ప్రముఖులు మాట

ప్రతి భారతీయుడు జమ్మూకాశ్మీర్‌ భారత్‌లో అంతర్భాగంగానే చూస్తాడు. దీనిపై జాతి యావత్తు ఒకటే అభిప్రాయంతో ఉన్నది. కాశ్మీర్‌ అంటే  పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌ అని కూడా అర్ధం. పీ ఓ కె గురించి మాట్లాడటం, పోరాడటం భారతీయుడి హక్కు. 
- నితీశ్‌ కుమార్‌, బీహార్‌ ముఖ్యమంత్రి 

యోగాను 'క్రీడ'గా గుర్తించడం ద్వారా సౌదీ అరేబియా ప్రభుత్వం చరిత్రాత్మక, శాస్త్రీయ నిర్ణయం తీసుకుంది. దీనితో యోగా పట్ల ముస్లిము సముదాయంలో ఉన్న అపోహలు తొలగిపోయి  వాళ్ళు కూడా శాంతిని, ఆరోగ్యాన్ని పొందేందుకు వీలుకలుగుతుంది.

- స్వామి రాందేవ్‌ బాబా  

అవయవ దానం మన ప్రాచీన నాగరికత విలువలను ప్రతిబింబిస్తుంది. జీవిత కాలంలో లేదా చనిపోయిన తరువాత మన అవయవాలు మరొకరికి ఉపయోగ పడాలన్నది ఎంతో మానవతతో కూడిన, స్ఫూర్తివంతమైన ఆలోచన. 

- రామ్‌నాథ్‌  కోవింద్‌, భారత రాష్ట్రపతి