ఈ నేలంతా భారతమాత గానమే

వందల సంవత్సరాల పోరాటం తదుపరి 1947 ఆగస్టు 15న మనం మన దేశానికి స్వాతంత్య్రం సంపాదించుకున్నాము. 1950 జనవరి 26 నుంచి మనదైన రాజ్యాంగాన్ని అమలు పరుచుకున్నాం.  ఆ రోజున మన తల్లి అయినటు వంటి భారతమాతను పూజించాలి... వేల సంవత్సరాల చరిత్ర కలిగిన మనజాతిలో సమైక్యతకు సాంస్కృతిక ఏకత్వానికి ప్రపంచానికి ఒక నమూనాగా భారత్‌ నిలబడి ప్రపంచానికి మార్గదర్శనం చెయ్యాలి, ఆ ప్రేరణ భారత మాత పూజ నుండి మనం పొందాలి.

మనం అనే భావనే - రాజ్యాంగ స్ఫూర్తి కావాలి

మన దేశానికి స్వాతంత్య్రం 1947 ఆగస్టు 15న వచ్చినా ప్రజాస్వామ్య వ్యవస్థలో మనదైన రాజ్యాంగాన్ని 1950 జనవరి నుండి అమలు చేసుకొన్నాము. 1947కి పూర్వం వేల సంవత్సరాల నుండి భారతదేశంలోని రాజ్యవ్యవస్థ కనుమరుగై పాశ్చాత్య దేశాల, ప్రధానంగా ఇంగ్లాండు దేశ ప్రజాసామ్య వ్యవస్థ భారతదేశంలో చోటు చేసుకొన్నది. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. 

భీష్మ ఏకాదశి

(జనవరి 28 భీష్మ ఏకాదశి సందర్భంగా)
మాఘమాసం శుక్లపక్షంలో వచ్చే మాఘ శుద్ధ ఏకాదశి సనాతన భారతీయ జీవన పరంపరలో ''భీష్మ ఏకదశి''గా ప్రాచుర్యం పొందింది. అష్ట వసువులలో ఎనిమిదవ వాడైన ''ప్రభాసుడు'' గంగాదేవి, శంతన మహారాజుకు జన్మించి ''దేవ వ్రతుడు''గా నామకరణం చేయబడ్డాడు. తండ్రి కోసం వివాహాన్ని పరిత్యజించి మూడు తరాలపాటు కురు వంశాన్ని రక్షించిన త్యాగధనుడు తండ్రి కోసం త్యాగం చేసిన శ్రీరాముడు, పరశురాముడు, పురూరవుడు మొదలగు వారితో భీష్ముడు నిలుస్తాడు. భీష్ముడి జననం, జీవితం, దేహత్యాగం మానవ జన్మలో ఉన్న వివిధ కోణాలను ఆవిష్కరిస్తుంది.

స్ఫూర్తి - దేశమే నాది..

నిరంకుశ బ్రిటిష్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్వాతంత్య్ర వీరసావర్కర్‌ పోరాటం చేశారు. అండమాన్‌ జైలులో కఠినశిక్ష కూడా అనుభ వించారు. బ్రిటిష్‌ ప్రభుత్వం ఆయనకు చెందిన నాలుగుఎకరాల భూమిని స్వాధీనం చేసుకుంది.

హితవచనం - రాష్ట్రీయ జీవన స్రవంతి

నీ రక్తపు ప్రతి బిందువులోనూ ఎన్నివేల సంవత్సరాల సంస్కారం యిమిడి వుందో, ఎన్నివేల సంవత్సరాల నుండి ఈ ప్రబల రాష్ట్రీయ జీవన స్రవంతి ఒక ప్రత్యేక దిశలో ప్రవహిస్తుందో, ఆ భగవంతుడికే తెలియాలి. సముద్రాన్ని సమీపించిన ఆ ప్రవాహం వెనుదిరిగి మళ్ళీ హిమాలయపు మంచు శిఖరాల పైకి మరలి పోగలదని భావిస్తున్నావా? అది అసంభవం! 

ప్రముఖులు మాట

భారతదేశం ఇప్పుడు ప్రముఖ వైశ్విక శక్తి, బలమైన వ్యూహాత్మక శక్తి, రక్షణ రంగంలో కీలకమైన భాగస్వామిగా మారింది. భారత్‌ను ప్రపంచంలో కేవలం సంతులిత శక్తిగా మాత్రమేకాక ప్రముఖ శక్తిగా రూపొందించడమే ప్రస్తుతపు ప్రభుత్వపు లక్ష్యంగా కనిపిస్తోంది.

- డొనాల్డ్‌ ట్రంప్‌ , అమెరికా అధ్యక్షుడు 

అమరవాణి


శ్లో||    దేశరక్ష సమం పుణ్యం

    దేశ రక్షా సమం వ్రతం

    దేశరక్ష సమం యోగో

    దృష్టో నైవ చ నైవ చ

అరుణాచల్‌లో హిందూ సంస్కృతి మూలాలు

కొద్దిమంది ప్రచారం చేస్తున్నట్లుగా అరుణాచల్‌ ప్రదేశ్‌లో ఉన్న గిరిజన, ఆదివాసీ సంస్కృతి 'ప్రత్యేకమైనది', 'హిందూత్వం' తో సంబంధంలేనిది కాదని, అక్కడ హిందూ సంస్కృతే ఉన్నదని పురాతత్వ పరిశోధనల్లో తేలింది. ఈ రాష్ట్రపు పురాతన చరిత్రను గురించి పూర్తి సమాచారాన్ని వెలుగులోకి తీసుకురావడం చాలా అవసరం.

గుజరాత్‌ ఎన్నికలు ఏం చెపుతున్నాయి?

ప్రజాస్వామ్యానికి ఎన్నికలే జీవనాధారం. వాటిలోసంఖ్యాపరమైన విజయమే రాజ్యాధి కారానికి మార్గం. నైతిక, అనైతిక విజయం అంటూ ఏమి ఉండదు. గెలుపుకు ప్రజాదరణ గల నాయకుడు అతిపెద్ద సభ్యత్వం గల పార్టీ కన్నా సామాన్య ఓటరే కర్త, కర్మ, క్రియ. అతని తుది తీర్పే శిరోధార్యం.

సమాజ సంఘటనకై సద్భావన సదస్సులు

సమాజంలో సమస్యలకు కారణమవుతున్న కులవిభేదాలను తొలగించి అందరిలో సమైక్య భావనను పెంపొందించే  సద్భావనా సదస్సులు  భాగ్యనగర్‌లోని వివిధ ప్రాంతాల్లో  జరిగాయి. వీటికి అన్ని కులసంఘాలకు చెందిన పెద్దలతో పాటు అపార్ట్‌మెంట్‌ల అసోసియేషన్‌ సభ్యులు, దేవాలయ కమిటీ సభ్యులు హాజరయ్యారు.

వ్యవసాయిక రసాయనాల వినియోగంపై నిర్దిష్టమైన చట్టం ఏర్పరిచి, అమలు చేయాలి - భారతీయ కిసాన్‌ సంఘ్‌

భారతీయ కిసాన్‌ సంఘ్‌వారి అఖిల భారతీయ ప్రతినిధి సభలు ఈ సంవత్సరం 1-3 డిసెంబర్‌ వరకు పర్భణీ నగరం, మహారాష్ట్రలో నిర్వహించబడినవి.

కుంభమేళాను భారతీయ సాంస్కృతిక వారసత్వంగా గుర్తించిన యునెస్కో

కుంభమేళా భారతదేశపు సంస్కృకతిక వారసత్వంలో భాగమని యునెస్కో ప్రకటించింది. ప్రపంచంలోని సాంస్కతిక వారసత్వానికి సంబంధించిన అంశాల జాబితాలో కుంభమేలాను కూడా చేరుస్తున్నట్లు యునెస్కో ప్రకటించింది. ఈ జాబితాలో ఈ సంవత్సరం కొత్తగా 33 ఉత్సవాలను చేర్చారు.

సంక్రాంతి సందడి

సంక్రాంతి పండుగ రాగానే తెలుగు రాష్ట్రాలలోసంబరాలు అంబరాన్ని అంటుతాయి. దేశ వ్యాప్తంగా ఉన్నరాష్ట్రాలలో సంక్రాంతి పండుగను వివిధ పేర్లతో జరుపుకుంటారు. పేరు ఏదైనా.. సంక్రాంతి అనగానే పాడి, పంటలతో ముడిపడినపల్లె పండుగగానే గుర్తొస్తుంది. ముఖ్యంగా భారతీయసంప్రదాయంలో వ్యవసాయానికి ఎంతో ప్రాధాన్యం ఉంది.

గృహవైద్యం - జామకాయ

జామకయకి ప్రత్యేకమైన పరిచయం అక్కరలేదు. జామకాయ ప్రతీ ఇంటిలోనూ, ప్రతీ వారికి సుపరిచితమైన ఔషధం. జాయకాయ ఆకులు, కాయలు, పండ్లు, బెరడు అన్నీ ఆయుర్వేద ఔషధంగా పనికి వస్తాయి. ఆకులు నీళ్ళతో కలిపి కషాయంగా కాచుకొని తాగితే బీ.పీ., శుగర్‌, కడుపులో నూలు పురుగులు అన్నీ మటుమయమవుతాయి.

రామసేతు మానవ నిర్మితమే - సైన్స్‌ ఛానల్‌ విశ్లేషణ

సైన్స్‌ ఛానల్‌ డిస్కవరి ఛానల్‌ నెట్‌ వర్క్‌లో ఒక టీవి ఛానల్‌. ఈ ఛానల్‌ మిథ్‌ బస్టర్స్‌, హౌ ఇట్‌ మేడ్‌ మొదలైన కార్యక్రమాలు ప్రసారం చేస్తుంది. ఇందులోనే వాట్‌ ఆన్‌ ఎర్త్‌ అనే కార్యక్రమం కూడా ప్రసారమవుతుంది. ఇందులో భూమిపై పూర్తి వివరాలు, వివరణ లేని విషయాలను విశ్లేషించడానికి ప్రయత్నిస్తారు. అందుకోసం నాసా తీసిన ఉపగ్రహ చిత్రాలను ఉపయోగిస్తారు. ఇటీవల ఈ ఛానల్‌ తన  అధికారిక ట్విట్టర్‌ అకౌంట్‌ లో 'ఏన్షియంట్‌ లాండ్‌ బ్రిడ్జ్‌' అనే శీర్షికతో ఒక వీడియోను పెట్టింది. నాసా ఉపగ్రహ చిత్రం సహాయంతో రూపొం దించిన విశ్లేషణ అది.

క్రైస్తవంలోకి మారిన వ్యక్తి ఎస్‌.సి. సర్టిఫికెట్‌ను రద్దు చేసిన కలెక్టర్‌

రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌కి చెందిన గంటీల జాన్‌ అలియాస్‌ జానయ్య అనే వ్యక్తి క్రైస్తవుడుగా మతం మారిన తరువాత కూడా షెడ్యులు కులస్తు డుగా చలామణి అవుతూ అధికారిక పత్రాలలో మార్పు చేసుకోకుండా రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్‌లను దుర్వినియోగ పరుస్తున్నట్టు వచ్చిన ఫిర్యాదును స్వీకరించన ప్రభుత్వ యంత్రాంగం తగిన విచారణ జరిపి SC  సర్టిఫికెట్‌ తొలగించి BC C సెర్టిఫికెట్‌ ఇవ్వడం జరిగింది.