బాల బాలికల ఆపద్బాంధవుడు 'శక్తి మాన్‌'


పిల్లలు సరదాగా చూసే టివీ కార్యక్రమం 'శక్తిమాన్‌' పేరుతో మొదలైన ఒక బాలల ఉద్యమం, కలకత్తా నగరంలోని మురికివాడల పిల్లలకు వరదానంగా నిలిచింది. 15 సంవత్సరాల పిన్న వయస్సులో ఉన్న ఇద్దరు బాలికలు 'సోనీ' 'సరస్వతి' అనే వారు ప్రతిదినం పాఠశాల నుండి తిరిగి రాగానే దగ్గరలోని జుజీజ బస్తీ మురికివాడలో ప్రతి ఇంటికి వెళ్ళి బడికి వెళ్ళని పిల్లలు ఉన్నారా అని చూస్తారు. అలాగే గ్యారేజీల్లో పనిచేసే పిల్లలను గుర్తించి వారిని పాఠశాలకు పంపే ప్రయత్నం చేస్తారు. ఈ ఇద్దరూ చిన్న పిల్లలే అయినప్పటికీ, బాల్య వివాహాలు కూడా జరగకుండా ఆపారు.

దాదాపు 1300 కుటుంబాలు ఉంటున్న జుజీజ బస్తీల ఇతర మురికి వాడల్లో యీ పిల్లలు పనిచేస్తూ ఇతర పిల్లలను కూడా ఈ కార్యక్రమంలో కలుపుకుని వెడుతున్నారు. వీరి ప్రయత్నం కారణంగా చదువుమానేసిన పిల్లలు పిల్లలు మళ్ళీ బడికి వెడుతున్నారు. బాల కార్మికులు కూడా బడిబాట పట్టారు. స్థానిక ఎంఎల్‌ఎ మీద వత్తిడి తెచ్చి యీ పిల్లలు మురికి వాడలో ఒక రోడ్డు కూడా వేయించుకున్నారు.