వివక్షతలు రెచ్చగొట్టే భేద తంత్రాన్ని వమ్ము చేయాలి

ఈ మధ్య తెలంగాణ ప్రాంతంలో దేశంలో చోటుచేసుకొన్న మూడు సందర్భాలను; దానిపై పత్రికలలో టి.వి. ఛానళ్ళలో జరిగిన చర్చ; వ్యాఖ్యానాల గురించి; వాటిలోని సత్యాసత్యాల గురించి ఒకసారి ఆలోచిద్దాము. అందులో మొదటి అంశము సెప్టెంబరు 17; తెలంగాణకు ఆ రోజు విమోచనమా? విలీనమా అనే చర్చ. దీనిపై రాజకీయాలు ఏమీ మాట్లాడిస్తున్నవి. ఉదావాద మేధావులతో ఏమి మాట్లాడిస్తున్నవి; రకరకాల సిద్ధాంతాలు ఏమి మాట్లాడిస్తున్నాయి, సంక్షిప్తంగా గమనిద్దాము.

1. రాజకీయాలు చేసేవారి అవసరార్థ్థం కొందరు విమోచనం అంటున్నారు; కొందరు విలీనమంటున్నారు. దీనిపై పరస్పర ఆరోపణల పర్వం నడిచింది. 2. ఉదారవాద మేధావులు విమోచనమా; విలీనమా? మొత్తం మీద రజాకార్ల దాడుల పేరుతో ముస్లిలని అణగతొక్కారు; వారిపై ముప్పెట దాడిజరిగిందని వాపోతున్నారు. 3. సిద్ధాంతాల దృష్టితో నైజామ్‌ రాజ్యానికి అన్యాయం జరిగింది. బలవంతంగా కలిపేసు కొన్నారు. దానికి నిరసనలు మన రాష్ట్రంలో కొన్ని చోట్ల నల్ల బాడ్జీలతో సెప్టెంబరు 17న నిరసన ప్రదర్శన చేసారు. వాళ్ళను చూస్తుంటే సత్యం ఏమిటి అనే సంశయం ఏర్పడే అవకాశం ఉన్నది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత దేశాన్ని ప్రజాస్వామ్య వ్యవస్థలోకి తీసుకొని వచ్చేందుకు అన్ని సంస్థానాలతో చర్చలు జరిగాయి. సామ దాన బేధ దండోపాయాలతో అన్నింటిని ప్రజాస్వామ్య వ్యవస్థలోకి తీసుకొని వచ్చారు. నిజాం నవాబు హైద్రాబాద్‌ను ప్రత్యేక రాజ్యంగా ఉంచాలనే చాలా ప్రయత్నించాడు.  దానికోసం రాజ్యేతర సైన్యం తయారీకి కూడా అనుమతిచ్చాడు. ఆయుధాలు సమకూర్చుకొనేందుకు ప్రయత్నించాడు. రాజ్యేతర సైన్యమే రజాకర్లు. వాళ్ల అరాచకం; ఆగడాలతో తెలంగాణా అట్టుడికిపోయింది. అటువంటి పరిస్థితులలో అన్నిదార్లు మూసుకుపోవటంతో కేంద్రం సైనిక చర్యకు పూనుకొని హైద్రబాద్‌ స్టేట్‌ను స్వాధీనం చేసుకొని నవాబుతో భారత రిపబ్లిక్‌లో విలీనం చేయించారు. రజాకార్ల హింసకు ప్రతిగా జరిగిన దాడులతో 40,000 మంది ముస్లింలు చనిపోయారని, ముస్లింలను ఒక రాజకీయ శక్తిగా కాకుండ ఒక మత మైనార్టీలుగా కుదించారని ఉదారవాదులు వాపోయారు. ముస్లింల నైజం తెలిసినవారు ఎవరు దానిని అంగీకరించరు. ఈ దేశం ముక్కలు కావడానికి ఇస్లాం రాజ్యస్థాపన కారణం కాదా? ఎన్ని లక్షల మంది దానికి బలైపోయినారో చరిత్ర చెబుతున్నది. ఒకప్పుడు మనదేశానికి సంబంధించిన ముస్లింల సమస్య ఇప్పుడు ప్రపంచమంతటా ఉన్నది. ఇక రెండవ విషయం, మయన్మార్‌ వాసులు, ఒకప్పటి  చిట్టగాంగ్‌ మూలాలు ఉన్న రోహింగ్యా శరణార్థులను ఆదుకోవాలన్నది ఉదారవాద మేధావుల వాదన. వాళ్ళ వలసలు అడ్డుకోవద్దు అని చర్చలు లేవగొట్టారు. రోహింగ్యాల వలసలకు కారణం ఏమిటి? వాళ్ళు చేస్తున్న అరాచకమే. వలస వచ్చిన వారు ఆ అరాచకాలు ఇక్కడ చేయరని నమ్మకం ఏమటి? ఈ రోజు ముస్లింల వలసలు కేవలం రోహింగ్యాలతో ఆగిపోలేదు. నేడు ప్రపంచంలో ఉన్న ముస్లిం దేశాలలో పెరుగుతున్న నియంతృత్వం, తీవ్రవాదం, యుద్ధ వాతావరణం ముస్లింలను అక్రమ వలసలకు గురిచేస్తున్నాయి. ధనవంతమైన ఇస్లాం దేశాలు వారిని తమ దేశాలలోకి రానివ్వటం లేదు. అల్‌ఖైదా; ఐసిస్‌ ఉగ్రవాదం పెరిగిన తరువాత సిరియ, యమన్‌ వంటి దేశాల నుండి లక్షల మంది ముస్లింలు యూరప్‌కు పోటెత్తారు. ప్రపంచంలో ఐదు ముస్లిం దేశాలుంటే యూరప్‌కే ఎందుకు వలసలు వెళ్తున్నారు? 15 మిలియన్ల ముస్లిం వలసదారులు ఉండవచ్చు అనేది అంచనా. అందులో మూడు మిలియన్లమందికి ముస్లిందేశాలు ఆశ్రయమిచ్చాయి. మిగిలిన వారు ఐరోపా వైపు వెళ్ళిపోయారు. వీళ్ళు అక్కడ చేరిన దగ్గర నుండి ఉద్రిక్త పరిస్థితులు; దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇస్లాం ఆక్రమణ మనస్తత్వం గలది. వారు ఎక్కడ ఉన్నా తమ సంఖ్యాబలాన్ని పెంచుకొనేందుకు అనేక మార్గాలు అనుసరిస్తూ ఉంటారు. దానిలో లవ్‌ జిహాద్‌ ఒకటి. ఈమధ్య కాలంలో మన కోర్టులలో వీటిపై దాఖలైన కేసుల విచారణ జరుగుతున్నది. ఇవన్నీ గమనిస్తూ కూడా ముస్లింలు మారాలని మన ఉదారవాద మేధావులు చెప్పరు. పైపెచ్చు ముస్లింలు నోరుమెదపకుండా చేసి వారి తరపున దేశంలో వాదనలు చేస్తుంటారు. వారిని ఏమనాలి. ఇక మూడవ విషయం, దేశంలో కుల విద్వేషాలు పెంచేందుకు కొందరు పనిగట్టుకొని ప్రయత్నం చేస్తుంటారు. అటువంటి ఒక మేధావి అనుకొనే వ్యక్తి రాసిన పుస్తకం తెలంగాణలో ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. పత్రికలలో ప్రకటనలు; టీవీలలో చర్చలు తారాస్థాయికి చేరుకొన్నాయి. 23వ తేదీనాడు టివిలో జరిగిన చర్చలో పరిపూర్ణానంద స్వామీజీ - ఆ మేధావి మధ్య వాదోపవాదాలు తీవ్రస్థాయికి చేరిపోయాయి. దిగజారిన ఆ మేధావి వ్యక్తిగత దూషణలకు కూడా దిగజారాడు. దీనిని గమనిస్తూ ఉంటే ఇది ఇంకా రాజుకొనేట్లుగానే ఉంది. అసలు ఈ రోజున కులవృత్తులు, కులాల పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? అన్ని కులాల వాళ్ళు తమ బ్రతుకుదెరువు కోసం ఏవో పనులు చేసుకొంటున్నారు; వృత్తులు మారిన ఆ కులాల సామాజిక సంబంధాలు; బంధుత్వాలు మారటం లేదు; మారవు కూడా. దానిని జాగ్రత్తగా అర్థం చేసుకోవలసి ఉన్నది. వృత్తి ఒక వ్యాపారంగా మాత్రమే కాదు; అది ఒక సామాజిక సంబంధంగా కూడా ఈ దేశంలో ఉంది. కులాల మధ్య, వృత్తుల మధ్య సామరస్య వాతావరణం కోసం కృషిచేయాలి గాని విద్వేషాలు రెచ్చగొట్టడం ఎట్లా అర్థం చేసుకోవాలి. దీనిలో ఏదో భేద తంత్రం ఉన్నది. అది రాజకీయమా? లేక మతం మార్పిడులకు ఎత్తుగడనా? లేక సైద్ధాంతిక వైపరీత్యమా? ఆలోచించవలసిన అవసరం ఉంది. ఏది ఏమైనా ఆ భేద తంత్రాన్ని వమ్ము చేయాలి. దేశంలో సామాజిక ఐక్యతను కాపాడుకొనటానికి ప్రయత్నం చేయాలి. ఈ సిద్ధాంత రాద్ధాంతల మధ్య మనం సత్య - అసత్య వివేకం కోల్పోకూడదు.