ప్రముఖులు మాట


''రోహింగ్యాల గురించి ఎంతో తప్పుడు, అసత్యపు సమాచారం ప్రచారంలో ఉంది. వివిధ వర్గాల మధ్య విభేదాలు సష్టించేందుకు, తీవ్రవాదుల ప్రయోజనాలను కాపాడేందుకు ఇలాంటి సమాచారం ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు జరుగుతున్న దుష్ప్రచారం ఊహకు అందనంత ఉంది.''

- ఆంగ్‌ సాన్‌ సుకి, మయన్మార్‌ కౌన్సిలర
''మహారాణా ప్రతాప్‌, గురు గోవింద్‌ సింగ్‌, ఛత్రపతి శివాజీ మనకు ఆదర్శం. మనం వారి మార్గాన్ని అనుసరించాలి. యువత మహారాణాప్రతాప్‌ నుండి స్వాభిమానం, విశుద్దమైన వ్యక్తిత్వాన్ని నేర్చుకోవాలి. అక్బర్‌, ఔరంగజేబ్‌, బాబర్‌ లు దురాక్రమణదారులు. ఈ సత్యాలను మనం ఎంత త్వరగా అర్ధం చేసుకుని, అంగీకరిస్తామో మన దేశ సమస్యలు అంతా త్వరగా దూరమవుతాయి.''

- యోగి ఆదిత్యనాథ్‌, ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి


''మన ముఖ్యమైన నదులు గంగ, కష, నర్మదా, కావేరి మొదలైనవన్నీ చాలా వేగంగా ఎండిపోతున్నాయి. మనం ఇప్పటి కైనా కళ్లుతెరవకపోతే భావి తరాలకు సంఘర్షణ, కరవును మిగిల్చినవారమవు తాము. ఈ నదులు వేలాది సంవత్స రాలు మనను పెంచి పోషించాయి. ఇప్పుడు మనం వాటిని పోషించుకోవలసిన సమయం వచ్చింది.''

- సద్గురు జగ్గీ వాసుదేవ్‌, ఈశా ఫౌండేషన్‌