శాంతియుతమైన కాశ్మీరం కావాలి

ఆక్రమిత కాశ్మీరు పాకిస్తాన్‌కే చెందుతుంది అని అంటున్నాడు నేషనల్‌ కాన్ఫరెన్స్‌ పార్టీ పార్లమెంటు సభ్యుడు ఫరూఖ్‌ అబ్దుల్లా. అతడు కాశ్మీరు సమస్య పరిష్కారం కోసం కేంద్రం చేస్తున్న అన్ని ప్రయత్నాలను వ్యతిరేకిస్తూ పాకిస్తాన్‌ ప్రతినిధిలాగా ప్రవరిస్తున్నాడు. 

ప్రముఖ ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకుడు, 1990 దశకం నుండి కాశ్మీరు సమస్యపై అధ్యయనం చేస్తున్న వ్యక్తి, ''రాష్ట్రీయ ముస్లిం మంచ్‌'' వ్యవస్థాపకుడు శ్రీ ఇంద్రేశ్‌కుమార్‌ మాట్లాడుతూ, ఫరూఖ్‌ అబ్దుల్లా దేశహితానికి వ్యతిరేకంగా పనిచేస్తూ శాంతి సాధనకు గండి కొడుతున్నాడనీ, ఇటువంటి వారు పాకిస్తాన్‌కి వెళ్ళిపోవాలని అన్నారు. 


ఇటీవల అటు కాశ్మీరులోనూ ఇటు క్రొత్త ఢిల్లీలోనూ, ఆర్‌ఎస్‌ఎస్‌,  రాష్ట్రీయ ముస్లిం మంచ్‌ ఆధ్వర్యంలో యువ సమ్మేళనాలు జరిగాయి. వీటిలో ఇతరులతో పాటుగా కాశ్మీరీ ముస్లింలు కూడా పాల్గొన్నారు. ''తుపాకీ ప్రేలుళ్ళు - రాళ్ళు రువ్వని కాశ్మీరు మాకు కావాలి'' అని వీరంతా నినదించారు. 

ఇంద్రేశ్‌కుమార్‌ వంటి వారు, కేంద్రం చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. ఉగ్రవాద సంస్థ అయిన ''హురియత్‌''కి ఎదురుగాలి మొదలు అయింది. తీవ్రవాదులు చనిపోతే - ఇప్పుడు గతంలోలాగ జనం అంత్యక్రియలకి ఎగబడి రావడం లేదు.