భారత్‌ జాగృతమవుతోంది - ప.పూ. సర్‌సంఘచాలక్‌ డా.మోహన్‌జీ భాగవత్‌సమాజంలో జాతీయ విలువలను జాగతం చేయాలంటే ముందుగా మన మేధావి వర్గం, ఆలోచనాపరులు సామ్రాజ్యవాద మనస్తత్వం, ధోరణి నుండి బయటపడాలి. సామ్రాజ్యవాద పాలన వల్ల వచ్చిన ఈ లోపాలను, దోషాలు మనలో ఆత్మ దూషణకు, గందరగోళానికి దారితీసాయని రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ సర్‌ సంఘచాలక్‌ డా. మోహన్‌ జీ భాగవత్‌ అన్నారు. నాగపూర్‌లో జరిగిన విజయదశమి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. 

విదేశాస్తురాలైనా సోదరి నివేదితా భారతీయ సంస్క తిని అర్ధం చేసుకుని, ఆచరించగలిగిందని ఆయన అన్నారు. 

జాతి మరియు జాతీయత 

జాతి మరియు జాతీయత గురించి మాట్లాడుతూ మన రాష్ట్ర భావన సంస్కతి, ప్రజల ఆధారంగా ఏర్పడినదని, ఇది అధికారం కేంద్రంగా ఏర్పడిన జాతి రాజ్య భావనకు పూర్తి భిన్నమైనదని అన్నారు. సర్వ మానవాళిని ఒక కుటుంబంగా పరిగణించే శాశ్వత జీవన విలువలే భిన్నత్వం కలిగిన మన దేశాన్ని ఒకటిగా ఉంచుతున్నాయి. ఆ విలువలను ఆచరించడంలో, సత్యాన్ని తెలుసుకోవడంలో అతి పురాతన కాలం నుండి మనం సంపాదించుకున్న సమిష్టి అనుభవాలే మన జాతీయతగా రూపుదిద్దుకున్నాయి. 

నేడు ప్రపంచమంత యోగాను, మన పర్యావరణ దక్పధాన్ని అంగీకరిస్తోందంటే అది మన ప్రాచీన వారసత్వ విలువలకు గుర్తింపు. 

బాహ్య మరియు అంతర్గత భద్రత 

డోక్లాం వివాదంలో భారత్‌ చూపిన పట్టుదల, సంయమనం చాలా చెప్పుకోదగిన స్థాయిలో ఉన్నాయని మోహన్‌ జీ అన్నారు. దేశ భద్రత, దౌత్య విషయాలలో ప్రభుత్వం చేపడుతున్న చర్యలు ప్రశంసనీయంగా ఉన్నాయని ఆయన అన్నారు. 

బెంగాల్‌, కేరళల్లో పెరుగుతున్న ఇస్లామిక్‌ తీవ్రవాదంపట్ల ఆందోళన వ్యక్తంచేసిన ఆయన ఈ ప్రమాదకర పరిణామాలను రాష్ట్రప్రభుత్వాలు పట్టించుకోకపోవడమే కాక కొన్నిసార్లు స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రోత్సహిస్తుండడం విచారించదగిన విషయమని అన్నారు. ఈ ధోరనిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. 

రోహింగ్య సమస్య 

మానవత్వం, మానవ హక్కుల పేరుతో మన దేశ భద్రతకు ముప్పు తెచ్చుకోలేమని మోహన్‌ జీ అన్నారు. హింస, దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలతో రోహింగ్యాలను వారి సొంత దేశమైన మయన్మార్‌ బహిష్కరించింది. వారి విషయంలో ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు దేశ సమైక్యత, భద్రతలను ద ష్టిలో పెట్టుకోవాలని ఆయన సూచించారు. 

గో రక్షణ 

గో రక్షణ మతపరమైన విషయం కాదని, అలాగే ఆ పేరు చెప్పి హింసకు పాల్పడటం కూడా మంచిది కాదని ఆయన అన్నారు. మన సంస్క తిలో గోవుకు ఎంతో గౌరవప్రదమైన స్థానం ఉందని, రాజ్యాంగపు ఆదేశిక సూత్రాలలో కూడా గో రక్షణ ఉన్నదని ఆయన గుర్తుచేశారు. గో రక్షణ పేరుతో జరుగుతున్నా హింసాత్మక సంఘటనలన్నింటిని మతానికి ముడిపెట్టడం తగదని, చిత్తశుద్దితో శాంతియుతంగా గో సంరక్షణకు పాల్పడుతున్న వారు కూడా దాడులకు గురి అవుతున్నారని, వారిలో కొందరు ప్రాణాలు కోల్పోయారని అన్నారు. చాలామంది ముస్లిములు కూడా గో సంరక్షణ కార్యంలో నిమగ్నమవుతున్నారని, గో శాలలు కూడా నిర్వహింస్తున్నారని మోహన్‌ జీ అన్నారు. వివిధ మతవర్గాల మధ్య విద్వేషాలు, వైషమ్యాలు రెచ్చగొట్టేందుకు కొందరు గో సంరక్షణకు వ్యతిరేకంగా దుష్ప్రచారం చేస్తున్నారని, వారి పట్ల  ప్రభుత్వం, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు. 

ఆర్ధిక వ్యవస్థ 

దేశ ఆర్ధిక వ్యవస్థకు ఎంతో బలాన్ని చేకూరుస్తున్న చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, వ్యాపారుల ప్రయోజనాలను ప్రభుత్వం కాపాడాలని మోహన్‌ జీ అన్నారు. ఈ రంగాల వల్లనే అనేక సందరాÄలేలో ప్రపంచమంత ఆర్ధిక సంక్షోభంలో చిక్కుకున్నప్పుడు కూడా భారత్‌ ఏమాత్రం ప్రభావితం కాకుండా నిలబడగలిగింది. కనుక తప్పనిసరి అయిన ఆర్ధిక సంస్కరణలు తప్పనిసరి అయినప్పటికీ ఈ రంగాలపై తక్కువ ఒత్తిడి, ప్రభావం పడేట్లుగా చర్యలు చేపట్టాలని ఆయన అన్నారు. 

షెడ్యూల్‌ కులాలు, తెగలు, గిరిజనుల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక పధకాలను ప్రవేశ పెడుతోందని, అవి ఎవరికి చేరలో వారికి చేర్చవలసినది పాలన యంత్రాంగమేనని, అందుకు తగినట్లుగా పాలనా వ్యవస్థ పారదర్శకంగా, స్వఛంగా, అప్రమత్తంగా ఉండాలని ఆయన అన్నారు. 

పంట బీమా, భూసార పరీక్షలు, ఇ- మార్కెటింగ్‌ వంటి పద్దతులు బాగున్నాయని ప్రశంసించిన మోహన్‌ జి పంట పళీళీణ మాఫీ వంటివి మంచి చర్యలైనప్పటికి అవి తాత్కాలికమైనవేనని అన్నారు. వీటివల్ల సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించదని అభిప్రాయపడ్డారు. 

వ్యవసాయం 

రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర వచ్చేట్లుగా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. పెట్టిన పెట్టుబడి తో పాటు స్వల్ప లాభం వచ్చినప్పుడే రైతు తన కుటుంబాన్ని పోషించుకుని, కొంత వ్యవసాయంకోసం దాచుకోగలుగుతాడు. గిట్టుబాటు ధరకే పంట కొనుగోలు జరిగేట్లుగా ప్రభుత్వం జాగ్రత్త వహించాలని ఆయన అన్నారు. 

సేంద్రీయ వ్యవసాయం, మిశ్రమ వ్యవసాయం, గో ఆధారిత వ్యవసాయ పద్దతులనే అనుసరించాలని, ఆహారాన్ని, నీటిని, భూమిని కలుషితం చేసే రసాయనాల వాడకాన్ని వదిలి పెట్టాలని మోహన్‌ జీ పిలుపునిచ్చారు. దీనివలన ఎంతో డబ్బు కూడా ఆదా అవుతుందని ఆయన అన్నారు. సంప్రదాయ వ్యవసాయ పద్దతులకు ఆధునిక పద్దతులను జోడించాలని అన్నారు. 

వ్యవసాయానికి మూలమైన నీటిపారుదల వ్యవస్థను సమర్ధవంతంగా నిర్వహించడానికి శాస్త్రీయ పద్దతులు పాటించాలని ఆయన అన్నారు. 

ముంబై రైల్వే స్టేషన్లో ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జ్‌ పై జరిగిన తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు సానుభూతి వ్యక్తం చేశారు.