గృహ వైద్యం


ఇది వర్షాకాలం. నీటికి సంబంధించిన వ్యాధులు వస్తాయి. ముఖ్యంగా అతిసారం (నీళ్ళ విరేచనాలు) తరచుగా బాధిస్తుంది. దీనికి కారణమయ్యే బాక్టీరియాను నాశనం చేయడానికి ఇళ్ళలో లభించే వస్తువులతోనే ఔషధాన్ని తయారుచేసుకోవచ్చును. అవి ఏమిటో చూద్దాం :

1. దానిమ్మ బెరడు పొడి, 2 నుండి 3 గ్రాములు ఉదయం మరియు సాయంత్రం తీసుకుంటే అతిసారం నయమవుతుంది.

2. బొప్పాయి పండు తింటే ఏ మందుకూ తగ్గని వ్యాధి నయమవుతుంది.

3. బూరుగు జిగురు, పటిక బెల్లం సమభాగంలో కలిపి నూరి, పూటకు ఒక గ్రాము చొప్పున నీళ్ళలో కలిపి ఇస్తే పిల్లల్లో అతిసారం నివారణ అవుతుంది.