ప్రముఖులు మాట


సైనికులు, ఆధ్యాత్మికవేత్తలు జాతికి మూలస్తంభాలు

''సైనికులు, ఆధ్యాత్మిక వేత్తలు జాతికి జంట మూలస్తంభాలు. సైనికుల శౌర్యం ఒకవైపు, ఆధ్యాత్మిక వేత్తల జ్ఞానం, ప్రేమ మరోవైపు దేశాన్ని నడిపిస్తున్నాయి. వీరిపైనే దేశం ఆశలు పెట్టుకుంది.'' 

- రామ్‌నాథ్‌ కోవింద్‌, రాష్ట్రపతిసైనికులను గుర్తుచేసుకుందాం 

''ప్రతి సంవత్సరం మనం దీపావళి జరుపుకుంటూనే ఉంటాం. ఆ శుభ సందర్భంలో సి ఆర్‌ పి ఎఫ్‌, సైన్యం, ఇతర భద్రతా బలగాలకు చెందిన మన వీర జవానులు కోసం ఒక దీపమైన వెలిగించుదాం.''

- రాజ్‌ నాథ్‌ సింగ్‌, కేంద్ర హోమ్‌ మంత్రి ''టపాకాయలు లేకుండా  దీపావళి ఎలా జరుపు కుంటారు? హిందూ పండుగలపైనే ఆంక్షలు ఎందుకు? బాణసంచాపై నిషేధం ఉండాలని కోరుతున్నవారే మూగజీవాల నెత్తురు పారే పండుగలను కూడా సంస్కరించే ప్రయత్నం చేయాలి.''

- చేతన్‌ భగత్‌,  ప్రముఖ రచయిత