భక్తులలో ఉత్తమభక్తుడెవరు?

స్వరూపమైన భగవంతుని యందు ఎవడు తనను అర్పణ చేసుకొనునో అతడే భక్త శ్రేష్టుడు. ఆత్మచింతన తప్ప ఇతర ఆలోచనలు పుట్టుటకు కొంచమైనా చోటీయక, ఆత్మ నిష్ఠాపరుడై ఉండటమే తనను ఈశ్వరునికి అర్పించుకొనుట.


ఈశ్వరునిపై ఎంత భారము వేసినా దానిని ఆయన భరించగలడు. సకల కార్యములను ఒక పరమేశ్వర శక్తి నడుపుచుండుట చేత మనం దానికి లోబడి ఉండటం మాని ఇలా చేయాలి, అలా చేయాలి అని సదా చింతించుట ఎందుకు? రైలు బండి బరువులన్నిటిని మోయగలదని తెలిసి యుండి ప్రయాణీకులైన మనము మన చిన్న మూటను కూడ అందులో పడవేసి సుఖంగా ఉండక దానిని నెత్తి కెత్తుకొని ఎందుకు కష్టపడాలి.

- భగవాన్‌ శ్రీ రమణ మహర్షి