భారత్‌ జాగృతమవుతోంది - ప.పూ. సర్‌సంఘచాలక్‌ డా.మోహన్‌జీ భాగవత్‌సమాజంలో జాతీయ విలువలను జాగతం చేయాలంటే ముందుగా మన మేధావి వర్గం, ఆలోచనాపరులు సామ్రాజ్యవాద మనస్తత్వం, ధోరణి నుండి బయటపడాలి. సామ్రాజ్యవాద పాలన వల్ల వచ్చిన ఈ లోపాలను, దోషాలు మనలో ఆత్మ దూషణకు, గందరగోళానికి దారితీసాయని రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ సర్‌ సంఘచాలక్‌ డా. మోహన్‌ జీ భాగవత్‌ అన్నారు. నాగపూర్‌లో జరిగిన విజయదశమి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. 

వివక్షతలు రెచ్చగొట్టే భేద తంత్రాన్ని వమ్ము చేయాలి

ఈ మధ్య తెలంగాణ ప్రాంతంలో దేశంలో చోటుచేసుకొన్న మూడు సందర్భాలను; దానిపై పత్రికలలో టి.వి. ఛానళ్ళలో జరిగిన చర్చ; వ్యాఖ్యానాల గురించి; వాటిలోని సత్యాసత్యాల గురించి ఒకసారి ఆలోచిద్దాము. అందులో మొదటి అంశము సెప్టెంబరు 17; తెలంగాణకు ఆ రోజు విమోచనమా? విలీనమా అనే చర్చ. దీనిపై రాజకీయాలు ఏమీ మాట్లాడిస్తున్నవి. ఉదావాద మేధావులతో ఏమి మాట్లాడిస్తున్నవి; రకరకాల సిద్ధాంతాలు ఏమి మాట్లాడిస్తున్నాయి, సంక్షిప్తంగా గమనిద్దాము.

న్యాయ వ్యవస్థలను మార్చుకోవాలి, అందరికీ న్యాయం అందించాలి - డా. మోహన్‌ భాగవత్‌


మన ఋషులు చూపిన నీతిశాస్త్ర మార్గం నుండి ఆధునిక చట్ట నిర్మాతలు ఎంతో నేర్చుకోవలసి ఉంది' అని రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ సర్‌ సంఘచాలక్‌ డా.మోహన్‌ భాగవత్‌ అన్నారు. భాగ్యనగర్‌లోని సరూర్‌ నగర్‌ ఇండోర్‌ స్టేడియంలో జరిగిన అఖిల భారతీయ అధివక్త పరిషత్‌ రజతోత్సవ ముగింపు కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు.

హితవచనం


కేవలం ఒక్క మీ క్రైస్తవ మతం మాత్రమే ఆధ్యాత్మిక ఆనందాన్ని స్తుందని భావిస్తున్నారా? ఇతర మతస్థులెవరికీ వారివారి విశ్వాసాల ఆధారంగా అలాంటి ఆధ్యాత్మికా నందం లభించడం లేదనడం ఎంత దారుణం? నాకు మాత్రం నా భగవద్గీత నుండే కావాల్సిన ఆధ్యాత్మికానందం, ప్రశాంతత, స్థైర్యం లభిస్తున్నాయి. ఇదే నా క్రైస్తవ మిత్రులకు ఈర్ష్య కలిస్తున్నదా?

దయానందుని దేశభక్తి


సకల మానవాళి సంక్షేమమే లక్ష్యం అయినప్పటికీ మహర్షి దయానందుడికి మాతృభూమిపట్ల అపారమైన ప్రేమాభిమానాలు ఉండేవి. ఒకసారి స్వామి దయానందుడి ఉపన్యాసం విని అమితంగా ముగ్ధుడైన ఇంగ్లీషు అధికారి ఆయనతో స్వామీజీ! మీరు దయచేసి ఇంగ్లాండు వెళ్ళి అక్కడ ధర్మమార్గాన్ని బోధించండి. ఖర్చులన్నింటినీ నేను భరిస్తాను అన్నాడు.

దీపావళి


మనకు ఎన్నో ఆపదలూ, కష్టాలూ కలుగుతూ ఉంటాయి. ఎన్నో పొరపాట్లు చేస్తుంటాము. దానికి తగినట్లే దుఃఖాన్నీ అనుభవిస్తుంటాము. 'మనం తప్పు చేశాం. దానికి తగిన ప్రతిఫలం అనుభ విస్తున్నాం' అని ఒక్కొక్కప్పుడు మనకే తోస్తూ ఉంటుంది. ఇంకా కొన్ని దుఃఖాలు, కష్టాలూ మనలను చుట్టుకొన్నప్పుడు 'అయ్యో! నేనే పాపమూ ఎరుగనే? నాకెందుకీ కష్టం? దేనీకీ బాధ!' అని అనుకొంటాం. కారణం తెలుసుకొన్నప్పుడు మనలను మనమే ఓదార్చుకొంటాం.

అమరవాణి


శ్లో|| ముఖం ప్రసన్నం విమలాచ దృష్టిః

కథానురాగో మధురాచ వాణీ

స్నేహాధికః సంభ్రమ దర్శనంచః

సదానురక్తస్య జనస్య లక్షణమ్‌

నవ్వు మొగము, చల్లని చూపు, కథలంటే ఇష్టం, మధురమైన మాటలు, ఎక్కువ స్నేహం, చూచిన వెంటనే ఉత్సాహం ఇవన్నీ అనురాగం కలవారి లక్షణములు అనగా! అంతరంగమునకు ముఖమే అద్దము

ప్రముఖులు మాట


''రోహింగ్యాల గురించి ఎంతో తప్పుడు, అసత్యపు సమాచారం ప్రచారంలో ఉంది. వివిధ వర్గాల మధ్య విభేదాలు సష్టించేందుకు, తీవ్రవాదుల ప్రయోజనాలను కాపాడేందుకు ఇలాంటి సమాచారం ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు జరుగుతున్న దుష్ప్రచారం ఊహకు అందనంత ఉంది.''

- ఆంగ్‌ సాన్‌ సుకి, మయన్మార్‌ కౌన్సిలర

హిందూ కుల పెద్దలతో 'సద్భావన సదస్సు' నిర్వహణ


హిందూ సద్బావన వేదిక అద్వర్యంలో ''సద్భావన సదస్సు'' కేశవా మెమోరియల్‌ కాలేజి, నారాయణ గూడ, హైదరాబాద్‌లో శుక్రవారం నాడు నిర్వహించడం జరిగింది. అందులో హిందూ కుల పెద్దలు పాల్గొన్నారు హిందూవులు ఎదుర్కొంటున్న సమస్యలు వాటిని ఏ విధంగా ఎదుర్కోవాలి అనే విషయాలను చర్చించడం జరిగింది.

రోహింగ్యాలు శరణార్ధులా... శత్రువులా ?


పాస్‌ పోర్ట్‌ కోసం అప్లై చేసుకున్న యువకుడి గురించి విచారణకు వచ్చిన పోలీసులకు అనుమానం కలిగి అదుపులోకి తీసుకుని విచారిస్తే అతను రోహింగ్యా యువకుడిని తేలింది. దానితోపాటు పహడిషరీఫ్‌ పోలీసులకు అనేక విషయాలు తెలిసాయి. మన దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన ఇస్మాయిల్‌ అప్పటికే ఆధార్‌, పాన్‌ , ఓటర్‌ కార్డులు అక్రమంగా సంపాదించేశాడు. ఇస్మాయిల్‌ మయన్మార్‌ దేశపు రఖాయిన్‌ రాష్ట్రానికి చెందినవాడని, పోలీసులకు తెలిసింది. 2014లో ఇతను బాంగ్లాదేశ్‌ గుండా కోల్‌ కతా చేరి అక్కడి నుండి ఢిల్లీ, ఆ తరువాత కర్ణాటకలోని బెల్గాంలో కొంతకాలం పనిచేసి చివరికి పేరు మార్చుకుని హైద్రాబాద్‌లోని పహడిషరీఫ్‌ దుకాణాల్లో పని చేస్తుండేవాడు.

సంక్రమణ పంటలకు చరమ గీతం పాడిన స్వదేశీ జాగరణ మంచ్‌ మరియు భారతీయ కిసాన్‌ సంఘ్‌


గతన కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ అధికారులకు, వ్యవసాయ శాస్త్రవేత్తలకు, పర్యావరణ ఉద్యమకారులకు, సామాజిక శాస్త్రవేత్తలకు మధ్య వాదోపవాదనలకు, చర్చలకు కారణమైన ప్రధానమైన అంశం GM Crops దీనినే సంక్రమణ పంటలుగా మనం భావించవచ్చు.

గృహ వైద్యం


ఇది వర్షాకాలం. నీటికి సంబంధించిన వ్యాధులు వస్తాయి. ముఖ్యంగా అతిసారం (నీళ్ళ విరేచనాలు) తరచుగా బాధిస్తుంది. దీనికి కారణమయ్యే బాక్టీరియాను నాశనం చేయడానికి ఇళ్ళలో లభించే వస్తువులతోనే ఔషధాన్ని తయారుచేసుకోవచ్చును. అవి ఏమిటో చూద్దాం :

ఈ దీపావళికి భారతీయ బాణాసంచా..


ప్రపంచానికి, మరీ ముఖ్యంగా భారతదేశానికి చైనా శిరోభారంగా మారింది. చవకబారు ఉత్సత్తులతో మన మార్కెట్లును ముంచెత్తుతోంది. చైనా బాణాసంచా (టపాకాయలు)ను కూడా వదలకుండా వివిధ ప్రమాదకరమైన రసాయనాలు ఉపయోగించి చవకబారు టపాకాయలు, దీపాలు, బొమ్మ తుపాకులు, బాంబులు ఉత్పత్తి చేసి మనదేశాన్ని ముంచెత్తుతున్నది.

స్ఫూర్తినిస్తున్న పితృదేవతారాధన


మరణిచిన పెద్దలను గౌరవించి తిథి ప్రకారం వారికి 'అన్నం' పెట్టడం అనేది గొప్ప హిందూ సాంప్రదాయం ముఖ్యంగా 'గయ' పట్టణం ఈ పితృకార్యాలకు ఎంతో ప్రాముఖ్యత కలగి ఉన్నది. ఎన్నో హిందూ సత్‌సాంప్రదాయాల పట్ల ఆసక్తి - ఆదరణ కనపరుస్తూ ఆచరణ చేస్తున్న విదేశీయులు ఎంతో మంది ఉన్నారు. మొన్న భాద్రపద పౌర్ణమి నుండి అమావాస్య వరకు జరిగిన మహాలయ పక్షం లేదా పితృపక్షం సందర్భంలో, పాశ్చ్యాత్య దేశాలయిన జర్మనీ, స్పైన్‌, రష్యా నుండి 18 మందితో ఒక బృందం పవిత్ర గయ క్షేత్రానికి తరలి వచ్చారు.

బాల బాలికల ఆపద్బాంధవుడు 'శక్తి మాన్‌'


పిల్లలు సరదాగా చూసే టివీ కార్యక్రమం 'శక్తిమాన్‌' పేరుతో మొదలైన ఒక బాలల ఉద్యమం, కలకత్తా నగరంలోని మురికివాడల పిల్లలకు వరదానంగా నిలిచింది. 15 సంవత్సరాల పిన్న వయస్సులో ఉన్న ఇద్దరు బాలికలు 'సోనీ' 'సరస్వతి' అనే వారు ప్రతిదినం పాఠశాల నుండి తిరిగి రాగానే దగ్గరలోని జుజీజ బస్తీ మురికివాడలో ప్రతి ఇంటికి వెళ్ళి బడికి వెళ్ళని పిల్లలు ఉన్నారా అని చూస్తారు. అలాగే గ్యారేజీల్లో పనిచేసే పిల్లలను గుర్తించి వారిని పాఠశాలకు పంపే ప్రయత్నం చేస్తారు. ఈ ఇద్దరూ చిన్న పిల్లలే అయినప్పటికీ, బాల్య వివాహాలు కూడా జరగకుండా ఆపారు.

దాదాపు 1300 కుటుంబాలు ఉంటున్న జుజీజ బస్తీల ఇతర మురికి వాడల్లో యీ పిల్లలు పనిచేస్తూ ఇతర పిల్లలను కూడా ఈ కార్యక్రమంలో కలుపుకుని వెడుతున్నారు. వీరి ప్రయత్నం కారణంగా చదువుమానేసిన పిల్లలు పిల్లలు మళ్ళీ బడికి వెడుతున్నారు. బాల కార్మికులు కూడా బడిబాట పట్టారు. స్థానిక ఎంఎల్‌ఎ మీద వత్తిడి తెచ్చి యీ పిల్లలు మురికి వాడలో ఒక రోడ్డు కూడా వేయించుకున్నారు.

కదన రంగంలో కాళిమహిళలు అబలలే కాదు.. సబలలని నిరూపించిన సంఘటనలు చరిత్ర మన కళ్ళకు కడుతుంది. తెల్ల తోలు ఆంగ్లేయుల అహంకారానికి తలవంచక దాడికి దిగిన ఝాన్సీరాణి మనకు గుర్తొస్తుంది. దేశ దాస్య శృంఖలాలను తెంచడానికి తెగించినవీర నారీమణుల చరితలు మనకు గర్వకారణంగా నిలుస్తాయి. కిత్తూరు రాణి చెన్నమ్మ.. రాణి గైడునీలు.. కాకతీయ సామ్రాజ్యాన్ని పాలించిన రాణి రుద్రమ దేవి ఇలా ఎందరో వీర వనితలు మనకు స్ఫూర్తిగా నిలుస్తారు. సామాజిక బాధ్యతలోనే కాదు.. కదన రంగంలో కూడా తామేమి తీసిపోమని భారతీయ మహిళలు నిరూపించుకున్న సంఘటనల్లెన్నో. గణక స్త్రీలుగానే కాదు.. ఆయుధం పట్టి యుద్ధం చేయడంలో కూడా తాము తిరుగులేని వారమని చాటి చెప్పుకున్న చరితలెన్నో. ఆధునిక సమాజంలో కిరణ్‌ బేడి వంటి ఎందరో ఐపీఎస్‌లు సమాజానికి రక్షణ కల్పిస్తున్న విషయం మనకు మహిళా శక్తిని చెప్పకనే చెబుతుంది. పురాణాలైనా.. ప్రస్తుతమైనా.. కన్నతల్లి వలే కాచుకునే సహనం కేవలం స్త్రీకే చెల్లుతుంది.