బీజింగ్‌ విశ్వవిద్యాలయంలో సంఘ్‌ పై అధ్యయనం


ప్రపంచంలో నేడు చైనా ఒక శక్తివంతమైన దేశంగా ఎదుగుతోంది. చైనా తన ఈ శక్తిని గుర్తించి మరింత వేగంతో ముందుకు దూసుకుపోవాలన్న ప్రయత్నంలో ఉందన్న విషయం కూడా నిజం.

ఆర్థిక వ్యవస్థ, సైనిక శక్తి, అంతర్జాతీయ రాజకీయాల్లో గానీ చైనా ఎవరికి తీసిపోకుండా ఉంది. ఇంతే కాదు, భారతీయ దర్శన, శాస్త్ర, ఉపనిషత్తుల అధ్యయనంతో బాటు భారతదేశంలో నడుస్తున్న సేవా కార్యక్రమాలు, వివిధ ప్రకల్పాలు, వాటివెనుక ఉన్న ప్రేరణ గురించి అధ్యయనం చేస్తోంది.

ఈ అధ్యయనం కోసం ప్రపంచంలో అతిపెద్ద సంస్థ అయిన రాష్ట్రీయ స్వయంసేవక సంఘాన్ని ఎంచుకుంది. చైనా విశ్వద్యాలయాల్లో రాష్ట్రీయ స్వయంసేవక సంఘ స్వయంసేవకుల క్రమశిక్షణ, కార్య పద్ధతి, వివిధ సేవాప్రకల్పాలతో పాటు సంఘ జ్యేష్ట ప్రచారకుల బౌద్ధిక్‌లను హిందీ నుండి చైనా భాషలోకి అనువదించుకునే పని సాగుతోంది.