌ వ్యాఖ్యలలో చాలా స్పష్టత ఉంది. అజిత్‌ డోవల్‌ చైనాను నేరుగా సరిహద్దులలోని వివాదస్పద భూ భాగాలన్ని మీవైపోతాయా? అని ప్రశ్నించారు. ఇరు సైన్యాలు ఒకేసారి వెనక్కి వెళ్లడమే ఈ సమస్యకు పరిష్కారం అని నిఖచ్చిగా తేగేసి చెప్పడం చైనాకు మరో ప్రత్యమ్నాయం లేక వెనక్కి వెళ్ళింది. ఇది తాత్కాలికమా? లేక మరో అవకాశం కోసం ఎదురు చూపా..అనేది వేచి చూడాలి. కాబట్టి మన ప్రభుత్వం, సైన్యం నిరంతర అప్రమత్తత అనే పాఠం డొక్లాం క్లైమాక్స్‌ నుండి నేర్చుకోవాలి.