ఆయుష్మాన్‌ బడ్జెట్‌


స్వాతంత్య్రానంతరం మన దేశంలో ప్రవేశ పెట్టిన బడ్జెట్‌ లన్నింటిలో ఈ సంవత్సర కాలానికి 2018, ఫిబ్రవరి 1న  ప్రవేశపెట్టిన బడ్జెట్‌ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంద నటంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. ఒక్క సంవత్సరకాలం గడిస్తే సాధారణ ఎన్నికలను ముందుంచుకుని కూడా ప్రజాకర్షక విధానానికి బదులు దేశపు  దీర్ఘకాల ప్రయోజనాలే లక్ష్యంగా ప్రజలకు వాస్తవ అభివృద్ధిపై ఆశలు రేపుతూ ఈ సంవత్సర పద్దుల ప్రణాళికను ప్రజల ముందుంచింది మోడీ ప్రభుత్వం. గత ప్రభుత్వాలు తరతరాలుగా పాటిస్తూ వచ్చిన జనాకర్షక బడ్జెట్‌కు స్వస్తి చెబుతూ ఆకర్షణకు బదులు ఆచరణకు ప్రాధాన్యతనిచ్చిన ఆర్ధిక పద్దు అని చెప్పుకోవాలి.

మహనీయులలో మహనీయుడు శ్రీ గురూజీ


భారతదేశంలో దేశమంతటిని ప్రభావితం చేసిన మహాపురుషులు అనేక మంది ఈ దేశంలో జన్మించారు. ఆదిశంకరాచార్య సాధించిన జాతీయ సమైక్యత ఒక సాంస్కృతిక విప్లవం. అలా బ్రిటిష్‌ ఆక్రమణ కాలంలో ఈ దేశంలో సాంస్కృతిక జాతీయ వాదానికి బలమైన పునాదులు వేసినవారు స్వామి వివేకానంద, బంకించంద్ర, అరవింద మహర్షి . ఆ ప్రారంభాన్ని ప్రస్పుటింపచేసిన వారు పూ|| శ్రీ గురూజీ. సాంస్కృతిక జాతీయవాదాన్ని ఈ దేశానికి స్పష్టంగా అర్థం చేయించిన వారు శ్రీ గురుజీ. రాష్ట్రీయ స్వయంసేవక సంఘ ద్వితీయ సర్‌సంఘచాలకులు. 

గణతంత్ర వేడుకలలో గట్టిపడ్డ దౌత్యసంబంధాలు


69వ గణతంత్ర దినోత్సవం విశేషంగా జరిగింది. భారత రాష్ట్రపతిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తరువాత తొలిసారి ప్రజలను ఉద్దేశించి రామనాథ్‌కోవింద్‌ ప్రసంగించారు. ఈసారి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏకంగా పది దేశాల అధినేతలను పిలిచారు. అట్లాగే వేడుకలు వీక్షించేందుకు దేశంలోని వివిధ ప్రాంతాల నుండి 61 మంది గిరిజన నేతలను ప్రత్యేకంగా ఆహ్వానించారు. 

మహాశివరాత్రి


మహాశివరాత్రి చాంద్రమానం ప్రకారం మాఘమాసంలో కృష్ణ పక్ష చతుర్దశి రోజున వస్తుంది. శివుడు ఈరోజే లింగాకారంగా ఆవిర్భవించాడని శివపురాణం తెలియ జేస్తోంది. చతుర్దశి రోజు అర్ధరాత్రి లింగోద్భవ కాలంగా పరిగణిస్తారు. పార్వతిదేవి మరియు పరమశివుడి వివాహాం జరిగిన రోజు కూడా శివరాత్రి అని భావిస్తారు. 

దేశకార్యం, ధర్మకార్యం ముఖ్యం (స్ఫూర్తి)


ఒక గృహస్థు సమస్యలతో వేగలేక శ్రీరామకృష్ణ పరమ హంస దగ్గరకు వచ్చి ''స్వామీ! నాకు దీక్ష ఇవ్వండి, నేను సన్యాసం స్వీకరిస్తాను'' అని అడిగాడు. అప్పుడు శ్రీ రామ కృష్ణులు ''నాయనా! జీవితమంటే మంచి, చెడుల మధ్య జరిగే సంగ్రామం. సన్యాసి అయినా, గృహస్థు అయినా చేయవలసినది ధర్మయుద్ధమే. సాధించవలసింది చెడుపై విజయమే. సన్యాసి అయినవాడు మైదానంలో శత్రువు మీద బహిరంగ యుద్ధం చేస్తాడు.

దేశభక్తిని, జాతీయనిష్ఠను జాగృతం చేస్తుంది (హితవచనం)


రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ హిందూ సమాజపు జాతీయ స్వరూపాన్ని గుర్తించి, హిందూ సమాజం లోని ప్రతి వ్యక్తి హృదయంలో నిరంతం ప్రజలించే దేశభక్తిని, జాతీయ నిష్ఠను జాగృతం చేసే ప్రయత్నం చేస్తుంది. దేశసేవ కొరకు సర్వసార్పణ చేయగల శీల సంపన్నమైన జీవితం గడుపుతూ దానికి అనుగుణంగా గుణాలను వికసింప జేసుకొనేలా ప్రయత్నిస్తుంది.

అమరవాణి


శ్లో|| కృతే ప్రతికృతం కుర్యాత్‌
      హింసనే ప్రతి హింసనమ్‌
      తత్ర దోషోన పతతి
దుష్టే దుష్టం సమాచరేత్‌
                   - నీతిసాగరం

ప్రముఖులు మాట


నైతిక విలువలతో కూడిన, సామాజికచింతనను పెంచే విద్య ఇప్పుడు మన అవసరం.  అప్పుడే దేశం అన్ని రంగాల్లో సరైన అభివృద్ధి సాధించగలుగుతుంది. 

- స్వస్తిశ్రీ కర్మయోగి చారుకీర్తి భట్టారక స్వామీజీ,   శ్రావణబెళగొళ జైనమఠం అధ్యక్షులు

మతమార్పిడిని వ్యతిరేకించిన సంత్‌ రవిదాస్‌


దాదాపు 650 సంవత్సరాలకు పూర్వం 1398లో మాఘ మాసం పౌర్ణిమ నాడు కాశీలో జన్మించిన సంత్‌ రవిదాస్‌ లేదా సంత్‌ రై దాస్‌ మతమార్పిడులను వ్యతిరేకించిన, మతమార్పిడికి గురైనవారిని స్వధర్మంలోకి తీసుకువచ్చేందుకు పునరాగమనాన్ని ప్రోత్సహించిన ప్రప్రధమ సంత్‌ అని చెప్పవచ్చును. 

సంత్‌ రవిదాస్‌ జయంతి కార్యక్రమం - మెదక్‌


భక్తి మార్గ ప్రభోధకులు, ఆధ్యాత్మిక చింతనతో అందరికి జ్ఞాన మార్గాన్ని చూపించిన మార్గదర్శి సంత్‌ రవిదాస్‌. సామాజిక సమరసత వేదిక ఆధ్వర్యంలో మెదక్‌లో నిర్వహించిన సంత్‌ రవిదాస్‌ జయంతి సందర్భంగా మాట్లాడుతూ

కొరేగావ్‌ కథ ఏమిటి?


మహారాష్ట్రలో పూనాకు దగ్గర కొరేగావ్‌ అనేచోట 1818లో బ్రిటిష్‌ వారికి, మరాఠాలకు మధ్య జరిగిన యుద్ధం. ఇలాంటి యుద్ధాలు ఇంకా కొన్ని జరిగాయి. కానీ హఠాత్తుగా కొరేగావ్‌ మాత్రమే వార్తల్లోకి వచ్చింది. చరిత్రలో అంతగా ప్రాధాన్యత లేని ఈ యుద్ధం ఇలా వార్తలకు ఎక్కడానికి కారణం ఏమిటి? దళితులు, బ్రాహ్మణులపై చేసిన యుద్దం చరిత్రలో ఏదైనా ఉందా అని మీడియా చాలాకాలంగా వెతుకుతోంది. 

రాజ్యాంగం, సైన్యం, ఆర్‌ ఎస్‌ ఎస్‌ భారత్‌ ను సురక్షితంగా ఉంచుతున్నాయి - కెటి థామస్‌''భారత్‌ లో ప్రజలు ఎందుకు సురక్షితంగా ఉన్నారని ఎవరైనా నన్ను అడిగితే - మొదట రాజ్యాంగం, రెండవది ప్రజాస్వామ్య వ్యవస్థ, మూడు సైన్యం, నాలుగు ఆర్‌ఎస్‌ఎస్‌వల్ల అని సమాధానం చెపుతాను'' అని జస్టిస్‌ కెటి థామస్‌ అన్నారు. కేరళలోని కొట్టాయంలో జరిగిన రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ ప్రాథమిక శిక్షావర్గ (శిక్షణ కార్యక్రమం) ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు. జస్టిస్‌ థామస్‌ సుప్రీం కోర్ట్‌ న్యాయమూర్తిగా పనిచేశారు. 

ధర్మ పరిరక్షణకే ధర్మజాగరణ కార్యక్రమాలు


ఇది హిందూదేశం. ఇక్కడ అధిక సంఖ్యాకులు హిందువులు. వేల సంవత్సరాలుగా ఇక్కడ హిందూ సంస్కృతి విలసిల్లుతోంది. భారతీయులు లేదా హిందువులు ఎప్పుడు ఏ దేశంపైన దండెత్తి, దానిని ఆక్రమించుకోలేదు. ఎవరిని బానిసలను చేయలేదు. లక్షల సంఖ్యలో హతమార్చలేదు. విశ్వమంతా ఒక కుటుంబమేనని భావించారు. 

రాణి పద్మిని కోరుకున్నది బలవన్మరణం కాదు, అమరత్వం


ఇటీవల చిత్తోడ్‌ రాణి పద్మిని గురించి చర్చ బాగా జరుగుతోంది. ముస్లిం దురాక్రమణకారుడైన అల్లాఉద్దీన్‌ ఖిల్జీ చిత్తోడ్‌ను ఆక్రమించుకున్నప్పుడు భయంతో రాణి పద్మిని మంటల్లో దూకి ఆత్మహత్య (జోహర్‌)చేసుకుందని చాలామంది ప్రచారం చేశారు. కానీ చరిత్రలో నిజాలు మరోలా ఉన్నాయి. అవేమిటో చూద్దాం.

కీరా దోసకాయ


ఆయుర్వేదం కీరా కి చాలా దగ్గరి సంబంధం ఉంది.

పిత్త దోషం ని నియంత్రించడానికీ చాలా ఉపయోగకరమైన ఔషధం.

కీరా తో మధుమేహం, రక్త పోటు, క్యాన్సర్‌, ulcer, నోటి దుర్వాసన సమస్యలు తగ్గించవచ్చు.

బీజింగ్‌ విశ్వవిద్యాలయంలో సంఘ్‌ పై అధ్యయనం


ప్రపంచంలో నేడు చైనా ఒక శక్తివంతమైన దేశంగా ఎదుగుతోంది. చైనా తన ఈ శక్తిని గుర్తించి మరింత వేగంతో ముందుకు దూసుకుపోవాలన్న ప్రయత్నంలో ఉందన్న విషయం కూడా నిజం.

హజ్‌ సబ్సిడీ రద్దుపై అనవసర రాద్ధాంతం


హజ్‌ సబ్సిడీని రద్దుచేస్తున్నట్లుగా NDA ప్రభుత్వం ప్రకటించగానే 'మరి మానససరోవర యాత్ర కోసం హిందూ యాత్రికులకు ఇచ్చే సబ్సిడీ మాటేమిటి' అని సెక్యులర్‌ మీడియా అడగడం ప్రారంభించింది. కుంభమేళా కోసం 'కుమ్మరిస్తున్న' కోట్ల రూపాయల సొమ్ము సంగతి ఏమిటని అడిగింది.