సమాజ సంఘటనకై సద్భావన సదస్సులు

సమాజంలో సమస్యలకు కారణమవుతున్న కులవిభేదాలను తొలగించి అందరిలో సమైక్య భావనను పెంపొందించే  సద్భావనా సదస్సులు  భాగ్యనగర్‌లోని వివిధ ప్రాంతాల్లో  జరిగాయి. వీటికి అన్ని కులసంఘాలకు చెందిన పెద్దలతో పాటు అపార్ట్‌మెంట్‌ల అసోసియేషన్‌ సభ్యులు, దేవాలయ కమిటీ సభ్యులు హాజరయ్యారు.

బర్కత్‌పురా, దిల్‌సుఖ్‌నగర్‌ ప్రాంతాల్లో 31 డిసెంబర్‌, 2017న పలు సద్భావన సదస్సులు జరిగాయి. సదస్సులలో వివిధ కులసంఘాలకు చెందిన పెద్దలు కులవిభేదాలు, మతమార్పిడులు వంటి సమస్యల గురించి ప్రస్తావించారు. ఆ తరువాత కార్యక్రమంలో ముఖ్యవక్తలు ఈ అభిప్రాయాలను ఆధారం చేసుకుని సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చొరవ గురించి ప్రస్తావించారు. 

బర్కత్‌పురాలో జరిగిన సదస్సులో 112మంది పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ ఐఎఫ్‌ఎస్‌ అధికారి చేగూరి ఐలయ్య, విశ్రాంత విశ్వ విద్యాలయ ఆచార్యులు డా.కసిరెడ్డి వెంకటరెడ్డి, తెలంగాణా ప్రాంత సహకుటుంబ ప్రబోధన్‌ ప్రముఖ్‌ మంత్రి శేషారావు తదితరులు పాల్గొన్నారు. 
దిల్‌సుఖ్‌నగర్‌ప్రాంతంలో కొత్తపేట, హస్తినా పురంలలో రెండు సదస్సులు జరిగాయి. కొత్తపేట సదస్సులో ఆర్‌ఎస్‌ఎస్‌ సీనియర్‌ ప్రచారక్‌ రాంపల్లి మల్లికార్జున్‌, హస్తినాపురం సదస్సులో మరొక సీనియర్‌ ప్రచారక్‌ వడ్డి విజయసారధి మాట్లాడారు. రెండు కార్యక్రమాలలో మొత్తం 120మందికి పైగా కులసంఘపెద్దలు, అసోసియేషన్‌ సభ్యులు ఇతరులు పాల్గొన్నారు.