ఈ దీపావళికి భారతీయ బాణాసంచా..


ప్రపంచానికి, మరీ ముఖ్యంగా భారతదేశానికి చైనా శిరోభారంగా మారింది. చవకబారు ఉత్సత్తులతో మన మార్కెట్లును ముంచెత్తుతోంది. చైనా బాణాసంచా (టపాకాయలు)ను కూడా వదలకుండా వివిధ ప్రమాదకరమైన రసాయనాలు ఉపయోగించి చవకబారు టపాకాయలు, దీపాలు, బొమ్మ తుపాకులు, బాంబులు ఉత్పత్తి చేసి మనదేశాన్ని ముంచెత్తుతున్నది.

ఈ ప్రమాదం నుండి దేశాన్ని కాపాడటానికి వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ తగిన చర్యలు చేపడుతున్నది. అందులో భాగంగా విదేశీయ ఉత్పత్తులైన టపాకాయలు, బాంబులు ఇతర ప్రేలుడు పదార్థాలు కలిగి ఉండడము, నిలువ చేసుకోవడము, విక్రయించడము శిక్షార్హమైన నేరాలుగా ప్రకటించారు. ప్రేలుడు వస్తువులు దిగుమతి చేసుకునే అనుమతి మన చట్టంలో ఎప్పుడు ఇవ్వబడలేదు. రమారమి ''ఆరువేల కోట్ల రూపాయల'' విలువైన టపాకాల వ్యాపారం జరుగుతోంది.