స్ఫూర్తినిస్తున్న పితృదేవతారాధన


మరణిచిన పెద్దలను గౌరవించి తిథి ప్రకారం వారికి 'అన్నం' పెట్టడం అనేది గొప్ప హిందూ సాంప్రదాయం ముఖ్యంగా 'గయ' పట్టణం ఈ పితృకార్యాలకు ఎంతో ప్రాముఖ్యత కలగి ఉన్నది. ఎన్నో హిందూ సత్‌సాంప్రదాయాల పట్ల ఆసక్తి - ఆదరణ కనపరుస్తూ ఆచరణ చేస్తున్న విదేశీయులు ఎంతో మంది ఉన్నారు. మొన్న భాద్రపద పౌర్ణమి నుండి అమావాస్య వరకు జరిగిన మహాలయ పక్షం లేదా పితృపక్షం సందర్భంలో, పాశ్చ్యాత్య దేశాలయిన జర్మనీ, స్పైన్‌, రష్యా నుండి 18 మందితో ఒక బృందం పవిత్ర గయ క్షేత్రానికి తరలి వచ్చారు.


'గయలో హిందువులు తమ పెద్దలకు చేసే తిల-పిండ ప్రదానాలు నాకు ఎంతో స్ఫూర్తిని ఇచ్చాయి. నా భర్త, పెద్దలు మా దేశం తరించాలి అనే కోరికతో ఇక్కడ పితృకార్యం చేయటానికి రష్యా దేశం నుండి ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చాను' అన్నారు శ్రీమతి కృయకోవ్‌ అంతొల్ల. జర్మనీ నుండి వచ్చిన 'అన్నాబరోన్‌' తదితర విదేశీయులు కూడా ఇటువంటి భావనలు వ్యక్తం చేశారు. వీరికి గయ అధికారులు అన్ని సౌకర్యాలు కల్పించి సహకరించారు.