సంత్‌ రవిదాస్‌ జయంతి కార్యక్రమం - మెదక్‌


భక్తి మార్గ ప్రభోధకులు, ఆధ్యాత్మిక చింతనతో అందరికి జ్ఞాన మార్గాన్ని చూపించిన మార్గదర్శి సంత్‌ రవిదాస్‌. సామాజిక సమరసత వేదిక ఆధ్వర్యంలో మెదక్‌లో నిర్వహించిన సంత్‌ రవిదాస్‌ జయంతి సందర్భంగా మాట్లాడుతూ
కాశీలో ఉండి రామానందుని శిష్యరికంలో కులాలకతీతంగా అన్ని కులాలవారికి హిందూ ధర్మము, హిందూ ధర్మ గ్రంథిలోని భక్తిని ప్రబోధించేవారని తద్వారా సమరసతకు పునాదులు వేశారని పలువురు వక్తలు అన్నారు. నిరాడంబర సాత్విక జీవనంతో, మానవాతీత శక్తి ప్రదర్శనలు చేసారని, జనసామాన్యానికి ఆదర్శవంతమైన జ్ఞానాన్ని సందేశాన్ని అందజేశారన్నారు. 

కబీర్‌దాస్‌, రవిదాస్‌ మార్గం తెలిసిన వారుగా అభివర్ణించినట్లు తెలిపారు. అంతకుముందు సంత్‌రవిదాస్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి పూజలు నిర్వహించారు. రవిదాస్‌ జీవితానికి పూల మాలలు వేసి పూజలు నిర్వహించారు. రవిదాస్‌ జీవితానికి సంబంధించిన ప్రతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సమరసత వేదిక జిల్లా బాద్యులు బైరి నర్సింలు, బైండ్ల రాంచంద్రం, భారతీయ కిసాన్‌ సంఘ్‌ జిల్లా కోశాధికారి చోళ పవన్‌ కుమార్‌, మల్లిఖార్జున్‌, నరెందర్‌, ప్రవీణ్‌, రవి, నాయుడు, రమేష్‌, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.