ఉపేక్షితులు, పేదల సంరక్షణే -దీన్‌ దయాళ్‌ జీ తత్వానికి మూలం


70 ఏళ్లుగా దీన్‌దయాళ్‌జీ ఆలోచనలు, తత్వాన్ని ఈ దేశం పట్టించుకోలేదు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఒక సిద్ధాంతం నుండి మరొక సిద్ధాంతా నికి ఊగిసలాడుతూనే ఉన్నాం, కానీ మన నాగరి కత విలువల ఆధారంగా ఆలోచించలేక పోయాం. మన ధార్మిక సంప్రదాయపు విలువలపై ఆధార పడిన ఏకాత్మ మానవ దర్శనాన్ని ఇప్పటికైనా పరిశీలించాలి'' అని ప్రసారభారతి చైైర్మన్‌ శ్రీ.ఎ. సూర్యప్రకాష్‌ అన్నారు. 'సమాచారభారతి', 'చేతన' హైదరాబాద్‌లో (26.8.2017) ఏర్పాటు చేసిన ''ఏకాత్మ మానవతవాదం - ప్రపంచానికి దిశా నిర్దేశం'' అనే సెమినార్‌లో ఆయన మాట్లాడారు. 
'మాత భూమి' భావనలో నమ్మకం లేనివారు దేశ సమైక్యత, సమగ్రతలకు ప్రమాదకారులని హెచ్చరించారు. ప్రతిఒక్కరు తమ తిండి తామే సంపాదించుకోవాలన్నది పాశ్చాత్య భావన అని, కానీ పిల్లలు, వద్ధులు, చేతకానివారిని సమాజమే పోషించాలని, మనిషి కేవలం ఆహార సంపాదన కోసమే పనిచేయకూడదని, సామాజిక బాధ్యతలు, విధులు నెరవేర్చడానికి పనిచేయాలని 1967లోనే దీన్‌దయాళ్‌ జీ ప్రబోధించారని సూర్యప్రకాశ్‌ గుర్తు చేశారు. కార్యక్రమ ముఖ్య అతిథిగా విచ్చేసిన ఱరప అసోసియేట్‌ ప్రొఫెసర్‌ శ్రీ. సుబ్రమణీయన్‌ కష్ణమూర్తితో పాటు 200మందికి పైగా ప్రముఖులు పాల్గొన్నారు.