1.71 లక్ష దీపాలతో అయోధ్యలో దీపావళిఈ సంవత్సరం అనగా హేవిలంబినామ సంవత్సర దీపావళీ పర్వ దినానికి ఒక విశిష్టత ఉన్నది. శ్రీరాముడి జన్మస్థలమైన అయోధ్యలో ఒక లక్షా డెబ్బది ఒక్క వేల దీపాలంకరణముతో సరయూ నదీతీరం వెలిగిపోయింది.
అసురుడైన రావణాసురుని వధించి విజయుడై సీతాలక్ష్మణ ఆంజనేయ సమేతుడై శ్రీరాముడు లంక నుండి అయోధ్యకు తిరిగి వచ్చిన ఆనందకరమైన సందర్భమిది. ఉత్తర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్‌ దీపావళి సందర్భంగా ఈ ఉత్సవం దగ్గర ఉండి భవ్యంగా జరిపించారు.