నేపాల్‌లో మతమార్పిడి నిషేధ చట్టం


మత మార్పిడులను నిషేధిస్తూ నేపాల్‌ ప్రభుత్వం చట్టం చేసింది. దేశంలో క్రైస్తవ మిషనరీ కార్యకలాపాలు పెరుగుతున్న నేపధ్యంలో ఈ కొత్త చట్టం ప్రాధాన్యత సంతరించుకుంది.


ఆగస్టులో నేపాల్‌ పార్లమెంట్‌ ఆమోదించిన క్రిమినల్‌ కోడ్‌ బిల్లుపై ఆ దేశ అధ్యక్షుడు బిద్యా దేవీ భండారీ ఆమోదముద్ర వేశారు. దీనితో దేశంలో 80శాతం ఉన్న హిందువులకు మత పరమైన రక్షణ కలుగుతుందని భావిస్తున్నారు.

 అయితే ఈ చట్టం భావప్రకటన స్వేచ్ఛ, మత ప్రచార హక్కుకు వ్యతిరేకమని క్రైస్తవ మిషనరీ సంస్థలు వాదిస్తున్నాయి. నేపాల్‌లో 3 లక్షల 75వేల మంది క్రైస్తవులు ఉన్నారు.