అమరవాణి


శ్లో||    దేశరక్ష సమం పుణ్యం

    దేశ రక్షా సమం వ్రతం

    దేశరక్ష సమం యోగో

    దృష్టో నైవ చ నైవ చ
భావం : దేశరక్షణతో సమానమైన పుణ్యం, సమానమైన వ్రతం, సమానమైన యజ్ఞం ఎక్కడా చూడలేము. అంటే దేశరక్షణే సర్వశ్రేష్ట కార్యం.