సంక్రమణ పంటలకు చరమ గీతం పాడిన స్వదేశీ జాగరణ మంచ్‌ మరియు భారతీయ కిసాన్‌ సంఘ్‌


గతన కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ అధికారులకు, వ్యవసాయ శాస్త్రవేత్తలకు, పర్యావరణ ఉద్యమకారులకు, సామాజిక శాస్త్రవేత్తలకు మధ్య వాదోపవాదనలకు, చర్చలకు కారణమైన ప్రధానమైన అంశం GM Crops దీనినే సంక్రమణ పంటలుగా మనం భావించవచ్చు.

కొద్దిమంది శాస్త్రవేత్తల ప్రకారం మన దేశంలో వ్యవసాయం క్షీణదశలో ఉంది. భూ నెనుతాల సగటు, రైతులకు అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానం రెండు కూడా మన దేశ వ్యవసాయ వృద్ధికీ తగిన రీతిలో లేవు. వ్యవసాయ ఉత్పాదకత పెరగాలంటె 'సంక్రమణ పంటల'(GM Crop) సాగును ఈ దేవంలో పెద్ద మొత్తంలో ప్రోత్సహించాలి అని నొక్కి చెప్పడం జరిగింది. దానికి 'అనుగుణంగా' బి.టి.కాటన్‌ను మన దేశంలో 2002 నుండి పెద్ద మొత్తంలో సాగు చేస్తున్నాం. ఇప్పటివరకు మన దేశంలో సాగు చేస్తున్న అతి పెద్ద 'సంక్రమణ పంట' బి.టి. పత్తి మాత్రమే.

దీని తర్వాత బి.టి. వంకాయను ఈ దేశంలో సాగులోకి తేవాలని చాలా పెద్ద మొత్తంలో ప్రయత్నం జరిగింది. దాని తర్వాత 'GM Mustard' 'జెనిటికల్లి మాడిపైడ్‌ ఆవాలు'' పంటను సాగులోకి తేవాలని బహుళ జాతి ప్రలోభ పరచుకొని బి.టి. వంకాయ 'GM Mustard'  (ఆవాలు) ద్వారా ఈ దేశ ఆర్థిక వ్యవస్థకు, రైతాంగానికి మేలు చేకూరుతుందని ఒక పథకం ప్రకారం ప్రచారం మొదలు పెట్టారు. కాని వారి పథకాలు, వారి దురాలోచనలు స్వదేశీ జాగరణ మంచ్‌, భారతీయ కిసాన్‌ సంఘ్‌ ముందర పటాపంచలైనాయి.

UPA-II ప్రభుత్వ హయంలో శ్రీ జైరాం రమేశ్‌ గారు భారత పర్యావరణ శాఖ మంత్రివర్యులుగా ఉన్నపుడు 'బి.టి. వంకాయ'ను ఈ దేశంలోకి అనుమతించాలని నిర్నయం తీసుకున్పప్పుడు స్వదేశీ జాగరణ మంచ్‌ మరియు భారతీయ కిసాన్‌ సంఘ్‌ ఈ దేశంలోని రైతాంగాన్ని, సామాజిక శాస్త్రవేత్తలను, సర్యావరణ ప్రేమకులను కలుపుకొని దేశం మొత్తంలో నిసరన కార్యక్రమాలు 'బి.టి.వంకాయ' వ్యతిరేక ప్రదర్శనలు నిర్వహించడం జరిగింది. దేశ రైతాంగమంతా ఒక్కటై 'బి.టి. వంకాయ'ను వ్యతిరేకంచడం ద్వారా నాటి UPA-II ప్రభుత్వం వెనక్కి తగ్గి తమ నిర్నయాన్ని వెనక్కి తీసుకోవడం జరిగింది.

తదనంతరం 2014లో శ్రీ నరేంద్రమోది గారి నాయకత్వంలో భారతీయ జనతాపార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ ప్రభుత్వం 'స్వదేశీనీ' ప్రోత్సహించే ప్రభుత్వం అని 'బహుళ జాతి సంస్థలకు ప్రచార కర్తలుగా వ్యవహరించే శాస్త్రవేత్తలు 'GM Mustard' (ఆవాలు) పంట విత్తనాన్ని DMH 11 'స్వదేశీ 'GM Mustard' గా నామకరణం చేసి ఈ ప్రభుత్వం యొక్క జాతీయ భావజాలాన్ని తను స్వార్థం కోసం వాడుకోవాలని ప్రయత్నం చేసి ప్రభుత్వంలో ఉన్న ప్రముఖమైన అధికారులతో మరియు 'నీతి ఆయోగ్‌'లో ఉన్న ప్రముఖ వ్యక్తులతో కుమ్మక్కై'GM Mustard' ను సాగులోకి తేవాలని ప్రయత్నించడం జరిగింది.

డిల్లీ విశ్వవిద్యాలయ అధ్యపకులు ప్రొఫెసర్‌ దీపక్‌ పెంటల్‌ తన పరిశోధన ఆధారంగా 'GM Mustard'ను తయారు చేశానని ఇది పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించబడిందని నమ్మ బలికించడం జరిగింది. ఈ క్రమంలో నాటి పర్యావరణ మంత్రులైన శ్రీ అనిల్‌ మాధవ ధవే ఆధ్వర్యంలో ఒక "Technical Expert Committee"ని ఏర్పాటు చేసి 'GM Mustard' లకు అనుకూలంగా ఉన్న శాస్త్రవేత్తలను, ప్రతికూలంగా ఉన్న సామాజిక శాస్త్రవేత్తలను, పర్యావరణ ఉద్యమకారులను తమ వాదనలను వినిపించవలసిందిగా కోరడం జరిగింది. ఈ వాదోపవాదనలలో 'జిఎం' కు అనుకూలంగా ఉన్న శాస్త్రవేత్తల బండారం భయటపడింది. అందులో ముఖ్యమైనవి ఏమనగా:

1. ఇప్పటివరకు వారు వారిస్తూ వచ్చినటువంటి 'అత్యధిక ఉత్పాధికత'ను నిరూపించలేపోయారు.

2. ప్రజలపై పడేటువంటి ఆరోగ్య సమస్యల విషయంలో వారి దగ్గర ఎటువంటి సమాచారం లేదు. ప్రతికూలంగా వాదించినవారు 'జిఎం' వల్ల 'క్యాన్సర్‌' ఏ విధంగా వ్యాపిస్తుందో బలంగా వాదించడం జరిగింది.

3. 'జిఎం' అనుకూలురు చెప్పినట్లుగా 'GM Mustard' స్వదేశీ పరిజ్ఞానం వృద్ధి ఏర్పడినది కాదు. దీనిపై అప్పటికే 'Bayers' అనే బహుళ జాతి సంస్థ పేటెంట్‌ హక్కులు కలిగి ఉంది. దానికి రాయల్టీలు ఇవ్వాల్సి ఉంది.

4. పర్యావరణం పై ప్రతికూలంగా ఉండే సమస్యల విషయంలో వారి దగ్గర బలమైన సమాధానం లభించలేదు.

దీనితో ఈ విషయాన్ని ప్రభుత్వం Genetic Engineering Approval Committee (GEAC) ముందుకు పంపడం జరిగింది. ఈ కమిటీలో 5 మంది సాంకేతిక శాస్త్రవేత్తలను నియమించి దానిని పర్యవేక్షించవలసిందిగా కోరడం జరిగింది. ఈ కమిటి 'జిఎం'కు అనుకూలంగా వ్యవహరించడంతో పర్యావరణ వేత్తలు, సామాజిక శాస్త్రవేత్తలు సుప్రీంకోర్టును ఆశ్రమయించడం జరిగింది. సుప్రీంకోర్టులో ఇరువైపుల నుండి బలమైన వాదనలు విన్న తర్వాత కేంధ్ర ప్రభుత్వాన్ని ప్రభుత్వం తరుపున అంతిమ నిర్నయం తీసుకోవాల్సిందిగా కోరడం జరిగింది.

కేంద్రప్రభుత్వం తమ అంతిమ నిర్నయం తీసుకోవడానికి ముందే స్వదేశీ జాగరణ మంచ్‌, భారతీయ కిసాన్‌ సంఘ్‌ దేశంలోని శాస్త్రవేత్తలను సామాజిక శాస్త్రవేత్తలను కలుపుకొని 'GM' Crops వలన దేశానికి జరిగే కీడును వివరించడం జరిగింది. జిఎం అనుకూలురు అభివృద్ధి చెందిన దేశాలన్ని జిఎం పంటలను వినియోగిస్తున్నారు అనే అబద్దపు ప్రచారాన్ని త్రిప్పి కొట్టారు. అమెరికాలో 50 % జనాభా 'జిఎం' నంటను వ్యతిరేకిస్తున్నారనే సత్యాన్ని నొక్కిచెప్పడం జరిగింది. BT Cotton వలన ఈ దేశంలో రైతాంగానికి, వ్యవసాయరంగానికి జరిగిన నష్టాన్ని వివరించడం జరిగింది. అదే విధంగా 'GM Mustard' ఎక్కడ కూడా Field Trial  చేయలేదని నిరూపించడం జరిగింది. దీనితో సెప్టెంబరు మాసంలో కేంద్ర ప్రభుత్వం అంతిమంగా 'GM' Cropsకి ముగింపు దృష్ట్యా దేశ ప్రజల ఆరోగ్య సమస్యలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం 'GM Mustard'  ను దేశంలోకి రాకుండా అడ్డుకోవడం జరిగింది.

ఈ విధంగా స్వదేశీ జాగరణ మంచ్‌, భారతీయ కిసాన్‌ సంఘ్‌ బహుళ జాతి సంస్థల (Bayers) కుయుక్తులను, కుతంత్రాలను పసిగట్టి కేంద్ర ప్రభుత్వంపై పోరాడి ఈ దేశ వ్యవసాయ రంగాన్ని, పర్యావరణాన్ని, రైతాంగాన్ని కాపాడడం జరిగింది.
  - లింగమూర్తి