శక్తి పూజ

వినయమే వారి బాణం
విజయశీలురకే గౌరవం
శక్తివంతులు ఎవరో
వారి సహనం, దయ,
క్షమే రాణిస్తాయి''
- దినకర్‌ (కురుక్షేత్రం)
జాతీయ కవి రామ్‌ ధారి సింగ్‌ 1946 లో తాను రాసిన కురుక్షేత్రం అనే కావ్యంలో శక్తి గురించి వివరించారు. ఈ కావ్యం వెనుక చాలా కాలం భారత దేశం అనుభవించిన వేదన ఉంది. శక్తిని నిర్లక్ష్యం చేయడం వలన కలిగే పరాభావాలను సైతం సూచిస్తుంది. కొన్ని వందల సంవత్సరాల చరిత్ర తో పాటు మౌలికమైన విలువలను, శక్తిని ఈ దేశం మర్చిపోవడాన్ని గుర్తు చేస్తుంది. ఎపుడైతే వ్యక్తి, సమాజంలో అజ్ఞానం, అహంకారం, నిర్లక్ష్యం లాంటివి విషంలా వ్యాపిస్తాయో, శక్తి ఉపాసన చేయడం, అవసరానికి తగ్గట్టు దానిని వినియోగిం చడం జరగదో అప్పుడు పరాభవం నిశ్చయం అని ఇందులో మూల భావం. 
శక్తి కేవలం యుద్ధానికి మాత్రమే పరిమితం అయింది కాదు. శాంతిని నెలకొల్పడానికి కూడా అది చాలా అవసరం. సమర్ధవంతమైన దేశానికి శాంతి మొదటి మెట్టు లాంటిది. రాజనీతి శాస్త్రం ప్రకారం రెండు బలమైన దేశాల మద్య యుద్ధాన్ని నివారించడానికి శక్తి సమతుల్యత పాటించడం ఎంత అవసరమో తెలుసు. ప్రత్యర్థుల మద్య శక్తి సమానమని తెలిసంత వరకు శాంతికి లోటు ఉండదు. ఎప్పుడైతే ఆ సమతుల్యత లో మార్పు కనపడుతుందో అది శాంతిని కోల్పోవడానికి ఒక మార్గం అవుతుంది. శక్తి సాధన అనేది కేవలం శాంతి గురించే కాకుండా అస్తిత్వాన్ని నిలుపు కోవడానికి ఒక అవకాశం అని కూడా తెలుస్తుంది. మన దేశం ఏనాడయితే శక్తిని కోల్పోయిందో ఆనాటి నుండి కొన్ని శతాబ్దాల వరకు విదేశీ ఆక్రమణదారుల కత్తుల దాడికి గురయ్యింది. దానికి మన చరిత్రే సాక్ష్యం. ఒక అర్థ శతాబ్దం క్రితమే దేశ తొలి ప్రదాన మంత్రి జవహర్‌ లాల్‌ నెహ్రు సైన్యాన్ని బలోపేతం చేయకుండా నిర్లక్ష్యం చేసి పంచశీల సూత్రాలు, శాంతి అనే భ్రమలో పడ్డప్పుడు 1962 లో చైనా చేతిలో మనం పరాజయం చవి చూడవలసి వచ్చింది. కాని 1998 లో అప్పటి ప్రధాన మంత్రి అటల్‌ బిహారీ వాజపేయి నేతత్వంలో అణుబాంబు ప్రయోగం జరిగింది. తదనంతరం మనం కొన్ని దేశాలు విధించిన ఆర్థిక, వైజ్ఞానిక ఆంక్షలను ఎదుర్కొని భారత్‌ ఒక బలీయమైన శక్తి గా ఎదుగుతూ వచ్చింది. ఈ ప్రయోగం తరువాతనే ప్రపంచ దేశాలలో మన గౌరవం పెరుగుతూ వచ్చింది.
శక్తి పూజ అంటే విసత అర్ధంలో ఆర్థిక శక్తి, ఆధునిక వైజ్ఞానిక శాస్త్రంలో వద్ధి, పౌరుల ఆత్మవిశ్వాసం అని కూడా. దాంతో పాటు ప్రజల ఆలోచన, క్రమశిక్షణ గలిగిన సంస్థలు, కాలానికి తగ్గ నైపుణ్యం, సాంస్క తిక, ఆధ్యాత్మిక విలువలతో కూడిన గౌరవం కూడా అందులో భాగమే. ప్రస్తుతం వీటిని ప్రపంచం 'సాఫ్ట్‌ పవర్‌' (మ దువైన శక్తి) అని పిలుస్తుంది. కాని సాఫ్ట్‌ పవర్‌/హార్డ్‌ పవర్‌ అనే రెండు అంశాల సమ తుల్యత ఏ దేశం సాధిస్తుందో అది అప్పటి వరకు ఉన్న తన ప్రభావాన్ని చాల రెట్లు పెంచుకోగలుగుతుంది.
కేవలం శక్తి కలగాలి అని పూజలు చేయడం వల్ల పని జరగదు. సాధించిన శక్తి ద్వార సమాజంలో మార్పును సాధించకపోతే అది కేవలం నిద్రలో కల లాగానే ఉండిపోతుంది. అందుకే శక్తి ఉపాసన, దాని వికాసానికి సమాజ ఏకీకరణ చాల కీలకం. సమయానుకూలమైన సాంకేతిక పరిజ్ఞానం కలిగి, విజ్ఞానవంతమైన సమాజం శక్తికి అనివార్యం. కొద్ది కాలం క్రితం సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో లేని కారణంగా నష్టపోవలసి వచ్చింది. శక్తి ఉపాసన తో పాటు దాన్ని పెంపొందించుకోవడం కూడా ఒక తత్వమే. అట్టి శక్తిని వినియోగించే మానసిక సంసిద్ధత, వివేకంగా దాన్ని ప్రదర్శించడం, అందుకు అవసరమైన సాహసం లేకపోతే అది ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. మన చరిత్రలో చూస్తె హైదరాబాద్‌ సంస్థానాన్ని దేశంలో విలీనం చేయడానికి, ఉక్కు మనిషి సర్దార్‌ వల్లభాయి పటేల్‌ ఆ బలాన్నే ప్రదర్శించాడు. అలా చేయకపోతే హైదరబాద్‌ విలీనం అయ్యేదా? కాని జమ్మూ కాశ్మీర్‌ లో ఆ శక్తి ప్రదర్శన చేయని కారణంగా కొంత భుబాగం ఇప్పటికి పాకిస్తాన్‌ లో ఉండి పోయింది. ఆ తప్పిదం వలన నేటికి మనం దుష్పరిణామాలు అనుభవించాల్సి వస్తోంది. బల ప్రదర్శన చాలా అవసరం. భారతీయ గ్రంథాల్లో దీనికి అనేక ఉదాహరణలు ఉన్నవి. జ్ఞానులలో అగ్రగణ్యుడిగా పిలువబడే పవనపుత్రుడు హనుమంతుడు లంక చేరిన తరువాత అశోక వనంలో రావణ పుత్రుడు మేఘనాధుడి చేతిలో బందింపబడతాడు. తన పని నెరవేర్చుకోవడానికి ఆ అవమానాన్ని సైతం భరిస్తాడు హనుమంతుడు. కాని అవకాశం రాగానే స్వర్ణమయిన లంకను దహనం చేసి తన క్షమతను, వీరత్వాన్ని ప్రదర్శించడం ద్వారా రావణుడికి, అతడి సైన్యానికి బలమైన హెచ్చరిక చేశాడు. శ్రీ రాముడి అపార శక్తిని వాళ్ళకి తెలియ చెప్పాడు. విజయ దశమి నాడు శక్తి పూజ చేయడం కేవలం ఒక ఆచార మాత్రమే కాదు. ఇది భవిషత్తు లో దేశం ఎదుర్కొనే సమస్యలను ఎదుర్కోవడానికి సమాజాన్ని సమాయాత్తం చేయడం గూడా. ప్రస్తుత ప్రపంచ గతిని పరిశీలిస్తే రాబోయే కాలంలో మన జాతీయ మౌలిక విలువలు, జీవన శైలిని కాపాడుకోవడానికి సంఘర్షణ జరిగే అవకాశం కనపడుతున్నది. ఉగ్రవాదం లేదా సాంస్క తిక సామ్రాజ్యవాదం పై ఈ పోరాటం మనం చేస్తూనే ఉన్నాము. వీటిని ఇప్పటివరకు మనం సమర్థవంతగానే ఎదుర్కొన్నాము. ఇక ముందు కూడా ఇలాంటి జటిలమైన సమస్యలను, కుట్రలను అర్ధం చేసుకుంటూ శక్తి సముపార్జన ద్వార ఈ అనివార్యమైన యుద్దంలో విజయం సాధించగాలుగుతాం. దుర్బలత్వం ఎప్పుడు కష్టాలనే తెస్తుంది (దౌర్బల్యం కష్టదం సదా) అని రుషి వాక్యం. - ఉమేశ్‌ ఉపాధ్యాయ