ప్రముఖులు మాట


కేవలం విదేశీయ దాడుల వలననే దేశం గాయ పడదు. ఇంటిలోపలి శత్రువులు - అలసత్వం, నిరరసనగాను, విస్తేజంగాను, నిరుపయోగంగాను, పనిదొంగల ప్రగల్పాలవల్లను, విదేశీయ- వికృత- విలాస, మానసిక-బానిస ప్రవృత్తి వల్ల కూడా దేశం గాయలపాలవును. 'దేశభక్తి' అంటే ఉపన్యా సాలివ్వడం, పాటలు పాడటం, ఆటలు ఆడటం, నినాదాలివ్వడం మాత్రమే కాదు. 
మనమేరంగం లో ఉన్నాయో, ఏ పని చేస్తున్నప్పటికి దానిలో నిమగ్నమై నీతినియమంగా, నిజాయితీగా - నిరాడంబరంగా శ్రేష్టమైన విధానంలో పని చేసు కూపోవడం కూడా దేశభక్తియే.
- తరుణ్‌ విజయ్‌, పూర్వ రాజ్యసభ సభ్యులు

గ్రామాల్లో నేటికి కూడా నైతిక విలు వలు పటిష్టంగా ఉన్నాయి. దేశంలో పంచాయతి వ్యవస్థ ప్రాచీన కాలం నుండే వివిధ రూపాలలో నేటివరకు కొనసాగుతూ ఉన్నది. మధ్యలో కొద్దిగా ఆంగ్లేయులు పాలన అంతరాయం ఏర్పడినది కాని నేడు సమాజం, ప్రభుత్వ ప్రయత్నాల వలన తిరిగి మనుగడలోకి వస్తోంది. 
- శ్రీరామ్‌ దత్తు, చక్రధర్‌

మన దేశంలో ఎప్పడైతే హిందూ సమాజం కుల-వర్గ-వర్ణ-వక్ర మార్గాల నుంచి బయటికొచ్చి ఏకీకృతమై స్వాభిమాన - సక్రమ మార్గలలో సాగుతుందో ఇక అప్పుడు భవ్య రామ మందిర నిర్మాణా న్ని ఏ శక్తి ఆపజాలదు. తద్వారనే శాంతి-ప్రగతి విశ్వకల్యాణం సిద్ధిస్తుంది.
- శ్రీ సోహన్‌ సింగ్‌ సోలంకి, బజరంగదళ్‌