అమరవాణి


శ్లో|| ముఖం ప్రసన్నం విమలాచ దృష్టిః

కథానురాగో మధురాచ వాణీ

స్నేహాధికః సంభ్రమ దర్శనంచః

సదానురక్తస్య జనస్య లక్షణమ్‌

నవ్వు మొగము, చల్లని చూపు, కథలంటే ఇష్టం, మధురమైన మాటలు, ఎక్కువ స్నేహం, చూచిన వెంటనే ఉత్సాహం ఇవన్నీ అనురాగం కలవారి లక్షణములు అనగా! అంతరంగమునకు ముఖమే అద్దము