సుప్రీంకోర్టులో లవ్‌ జిహాద్‌ విచారణ

కేరళ రాష్ట్రానికి చెందిన 24 సంవత్సరాల అఖిల అనే యువతిని 26 సంవత్సరాల వయస్సు ఉన్న జహీన్‌ అనే ముస్లిం యువకుడు వివాహం చేసుకొన్నాడు. వివాహానికి ముందు అఖిలను ఇస్లాంలోకి మతం మార్చిమరీ వివాహం చేసుకొన్నాడు. దానిపై అఖిల తండ్రి కేరళ కోర్టుకు వెళ్ళాడు; ఆ కేసు అక్కడ నుండి సుప్రీంకోర్టుకు వెళ్ళింది. సుప్రీంకోర్టులో 2017 నవంబరు 27 నుండి విచారణ ప్రారంభమైంది. ఇస్లామిక్‌ సామ్రాజ్యవాదులు (IS) హిందు యువతులను ప్రేమ పేరుతో వివాహం చేసుకొని ఆపైన మతం మార్చి తమ కార్యకలాపాలకు ఉపయోగించుకొంటున్నారనే అభియోగానికి సంబంధించి కేసు విచారణ ప్రారంభమైంది. ఈ రోజు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇటువంటి సంక్లిష్టమైన కేసు నా జీవితంలో ఎప్పుడు చూడలేదు అని విచారణ అనంతరం వ్యాఖ్యానించారు. 

జాతీయ శక్తులను బలహీనపరచే లక్ష్యంగా ఎన్నికల పోరాటం

భారత రాజ్యాంగ స్ఫూర్తి తూట్లు పొడుస్తు తమ పబ్బంగడుపుకొనటానికి ఈ దేశంలో రాజకీయ పార్టీలు; అనేక ఇతర సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. రాజ్యాంగ స్ఫూర్తిని సవాలు చేయటానికి కూడా వాళ్ళు వెనుకాడరు.  రిజర్వేషనులు ఎవరికి; ఎందుకోసం; ఎంత కాలం అని భారత రాజ్యాంగంలో స్పష్టంగా చెప్పబడింది. 

ముక్కోటి ఏకాదశి

విష్ణు మూర్తి ఆరాధకులు పరమ పవిత్ర మైన దినంగా భావించే రోజు ఇది. అదే ముక్కోటి ఏకాదశి ! ముక్కోటి ఏకాదశినే వైకుంఠ ఏకాదశి అని కూడా అంటారు. హిందువుల కాలెండర్‌ ప్రకారం ముక్కోటి ఏకాదశి మార్గశిర మాసంలో వస్తుంది. అంటే ఆంగ్ల కాలెండర్‌ ప్రకారం డిసెంబర్‌-జనవరి నెలలలో అన్న మాట. ''స్వర్గద్వారం'', ''ముక్కోటి ఏకాదశి'', ''వైకుంఠ ఏకాదశి'' అని పేరున్న ఆ పర్వదినాన వైష్ణవాలయాల్లో ఏకాదశిని ఎంతో బ్రహ్మాండంగా జరుపుతారు. 

దేశం కోసం దక్షిణ

కాశీలో హిందూ విశ్వ విద్యాలయం కోసం మదన మోహన మాలవ్యా అందరి దగ్గర నిధి యాచించేవారు. ఒకసారి ప్రఖ్యాత కోటీశ్వరుడైన బిర్లా కాశీ వచ్చి గంగానదిలో పితృదేవతలకు తర్పణాలు సమర్పించాలనుకున్నాడు. అప్పుడు మాలవ్యాజీ స్వయంగా తానే ముందుకు వచ్చి మొత్తం కర్మకాండ యధావిధిగా నిర్వహించి చివర దక్షిణ కోసం చేయి చాపారు. 

భక్తులలో ఉత్తమభక్తుడెవరు?

స్వరూపమైన భగవంతుని యందు ఎవడు తనను అర్పణ చేసుకొనునో అతడే భక్త శ్రేష్టుడు. ఆత్మచింతన తప్ప ఇతర ఆలోచనలు పుట్టుటకు కొంచమైనా చోటీయక, ఆత్మ నిష్ఠాపరుడై ఉండటమే తనను ఈశ్వరునికి అర్పించుకొనుట.

అమరవాణి

శ్లో|| సంగఛ్ఛధ్వం సంవదధ్వం
     సంవోమనాంసి జానతామ్‌|
     దేవాభాగం యథాపూర్వే
సంజానానా ఉపాసతే||

మనం అందరం కలిసి నడుద్దాం. కలిసి మాట్లాడుకుందాం. మన మనస్సులు ఒకటిగా చేసుకుందాం. మన పూర్వులు ఈ విధంగానే తమ కర్తవ్యాలను నెరవేర్చుతూ దేవతలుగా కీర్తించబడ్డారు.

ప్రముఖులు మాట

ప్రతి భారతీయుడు జమ్మూకాశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగంగానే చూస్తాడు. దీనిపై జాతి యావత్తు ఒకటే అభిప్రాయంతో ఉన్నది. కాశ్మీర్‌ అంటే  పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌ అని కూడా అర్ధం. పీ ఓ కె గురించి మాట్లాడటం, పోరాడటం భారతీయుడి హక్కు. 
- నితీశ్‌ కుమార్‌, బీహార్‌ ముఖ్యమంత్రి 

సువిద్య, సంస్కారం, సంతోషాలకు కేంద్రమే కుటుంబం - రవీంద్ర జోషి, సహ సంయోజకులు, అఖిల భారతీయ కుటుంబ ప్రబోధన్‌


మన దేశంలో కుటుంబం అంటే కేవలం నిత్యావసరాలను సమకూర్చేది మాత్రమే కాదు మన ఆలోచనలకు, బుద్ధికి ఒక దిశను చూపి జీవన విలువలను అందించే కేంద్రం. మన దేశంలో కుటుంబం అంటే సువిద్య, సంస్కారం, సంతోషాలకు కేంద్రం. ఇక్కడ మన రెండు కుటుంబాల గురించి పరిశీలిద్దాం. వీటి ద్వారా నేటి పరిస్థితుల్లో కూడా సౌహార్దపూర్వకమైన వాతావరణాన్ని ఎలా నిర్మించుకోవచ్చును అనే విషయం అర్ధమవుతుంది. కుటుంబంలో సౌహార్దభావన కలగాలంటే వారంలో కనీసం ఒక రోజు కుటుంబంలోని వారంతా కలిసి భోజనం చేయాలి. పెద్దలపట్ల గౌరవభావం, ఇతరులపట్ల అభిమానం కలిగే విధంగా వ్యవహరించాలి. కుటుంబ సభ్యుల మధ్య ఉండే ప్రేమాభిమానాలను అక్కడికే పరిమితం చేయకుండా మనం నివసించే ప్రదేశంలో అందరికీ పంచగలగాలి. ప్రతి కుటుంబంలో ప్రతి వ్యక్తికి కూడు, గుడ్డ, గూడుతో పాటు విద్య, వైద్యం  మొదలైన సదుపాయాలు కూడా అందాలి. వీటితోపాటు అతిథి సత్కారం కూడా కుటుంబాల ద్వారానే జరగాలి. 

హిందుత్వ విలువలను కాపాడుకుందాం - మా.శ్రీ భయ్యాజీ జోషి

హిందుత్వ విలువల ఆధారంగా సంఘ కార్యం సాగుతుంది. హిందూ విలువలు, హిందుత్వ జీవన దృక్పథం ఎవరికి వ్యతిరేకం కావు. అది సమైక్యతను పొంపొందించే శక్తి అని రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ సర్‌ కార్యవాహ్‌ శ్రీ భయ్యాజీ జోషి అన్నారు. తెలంగాణ ప్రాంత కార్యకర్తల శిబిరం ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ శిబిరంలో మొత్తం తెలంగాణా ప్రాంతం నుండి వచ్చిన 167 మంది కార్యకర్తలు పాల్గొన్నారు. 

ప్రత్యేక సదుపాయాలు ఎందుకు?

ముస్లిం వర్గాన్ని సంతోషపెట్టేందుకు, వారి అభిమానాన్ని సంపాదించేందుకు తెలంగాణా ప్రభుత్వం గట్టిగా ప్రయత్నిస్తోంది. ఇతర వర్గాల ప్రయోజనాలను కూడా పణంగా పెట్టి ప్రభుత్వం పాల్పడుతున్న ఈ సంతుష్టీకరణపట్ల అప్పుడే పలు విమర్శలు వస్తున్నాయి. 

భారత రాజ్యాంగం హిందూ హృదయం

వ్యక్తులు, వర్గాల స్వేచ్ఛాయుతమైన సమ్మతిపై ఆధారపడిన ఏ ప్రజాస్వామిక వ్యవస్థ అయినా స్వీయ నాగరకతా విలువలను ప్రతిబింబించాలి. శతాబ్దాలుగా భారత్‌లో విలసిల్లిన సామాజిక, సాంస్కృతిక విలువలు, విధానాలను హిందుత్వంగా సాక్షాత్తు సుప్రీంకోర్టు గుర్తించడం సాధారణమైన విషయం కాదు. 

ముల్లంగి

ముల్లంగి విననివారు ఉండరు. దొరకని ప్రదేశమూ ఉండదు. ముల్లంగి మన దొడ్లో కాసే ఒక అమూల్యమైన ఔషధం. ''ముల్లంగే కదా పీకి పారెయ్యండి. అది ఎందుకూ పనికి రాదు'' అని ముల్లంగిని చిన్నచూపు చూస్తారు. అదే ముల్లంగి మనకి కొన్ని లక్షలరూపాయలను ఆస్పత్రి పాలు కాకుండా కాపాడుతుంది. పచ్చకామెర్లు, మూత్రపిండాల వ్యాధులకి, మధుమేహం ఇలా ఎన్నో భయంకర వ్యాధులనుండి సాధారణ దగ్గు, జలుబులను చిటికలో తగ్గించే ఔషధం.

పర్యావరణ పరిరక్షణలో భారతీయ మహిళ

పర్యావరణ పరిరక్షణ అనేది నేడు విదేశాల నుండి మనం దిగుమతి చేసుకున్న పదం. నిజానికి మన పూర్వికులు ఆచార, వ్యవహారాల్లోనే ప్రకృతి పరిరక్షణను పొందుపరిచారు. వాటికి దూరమవు తున్న నేపథ్యంలో నేడు మనం ఆందోళనలు వ్యక్తం చేస్తూ.. ప్రకృతిని కాపాడుకోవాలంటూ నినదిస్తుండడం విచారకరం. ఇక భారతీయ మహిళలది సంస్కతిలో ప్రత్యేక పాత్ర అనే చెప్పుకోవాలి. పురుషుల కంటే ఎక్కువ మహిళలే ప్రకృతికి దగ్గరగా ఉంటారు. అందుకే భూమాత, గోమాత, గంగమ్మ తల్లి అని పిలుచుకుంటారు భారతీయులు. అంతటి ప్రాధాన్యత ఉన్న మహిళలు ప్రకృతి పండుగలు ఎంచక్కా జరుపుకుంటారు. అందుకు కొన్ని ఉదాహరణలను చెప్పుకుందాం.

శాంతియుతమైన కాశ్మీరం కావాలి

ఆక్రమిత కాశ్మీరు పాకిస్తాన్‌కే చెందుతుంది అని అంటున్నాడు నేషనల్‌ కాన్ఫరెన్స్‌ పార్టీ పార్లమెంటు సభ్యుడు ఫరూఖ్‌ అబ్దుల్లా. అతడు కాశ్మీరు సమస్య పరిష్కారం కోసం కేంద్రం చేస్తున్న అన్ని ప్రయత్నాలను వ్యతిరేకిస్తూ పాకిస్తాన్‌ ప్రతినిధిలాగా ప్రవరిస్తున్నాడు. 

కాలిఫోర్నియాలో హిందువులకు విజయం

గ్రేడ్‌ కే-6, గ్రేడ్‌ 6-8 స్కూల్‌ పాఠ్య పుస్తకాలలో హిందువులు, భారత దేశం గురించి ముద్రించిన అవాస్తవాలను కొట్టివేయడానికి అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్ర విద్యాశాఖ అంగీకరించింది. అదే విదంగా అమెరికన్‌ హిందూ సమాజం ఎత్తిచూపిన అన్ని తప్పులను సవరించడానికి సైతం సంసిద్ధత వ్యక్తపరచింది. హాటన్‌ మిప్ల్ఫిన్‌ హర్కోర్ట్‌ పబ్లిషేర్స్‌ ఈ పాఠ్య పుస్తకాలను ముద్రించింది.