క్రైస్తవంలోకి మారిన వ్యక్తి ఎస్‌.సి. సర్టిఫికెట్‌ను రద్దు చేసిన కలెక్టర్‌

రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌కి చెందిన గంటీల జాన్‌ అలియాస్‌ జానయ్య అనే వ్యక్తి క్రైస్తవుడుగా మతం మారిన తరువాత కూడా షెడ్యులు కులస్తు డుగా చలామణి అవుతూ అధికారిక పత్రాలలో మార్పు చేసుకోకుండా రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్‌లను దుర్వినియోగ పరుస్తున్నట్టు వచ్చిన ఫిర్యాదును స్వీకరించన ప్రభుత్వ యంత్రాంగం తగిన విచారణ జరిపి SC  సర్టిఫికెట్‌ తొలగించి BC C సెర్టిఫికెట్‌ ఇవ్వడం జరిగింది.
వివరాల్లోకి వెళ్తే, జాతీయ SC రిజర్వేషన్‌ పరిరక్షణ సమితి కో కన్వీనర్‌ పాపరాయుడు గారు శంషాబాద్‌కి చెందిన జాన్‌ రాజ్‌ అనే వ్యక్తి ఒక క్రైస్తవుడై కూడా చట్టాలని రాజ్యాంగాన్ని అతిక్రమించే విధంగా దళితులకి చెందాల్సిన రేజర్వేషన్‌ని దుర్విని యోగం చేస్తున్నాడు అని అతనిపై చట్టపరమయిన చర్యలు తీసుకుని తన SC సర్టిఫికెట్‌ తొలగించి జాన్‌ రాజుకి BC C సెర్టిఫికెట్‌ ఇవ్వమని శంషాబాద్‌ తహసీల్దార్‌ గారికి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఈ ఫిర్యాదు 15-10-2012, 20-01-2013, 23-09-2013 మరియు 30-06-2016 తేదీలలో ఇవ్వడం జరిగింది.

దీనిపై వివిధ సందర్బాలలో తగిన విచారణ జరిపిన జిల్లా స్థాయి విచారణ కమిటీ DISTRICT LEVEL SCRUTINY COMMITTEE (DLSC) జాన్‌ రాజు అనే వ్యక్తి నిజమయిన దళితుడు కాదని అతనిని క్రైస్తవుడిగా నిర్ధారించుకుని, అతని SC సెర్టిఫికెట్‌ని రద్దు చేసి అతనికి BC C సర్టిఫికెట్‌ మంజూరు చేసింది. ఇదే కాక అతనిపై చట్టపరమయిన చర్యలు తీసుకోడానికి సిద్ధంగా ఉంది. అంతేకాదు ఈ విషయాన్నీ ప్రభుత్వ దస్తావేజుల్లో సైతం నమోదు చేయాలని ఆదేశించారు.