మరింత జోరుగా మతప్రచారంసేవ, వైద్యం, విద్య ముసుగులో క్రైస్తవ మత ప్రచారం, మతాంతరీకరణలూ జరుగుతున్న సంగతి తెలిసిందే! ఇప్పుడు క్యాథలిక్కు క్రైస్తవుల మతనాయకుడైన పోప్‌ ఫ్రాన్సిస్‌ చొరవతో దక్షిణ భారత దేశంలో క్రైస్తవమత ప్రచారం జడలు విప్పి కరాళ నృత్యం చేయడానికి ఉపక్రమిస్తున్నది. 


భాగ్యనగరానికి 25 కిలో మీటర్ల దూరంలో ఉన్న షంషాబాదు కేంద్రంగా ''సైరోమలబారు - ఎపార్చి'' అనే ఒక వ్యవస్థ మరియు హూసూరు (తమిళనాడు) కేంద్రంగా మరి ఒక వ్యవస్థలను ప్రోప్‌ ఫ్రాన్సిస్‌ నేతృత్వంలో ఏర్పాటు చేశారు. 7 స్థలాలలో క్రొత్త చర్చిల నిర్మాణం మొదలయింది. వీరి కార్యకలాపాలు 11 విభాగాలలో 100 నగరాలలో జోరుగా సాగుతున్నాయి. 

ఇద్దరు క్రొత్త బిషపులను ప్రత్యేకంగా నియమించారు. రాఫెల్‌ థత్తిల్‌ (భాగ్యనగరం బిషప్‌) సెబాస్టియన్‌ జోబీ పోఝోలిపరంపిల్‌ (హూసూరు బిషప్‌) లు మత ప్రచారం, మత మర్పిడి కార్యకలాపాలను పర్యవేక్షిస్తారు. 

ప్రజలు అప్రమత్తంగా ఉండి వీరి కుట్రలను కుహకాలను ఎదుర్కొని ఈ మతవ్యాప్తిని అడ్డుకోవలసి ఉన్నది.