డా. సర్వేపల్లి రాధాకృష్ణన్‌ జయంతి

డా. సర్వేపల్లి రాధాకృష్ణన్‌ 1888 సం||లో తమిళ నాడులోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన తిరుత్తణిలో మధ్య తరగతి హిందూ కుటుంబం లో జన్మించాడు. వారు భారతీయ తత్వశాస్త్రంపై భారతీయ ఆలోచనా విధానానికి నిలువెత్తు దర్పణం. ఆధునిక ధోర ణులతో 150కి పైగా పుస్తకాలు ప్రచురించారు. 1949లో నెహ్రూ కోరిక మేరకు రష్యాకు భారత రాయభారిగా వెళ్లారు.
 ఆ సమయంలో స్టాలిన్‌ను ప్రపంచంలోనే అత్యంత కఠిన నియంతగా పరిగణించేవారు. అటువంటి స్టాలిన్‌ను రాధాకృష్ణన్‌గారు పలకరించినప్పుడు ఆత్మీయంగా 'స్టాలిన్‌' క్షేమ సమా చారాలను రాధా కృష్ణన్‌గారు అడిగినప్పుడు ఆ ఆప్యా యతకు ఆత్మీయతకు అంతటినియంత సైతం చలించి పోయాడు. అప్పుడు స్టాలిన్‌ రాధాకృష్ణన్‌ సంకు చితుడైన దేశ భక్తుడుకాదు. బాధాతపత్త మానవాళిని చూస్తే ఆయన గుండె రక్తం స్రవిస్తుంది. వారి బంధువులు సైతం ఆ గురు శిష్యుల అనుబందాన్ని వీడుకోలును చూసి చలించిపోయారు. వారు రాష్ట్రపతిగా ఉన్నప్పుడు మన దేశం 2యుద్ధాలు ఎదుర్కొన్నది. ఒకటి చైనాతోనూ, మరోకటి పాకిస్తాన్‌తోను, అలాగే పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ, లాల్‌బహూదుర్‌ శాస్త్రిల మరణాల సంభవించినప్పుడు, కాని యుద్ధ సమయంలో కాని ఆయన ఆత్మవిశ్వాసం మనోధైర్యం, నిబ్బరం చెక్కు చెదరలేదు. దేశానికి అత్యంత క్లిష్టమైన పరిస్థితులలో కూడా ఉన్నతమైన రాజ్యాంగ పదవులలో ఉన్నతంగా, గంభీరంగా వ్యవహరించి బావితరాల నాయకులకు మార్గదర్శకంగా స్ఫూర్తిగా నిలిచారు.