కుంభమేళాను భారతీయ సాంస్కృతిక వారసత్వంగా గుర్తించిన యునెస్కో

కుంభమేళా భారతదేశపు సంస్కృకతిక వారసత్వంలో భాగమని యునెస్కో ప్రకటించింది. ప్రపంచంలోని సాంస్కతిక వారసత్వానికి సంబంధించిన అంశాల జాబితాలో కుంభమేలాను కూడా చేరుస్తున్నట్లు యునెస్కో ప్రకటించింది. ఈ జాబితాలో ఈ సంవత్సరం కొత్తగా 33 ఉత్సవాలను చేర్చారు.
సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించే ఉత్సవాలను ప్రతిసంవత్సరం ఈ జాబితాలో చేరుస్తుంటారు. కుంభమేళాను యునెస్కో గుర్తింపు లభించడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తోందని, ఇది భారతదేశానికి గర్వకారణమని ప్రధాని నరేంద్ర మోడి సంతోషం వ్యక్తంచేశారు.

పుణ్య నదిలో ప్రజలు స్నానాలు ఆచరించే పండుగగా యునెస్కో కుంభమేళాను అబివర్ణించింది. ఈ సమ్మేళనంలో సాధుసంతులు, సన్యాసులు, ప్రజలు పాల్గొంటారు. ఈ కుంభ మేళా గురించి ప్రాచీన కాలం నుండి మత, చారిత్రక గ్రంధాల ద్వారా తెలుస్తోందని, దీని గురించిన సమాచారం పరంపరా గతంగా ఒకరినుండి మరొకరికి అందుతోందని యునెస్కో పేర్కొంది.

దక్షిణ కొరియాలో నిర్వహించే జెజును కూడా సంస్కృ తిక వారసత్వంగా యునెస్కో గుర్తించింది. అలాగే ఈ జాబితాలో బంగ్లాదేశ్‌ కు చెందిన షీతల్‌ పట్టి నేతను కూడా చేర్చారు. వెదురును చాపలుగా అల్లడమే షీతల్‌ పట్టి. ఈ చాపలను పూజలు, ప్రార్థన కోసం ఉపయోగిస్తారు.